కూకట్‌పల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. మండలం మీదుగా జాతీయ రహదారి నెం 9 (కొత్తపేరు 65) మరియు హైదరాబాదు-వాడి రైలుమార్గం వెళ్ళుచున్నాయి. పారిశ్రామికంగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన బాచుపల్లి మండలం మరియు కుత్బుల్లాపూర్ మండలం, తూర్పున బాలానగర్ మండలం, పశ్చిమాన సంగారెడ్డి జిల్లా, దక్షిణాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని గ్రామాలు:
Kukatpally, Allapur, Moosapet, Baghameer, Hydernagar, Shamshiguda
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు: .కూకట్‌పల్లి (Kukatpally): కూకట్‌పల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది GHMCలో భాగంగా ఉంది. అంతకుక్రితం పురపాలక సంఘంగా ఉండేది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ నార్త్ జోన్ ప్రధానకేంద్రంగా ఉంది. పారిశ్రామికంగా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ముంబాయి జాతీయ రహదారి ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. మూసాపేట్ (Moosapet): మూసాపేట్ మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణప్రాంతము మరియు GHMCలో భాగంగా ఉంది. (వార్డు సంఖ్య 117). జర్మనీకి చెందిన బహుళజాతి సంస్థ Metro Cash & Carry మూసాపేటలో ఉంది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kukatpally Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి