వెంకటాపూర్ ములుగు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం, రామప్ప సరస్సు మండలంలోని పాలంపేటలో ఉన్నాయి. రామానుజాపూర్‌లో కాకతీయుల కాలం నాటి పంచకూటాలయం ఉంది. ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, తెరాస పార్టీ ప్రతినిధి అయిన వీరమల్ల ప్రకాశ్ ఈ మండలానికి చెందినవారు. 2016కు ముందు వరంగల్ జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరింది. 2019లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ మండలం ములుగు జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున తాడ్వాయి (సమ్మక్క సారక్క) మండలం, దక్షిణాన గోవిందరావు పేట మండలం మరియు ములుగు మండలం, ఉత్తరాన మరియు పశ్చిమాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుగా ఉంది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 36559. ఇందులో పురుషులు 18481, మహిళలు 18078. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38900. ఇందులో పురుషులు 19448, మహిళలు 19452.
రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన రజిత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన గాయ రుద్రమదేవి ఎన్నికయ్యారు.
వెంకటాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: అడవి రంగాపూర్ (Adavirangapur), తిమ్మాపూర్ (Thimmapur), నర్సాపురం (Narasapuram), నల్లగుంట (Nallagunta), పాలంపేట (Palampeta), బండ్లపహాడ్ (Bandlapahad), రామనాథపల్లి (Ramanathapalle), రామానుజాపూర్ (Ramanujapuram), లక్ష్మీదేవిపేట (Laxmidevipeta), వెంకటాపూర్ (Venkatapur),
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బూరుగుపేట (Burugupet): బూరుగుపేట ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంనకు చెందిన గ్రామము. గ్రామానికి చెందిన మోతె రామస్వామి బృందం చెక్కబొమ్మలాట ప్రదర్శనలో ప్రసిద్ధి. ప్రస్తుతం ఈ కళను దేశం మొత్తంలో రెండు బృందాలు మాత్రమే ప్రదర్శిస్తున్నాయి. వాటిలో ఇది ఒకటి అని ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. పాలంపేట (Palampet): పాలంపేట ములుగు జిల్లా వెంకటాపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయం ఉంది. పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని క్రీ.శ.1213లో పూర్తి చేసినట్లు అక్కడి శాసనంలో ఉంది. పాలంపేట దేవాలయాన్ని కాకతీయుల కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ ఆలయం అసలుపేరు రుద్రేశ్వరాలయం. రామప్పగుడి సమీపంలో ఉన్న చెరువు రామప్ప సరస్సుగా ప్రసిద్ధి చెందింది. ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, తెరాస పార్టీ ప్రతినిధి అయిన వీరమల్ల ప్రకాశ్ ఈ గ్రామానికి చెందినవారు. రామానుజాపూర్ (Ramunujapur):
రామానుజాపూర్ ములుగు జిలాకు చెందిన గ్రామము. గ్రామంలో కాకతీయుల కాలం నాటి (13వ శతాబ్దికి చెందిన) పంచకూటాలయం ఉంది. ఒకే మండపంలో ఐదు విడివిడి ఆలయాలు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Venkatapur Mandal in Telugu, Mulugu Dist (district) Mandals in telugu, Mulugu Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి