దూలిమిట్ట సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు, 11 గ్రామపంచాయతీలు కలవు. తెలంగాణ విమోచనోద్యమంలో ప్రసిద్దిచెందిన భైరాన్‌పల్లి సంఘటన మండలంలోని భైరాన్‌పల్లి గ్రామంలో 1948 ఆగస్టులో జరిగింది. అక్టోబరు 11, 2016 నాడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ప్రస్తుత మండల ప్రాంతం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలో చేర్చబడింది. డిసెంబరు 8, 2020న మద్దూరు మండలాన్ని విభజించి 8 గ్రామాలతో కొత్తగా దూలిమిట్ట మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: మద్దూరు మండలం సిద్ధిపేట జిల్లాలో దక్షిణంవైపున జనగామ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన చేర్యాల మండలం, ఉత్తరాన నంగనూరు మండలం, ఈశాన్యాన అక్కన్నపేట మండలం, తూర్పున మరియు దక్షిణాన జనగామ జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలము జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 11 ఎంపీటీసి స్థానాలున్నాయి.
దూలిమిట్ట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Bairanpally, Bekkal, Dhoolumitta, Jalapally, Lingapoor, Thoranala, Kondapur, Kutigal
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
భైరాన్‌పల్లి (Bhairanpally):భైరాన్‌పల్లి సిద్ధిపేట జిల్లా దూలిమిట్ట మండలమునకు చెందిన గ్రామము. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు వరంగల్ జిల్లాలో ఉండేది. 1947-48లో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఈ గ్రామం పేరుప్రఖ్యాతులు సంపాదించింది. పలుమార్లు గ్రామస్థులు రాజాకార్లకు ఎదుర్కొనగా 1948 ఆగస్టు 27న 1200 మంది సైనికులు, రజాకార్లు ఆయుధాలతో వచ్చి గ్రామస్థులను పట్టుకొని సుమారు 116 మందిని వరసలో నిలబెట్టి కాల్చిచంపారు. ఇది భైరాన్‌పల్లి సంఘటనగా ప్రసిద్దిచెందినది. తర్వాత ఆ ప్రాంతంలో అమరవీరుల స్తూపం నిర్మించారు. ఇది తెలంగాణ జలియన్‌వాలా బాగ్‌గా ప్రసిద్ధి చెందింది. దూలిమిట్ట (Dulimitta) : దూలిమిట్ట సిద్ధిపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లాలోకి చేరింది. మద్దూరు మండలంలో ఉన్న ఈ గ్రామం డిసెంబరు 8, 2020న దూలిమిట్ట మండలం ఏర్పాటుతో మండలకేంద్రంగా మారింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Maddur Mandal Siddipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి