వరంగల్ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌లో భాగంగా ఉంది. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో తూర్పు వైపున వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులో ఉంది. కాజీపేట-విజయవాడ రైలుమార్గం, 202 నెంబర్ జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. ప్రముఖ పాత్రికేయుడు, కేంద్ర సమాచార కమీషనర్‌గా పనిచేసిన మాడభూషి శ్రీధర్ ఈ మండలానికి చెందినవారు.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలంలోకి 3 రెవెన్యూ గ్రామాలను హన్మకొండ మండలం నుంచి చేర్చగా, ఈ మండలంలోని 3 గ్రామాలు ఖిలా ఘన్‌పూర్ మండలానికి తరలించారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన హసన్‌పర్తి మండలం, దక్షిణాన ఖిలా వరంగల్ మండలం, పశ్చిమాన హన్మకొండ మండలం, తూర్పున వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
రాజకీయాలు:
ఈ మండలంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు (వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్) కలవు. ఇవి వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. ఈ మండలం మొత్తం గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌లో భాగంగా ఉంది.
వరంగల్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Deshaipeta, Enumamula, Girmajipet, Kothapet, Laxmipur, Mattewada, Paidipally, Ramannapet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఎనుమాముల (Enumamula): ఎనుమాముల వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ మండలంనకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణప్రాంతము మరియు గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థలో భాగంగా ఉంది. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఎనుమాముల మార్కెట్ కమిటి ఈ గ్రామంలో ఉంది. గిర్మాజీపేట (Girmajipet): గిర్మాజీపేట వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ మండలంనకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణప్రాంతము మరియు గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థలో భాగంగా ఉంది. ప్రముఖ పాత్రికేయుడు, కేంద్ర సమాచార కమీషనర్‌గా పనిచేసిన మాడభూషి శ్రీధర్ ఈ గ్రామానికి చెందినవారు.
వరంగల్ (Warangal):
వరంగల్ జిల్లాకు చెందిన నగరము. దీని పూర్వనామం ఓరుగల్లు. కాకతీయుల కాలంలో నిర్మించబడి వారి కాలంలో ఇది రాజధానిగా విలసిల్లింది. కాకతీయుల కాలంలో పెద్ద కోట నిర్మించబడింది. నగరంలో భద్రకాళి ఆలయం, కాకతీయవిశ్వవిద్యాలయం, నిట్ ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాదు తర్వాత ఇది రెండో పెద్ద నగరం. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు తన రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినాడు. గణపతిదేవుని కుమారై రుద్రమదేవి కాలంలో ఓరుగల్లు ప్రఖ్యాతి చెందింది. క్రీడాభిరామం గ్రంథంలో ఓరుగల్లు పట్టణ విశేషాలు వర్ణించబడింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Warangal Mandal in Telugu, Warangal Urban Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి