బాలానగర్ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
బాలానగర్ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

28, అక్టోబర్ 2020, బుధవారం

బాలానగర్ మండలం (Balanagar Mandal)

జిల్లామేడ్చల్
రెవెన్యూ డివిజన్మల్కాజ్‌గిరి
అసెంబ్లీ నియోకూకట్‌పల్లి & శేరిలింగంపల్లి
లోకసభ నియోమల్కాజ్‌గిరి,
చేవెళ్ళ
జనాభా
567320
రెవెన్యూ గ్రామాలు
8
(ఇది మేడ్చల్ జిల్లా బాలానగర్ మండల వ్యాసము. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం కోసం ఇక్కడ చూడండి)
బాలానగర్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. ఇది హైదరాబాదు నగరానికి సమీపంలో ఉంది. మండల పరిధిలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మండలంలో 8  రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం మీదుగా హైదరాబాదు-వాడి రైలుమార్గం, జాతీయ రహదారి నెం.9 (కొత్తపేరు 65) మరియు 7 (కొత్త పేరు 44) వెళ్ళుచున్నాయి. బేగంపేట విమానాశ్రయం ఈ మండలంలో ఉంది.

రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన కుత్బుల్లాపూర్ మండలం, ఈశాన్యాన ఆల్వాల్ మండలం, వాయువ్యాన కూకట్‌పల్లి మండలం, తూర్పున మరియు దక్షిణాన హైదరాబాదు జిల్లా సరిహద్దుగా ఉంది. మండలం మీదుగా హైదరాబాదు-వాడి రైలుమార్గం, జాతీయ రహదారి నెం.9 (కొత్తపేరు 65) మరియు 7 (కొత్త పేరు 44) వెళ్ళుచున్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 371345. ఇందులో పురుషులు 166327, మహిళలు 151018. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 567320. ఇందులో పురుషులు 291904, మహిళలు 275416.మండలం మొత్తం పట్టణ ప్రాంతమే.

రాజకీయాలు:
రాజకీయాలు:
ఈ మండలం కూకట్‌పల్లి మరియు శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలలో భాగంగా ఉంది. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం పరిధిలోనూ, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఉనాయి. గ్రేటర్ హైదరాబాదులో బాలానగర్ 120వ వార్డులో భాగంగా ఉంది.

 
మండలంలోని గ్రామాలు:
Balanagar, Ferozguda, Zinkalawada, Fathenagar, Old bowenpally, Hasmathpet, Begumpet, Babbuguda
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
.
బాలానగర్ (Balanagar) :
బాలానగర్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది హైదరాబాదు నగరంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో ఒకటి. గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో 120వ వార్డులో భాగంగా ఉంది. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.
బేగంపేట (Begumpet ):
బేగంపేట మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది హైదరాబాదు నగరంలోనే ఒక ముఖ్యమైన ప్రాంతము. 6వ నిజాం మహబూబ్‌అలీఖాన్ కూతురు బషీర్ ఉన్నీసా బేగం పేరిట దీనికి ఈ పేరు వచ్చింది. బేగంపేటలో విమానాశ్రయం ఉంది. శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభమయ్యే వరకు ఇది హైదరాబాదు విమానాశ్రయంగా పనిచేసింది. సికింద్రాబాదు-వాడి మార్గంలో బేగంపేటలో రైల్వేస్టేషన్ ఉంది.
ఫతేనగర్ (Fateh Nagar):
ఫతేనగర్ మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది బేగంపేట విమానాశ్రయం సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో చిన్నతరహా పరిశ్రములు అధికంగా ఉన్నాయి. ఫతేనగర్‌లో MMTS రైల్వేస్టేషన్ ఉంది.
హష్మత్‌పేట్ (Hasmathpet) :
హష్మత్‌పేట్ మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది హైదరాబాదు నగరంలో (సికింద్రాబాదు) భాగంగా ఉంది. చారిత్రక హష్మత్‌పేట్ కైరన్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. బాన్ చెరువు పేరిట ఒక పెద్ద చెరువు కూడా ఉంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం కూడా ఈ చెరువులో చేస్తారు.
ఓల్డ్ బోయిన్‌పల్లి (Old bowenpally):
ఓల్డ్ బోయిన్‌పల్లి మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది జంటనగరాలలో సికింద్రాబాదు పరిధిలోకి వస్తుంది. 44వ నెంబర్ జాతీయ రహదారి ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. చాళుక్య త్రైలోక్య త్రిభువనమల్ల పేరిట దీనికి భువనపల్లి పేరు వచ్చింది. క్రమేణా బోయిన్‌పల్లిగా మారింది.



ఇవి కూడా చూడండి:
  • బేగంపేట విమానాశ్రయం (Begumpet Airport),
  • హైదరాబాదు పబ్లిక్ స్కూల్ (Hyderabad Public School),
 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా మండలాలు, బాలానగర్ మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
  • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
  • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


Balanagar Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

22, జనవరి 2013, మంగళవారం

బాలానగర్ మండలము (Balanagar Mandal)

జిల్లా మహబూబ్‌నగర్
రెవెన్యూ డివిజన్మహబూబ్‌నగర్
జనాభా61592 (2001)
66894 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంజడ్చర్ల
లోకసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్
ముఖ్య పంటలుమొక్కజొన్న,వరి
(ఇది మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలం. మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలం కోసం ఇక్కడ చూడండి)
బాలానగర్ మండలము మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలము. 44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు - డోన్ రైలుమార్గము మండలము గుండా వెళ్ళుచున్నాయి. ఈ మండలము మహబూబ్ నగర్ మరియు హైదరాబాదు మధ్యలో ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 66894. ఈ మండలము మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. గుండ్లపోచంపల్లి, రాజాపూర్, రంగారెడ్డిగూడ, గుండేడు, కుచ్చర్కల్, బాలానగర్, ఉడిత్యాల్, పెద్దాయిపల్లిలలో పరిశ్రమలున్నాయి. విమోచనోద్యమకారుడు సర్రాఫ్ వెంకటేశ్వరరావు ఈ మండలమునకు చెందినవారు.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున షాద్ నగర్ మండలం, తూర్పున కేశంపేట్ మండలం, దక్షిణమున జడ్చర్ల మండలం, పశ్చిమమున నవాబ్ పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 61592. ఇందులో పురుషులు 31283, మహిళలు 30309.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 66894. ఇందులో పురుషులు 34141, మహిళలు 32753. జనాభాలో ఇది జిల్లాలో 18వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
మండలం గుండా 7వ నెంబరు జాతీయ రహదారి మరియు రైల్వేలైన్ వెళుచున్నందున రవాణా సౌకర్యం బాగుగా ఉంది. మండలంలో 3 రైల్వేస్టేషన్లు కలవు. అవి బాలానగర్, రంగారెడ్డి గూడా మరియు రాజాపూర్.

రాజకీయాలు:
ఈ మండలము జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోదండరామిరెడ్డి, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంచిరాల సాయికృష్ణ ఎన్నికయ్యారు. 2014లో ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన భాగ్యమ్మ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 87 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 86 మండల పరిషత్తు), 12 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 5 ప్రైవేట్), 13 ఉన్నత పాఠశాలలు (3 ప్రభుత్వ, 9 జడ్పీ, 1 ప్రైవేట్), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

జడ్చర్ల నియోజకవర్గంలో
బాలానగర్ మండల స్థానం (గులాబి రంగు)
పరిశ్రమలు:
రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండుట మరియు జాతీయ రహదారిపై ఉండుటచే మండలంలో పరిశ్రమలు కూడా అధికంగానే ఉన్నాయి. గుండ్లపోచంపల్లిలో బిలాస్ రైకా స్పాంజ్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జీటీఎస్ ఇండస్ట్రీస్ (యార్న్ ప్రాసెసింగ్), రాజాపూర్ లో కూల్-వెల్ హైటెక్ కోల్డ్ స్టోరేజి లిమిటెడ్, సల్గురి ఇండస్ట్రీస్, సూర్యజ్యోతి స్పిన్నింగ్ మిల్స్, విజయ్ టెక్స్ టైల్స్ లిమిటెడ్, రంగారెడ్డిగూడలో జీఆర్ కేబుల్స్ లిమిటెడ్, బాలానగర్ మండల కేంద్రంలో జీవీకె నోవాపాన్ ఇండస్ట్రీస్, సువర్ణ అపారెల్ లిమిటెడ్, గుండేడులో ఎంవైకే స్పిన్నింగ్ ఇండస్ట్రీస్, మహావీర్ ఫెర్రో అల్లాయ్స్, దిలీప్ రీరోలింగ్ లిమిటెడ్,  అప్పాజీపల్లిలో రియాక్టివ్ మెటల్స్ లిమిటెడ్, కుచ్చర్లల్ లో సూర్యజ్యోతి స్పిన్నింగ్ మిల్స్, ఉడిత్యాలలో తన్మయి ఇస్పాత్ లిమిటెడ్, పెద్దాయిపల్లిలో కాంటూర్ స్టీల్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పరిశ్రమలు కలవు.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 27916 హెక్టార్లలో 30% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంటలు మొక్కజొన్న,వరి. కందులు, జొన్నలు, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 596 మిమీ. మండలంలో సుమారు 2900 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

సంఘటనలు:
  • 1964 డిసెంబరు 5: బూర్గుల రామకృష్ణారావు ఆనంద్ కుటీర్ ప్రారంభానికి భగవాన్ శ్రీసత్యసాయిబాబా బాలానగర్ వచ్చారు.
  • 2009, సెప్టెంబరు 7: ముదిరెడ్డిపల్లి సర్పంచి బుచ్చిరెడ్డి మరణించారు.
  • 2010, డిసెంబరు 22: ముఖ్యమంత్రి మండలాన్ని సందర్శించారు. ఈద్గానిపల్లి వంతెనను ప్రారంభించారు. 
  • 2014, ఆగస్టు 10: బాలానగర్ ఏపిజివిబి బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన దొంగతనం జరిగింది.
మండల ప్రముఖులు:
  • సర్రాఫ్ వెంకటేశ్వరరావు 1927 జూన్ 4న బాలానగర్ మండలం కుచ్చర్ కల్ గ్రామంలో జన్మించారు. ఇతను స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసేవకుడు. 1940 నుంచి గాంధీ కార్యక్రమాలకు ఆకర్షితులై పనిచేయనారంభించారు. మహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన సభలో ఆర్యసమాజ్ నాయకుడు పండిత్ నరేంద్ర ఉత్తేజకర ప్రసంగం విని, ప్రేరణ పొంది నిజాం నిరంకుశ పాలనకు, మతోన్మాదులైన రజాకార్లకు వ్యతిరేకంగా పనిచేశారు. 1947-48లో స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధిగా అచ్చంపేట తాలుకా నుంచి ఎన్నుకోబడ్డారు. 1952లో వినోబాభావే ప్రారంభించిన భూదానోలో కూడా పాల్గొన్నారు. 

విభాగము: బాలానగర్ మండలంలోని గ్రామాలు
(Portal: Villages in Balanagar Mandal)
(11-10-2016 కంటె ముందునాటికి)
  1. అగ్రహారం పొట్లపల్లి (Agraharam Potlapally),
  2. అప్పాజీపల్లి (Appajipally),
  3. బాలానగర్ (Balanagar),
  4. బీబీనగర్ (Bibinagar),
  5. బోడజానంపేట (Bodajanampeta),
  6. చెన్నవల్లి (Chennavally),
  7. చిన్నరేవల్లి (Chinna Revally),
  8. దొండ్లపల్లి (Dondlapally),
  9. ఈద్గాన్‌పల్లి (Edganpally),
  10. గౌతాపూర్ (Gouthapur),
  11. గుండేడ్ (Gunded),
  12. గుండ్లపొట్లపల్లి (Gundlapotlapally),
  13. హేమాజీపూర్ (Hemajipur),
  14. కల్లేపల్లి (Kallepally),
  15. కేతిరెడ్డిపల్లి (Kethireddipally),
  16. ఖానాపూర్ (Khanapur),
  17. కుచ్చర్‌కల్ (Kuchcherkal),
  18. కుత్నేపల్లి (Kuthnepally),
  19. లింగారం (Lingaram),
  20. మాచారం (Macharam),
  21. మల్లేపల్లి (Mallepally),
  22. మోదంపల్లి (Modampally),
  23. మోతిఘన్‌పూర్ (Mothighanapur),
  24. నందారం (Nandaram),
  25. నేరెళ్ళపల్లి (Nerellapally),
  26. పెద్దరేవల్లి (Peddarevelly),
  27. పెద్దాయిపల్లి (Peddayapally),
  28. రాఘవాపుర్ (Raghvapur),
  29. రాయిపల్లి (Raipally),
  30. రాజాపూర్ (Rajapur),
  31. రంగారెడ్డిగూడ (Rangareddiguda),
  32. సేరిగూడ (Seriguda),
  33. సూరారం (Suraram),
  34. తిరుమలగిరి (Thirumalagiri),
  35. తిర్మలాపూర్ (Thirumalapur),
  36. ఉడిత్యాల్ (Udithyal),
  37. వనంవానిగూడ (Vanamavaniguda),
 రెవెన్యూ గ్రామాలు కాని పంచాయతీలు
  1. ముదిరెడ్డిపల్లి (Mudireddipally),
  2. వీరన్నపల్లి (Veerannapally),
అనుబంధ గ్రామాలు



హోం,
విభాగాలు:
మహబూబ్ నగర్ జిల్లా మండలాలుబాలానగర్ మండలము,  మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం,

 = = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011. 
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు,


16, డిసెంబర్ 2013, సోమవారం

బాలానగర్ (Balanagar)

  బాలానగర్ గ్రామము
గ్రామముబాలానగర్
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3415 (2001)
1824 (2011)
బాలానగర్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామము 44వ నెంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల-షాద్‌నగర్ మధ్యలో ఉన్నది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం కూడా గ్రామం గుండా వెళ్ళుచున్నది. గ్రామంలో ఏపిజివిబి బ్యాంకు శాఖ ఉంది. ఏనుగుల వీరస్వామి కాశీయాత్రలో భాగంగా ఈ గ్రామం మీదుగా వెళ్ళినారు. గ్రామం చుట్టూ కోట ఉన్నట్లుగా తెలిపినారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3415. ఇందులో పురుషులు 1743, మహిళలు 1672.గృహాల సంఖ్య 678.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3635. ఇందులో పురుషులు 1824, మహిళలు 1811. గృహాల సంఖ్య 848. అక్షరాస్యత శాతం 58.49%. గ్రామ కోడ్ సంఖ్య 575104.

రవాణా సౌకర్యాలు:
బాలానగర్ గ్రామం 7వ నెంబరు (కొత్త పేరు 44వ) జాతీయ రహదారిపై జడ్చర్ల మరియు షాద్‌నగర్‌ల మధ్యలో ఉంది. కాబట్టి గ్రామస్థులకు ఆర్టీసి మరియు ప్రైవేటు వాహనాలు బాగా అందుబాటులో ఉన్నాయి. గ్రామానికి రైలు సదుపాయం కూడా ఉంది. బాలానగర్ రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైళ్ళు ఆపుతారు.

గ్రామంలో ఉన్న కోట ముఖద్వారం


బాలానగర్ గ్రామపంచాయతి కార్యాలయం
బాలానగర్ మండల పరిషత్తు కార్యాలయము

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వి.శాంతి దస్రం నాయక్ ఎన్నికయ్యారు.
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన భాగ్యమ్మ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతిపై 453 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 

కాలరేఖ:
  • 2014, ఆగస్టు 10: బాలానగర్ ఏపిజివిబి బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన దొంగతనం జరిగింది.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

17, ఫిబ్రవరి 2013, ఆదివారం

బాలానగర్ రైల్వేస్టేషన్ (Balanagar Railway Station)

బాలానగర్ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషన్. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు  డివిజన్ లో భాగంగా, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ పై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 72కిమీ, డోన్ నుంచి 224 కిమీ దూరంలో ఉన్నది. ఇది బూర్గుల రైల్వేస్టేషన్ మరియు రంగారెడ్డిగూడ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. బాలానగర్ స్టేషన్ బూర్గుల నుంచి 3 కిమీ, రంగారెడ్డిగూడ స్టేషన్ నుంచి 6 కిమీ దూరంలో ఉంది. రోజూ 14 రైళ్ళు (రానుపోను కలిపి) ఈ స్టేషన్ లో ప్రయాణీకులకోసం ఆగుతాయి. ఇవన్నీ ప్యాసింజర్ రైళ్ళు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,  బాలానగర్ మండలము,   

= = = = =

18, ఫిబ్రవరి 2013, సోమవారం

రంగారెడ్డిగూడ రైల్వేస్టేషన్ (Rangareddyguda Railway Station)

రంగారెడ్డిగూడ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో భాగంగా, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ పై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 78కిమీ, డోన్ నుంచి 218 కిమీ దూరంలో ఉన్నది. ఇది బాలానగర్ స్టేషన్ మరియు రాజాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. రంగారెడ్డిగూడ స్టేషన్ బాలానగర్ నుంచి 6 కిమీ, రాజాపుర్ నుంచి 5 కిమీ దూరంలో ఉంది. రోజూ 8 రైళ్ళు (రానుపోను కలిపి) ఈ స్టేషన్ లో ప్రయాణీకులకోసం ఆగుతాయి. ఇవన్నీ ప్యాసింజర్ రైళ్ళు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లుబాలానగర్ మండలము,   

= = = = =

16, డిసెంబర్ 2013, సోమవారం

విభాగము: బాలానగర్ మండలంలోని గ్రామాలు (Portal: Villages in Balanagar Mandal)

విభాగము: బాలానగర్ మండలంలోని గ్రామాలు
(Portal: Villages in Balanagar Mandal)
  1. అగ్రహారం పొట్లపల్లి (Agraharam Potlapally),
  2. అప్పాజీపల్లి (Appajipally),
  3. బాలానగర్ (Balanagar),
  4. బీబీనగర్ (Bibinagar),
  5. బోడజానంపేట (Bodajanampeta),
  6. చెన్నవల్లి (Chennavally),
  7. చిన్నరేవల్లి (Chinna Revally),
  8. దొండ్లపల్లి (Dondlapally),
  9. ఈద్గాన్‌పల్లి (Edganpally),
  10. గౌతాపూర్ (Gouthapur),
  11. గుండేడ్ (Gunded),
  12. గుండ్లపొట్లపల్లి (Gundlapotlapally),
  13. హేమాజీపూర్ (Hemajipur),
  14. కల్లేపల్లి (Kallepally),
  15. కేతిరెడ్డిపల్లి (Kethireddipally),
  16. ఖానాపూర్ (Khanapur),
  17. కుచ్చర్‌కల్ (Kuchcherkal),
  18. కుత్నేపల్లి (Kuthnepally),
  19. లింగారం (Lingaram),
  20. మాచారం (Macharam),
  21. మల్లేపల్లి (Mallepally),
  22. మోదంపల్లి (Modampally),
  23. మోతిఘన్‌పూర్ (Mothighanapur),
  24. నందారం (Nandaram),
  25. నేరెళ్ళపల్లి (Nerellapally),
  26. పెద్దరేవల్లి (Peddarevelly),
  27. పెద్దాయిపల్లి (Peddayapally),
  28. రాఘవాపుర్ (Raghvapur),
  29. రాయిపల్లి (Raipally),
  30. రాజాపూర్ (Rajapur),
  31. రంగారెడ్డిగూడ (Rangareddiguda),
  32. సేరిగూడ (Seriguda),
  33. సూరారం (Suraram),
  34. తిరుమలగిరి (Thirumalagiri),
  35. తిర్మలాపూర్ (Thirumalapur),
  36. ఉడిత్యాల్ (Udithyal),
  37. వనంవానిగూడ (Vanamavaniguda),
 రెవెన్యూ గ్రామాలు కాని పంచాయతీలు
  1. ముదిరెడ్డిపల్లి (Mudireddipally),
  2. వీరన్నపల్లి (Veerannapally),
అనుబంధ గ్రామాలు



విభాగాలు: బాలానగర్ మండలము,  మహబూబ్‌నగర్ జిల్లా మండలాల వారీగా గ్రామాలు,

కేతిరెడ్డిపల్లి (Kethireddipally)

 కేతిరెడ్డిపల్లి గ్రామము
గ్రామముకేతిరెడ్డిపల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1652 (2001)
1906 (2011)
కేతిరెడ్డిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1906. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామము 44వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. గ్రామ ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయము. పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయలు పండిస్తారు. ఆగస్టు 2010లో తెలంగాణపై నియమించిన శ్రీకృష్ణ కమిటి ఈ గ్రామాన్ని సందర్శించింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1652. ఇందులో పురుషులు 856, మహిళలు 793. గృహాల సంఖ్య 336.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1906. ఇందులో పురుషులు 997, మహిళలు 909. గృహాల సంఖ్య 445. అక్షరాస్యత శాతం 48.53%. గ్రామ కోడ్ సంఖ్య 575113.


గ్రామపాలన:
ఈ గ్రామం పంచాయతి కేంద్రము. గ్రామపాలన గ్రామపంచాయతీచే నిర్వహించబడుతుంది. గ్రామ పారిశుద్ధ్యం, వీధిదీపములు, సిసి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం తదితర పనులు గ్రామపంచాయతి చేపడుతుంది. ప్రస్తుత గ్రామ సర్పంచి సుధాకర్ రావు. ఇదివరకు కె.సుదర్శన్ రావు (1982-95), జె.లక్ష్మణ్ నాయక్ (1995-2001), వి.శేఖరయ్య (2001-06), డి.కృష్ణయ్య (2006-11)లు సర్పంచిగా పనిచేశారు. ప్రస్తుత సర్పంచి సుధాకర్ రావు.
ప్రస్తుత సర్పంచ్
కె.సుదర్శన్ రావు
2001-06 కాలంలో
గ్రామ సర్పంచి వి.శేఖరయ్య


రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సుధాకర్ రావు ఎన్నికయ్యారు.






(గ్రామ సమాచారం అందించిన మాజీ సర్పంచి వి.శేఖరయ్య మరియు ప్రస్తుత సర్పంచి సుదర్శన్‌రావు  గారికి కృతజ్ఞతలు)

విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కల్లేపల్లి (Kallepally)

 కల్లేపల్లి గ్రామము
గ్రామముకల్లేపల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1220 (2001)
1387 (2011)
కల్లేపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1387.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1220. ఇందులో పురుషులు 601, మహిళలు 619.గృహాల సంఖ్య 231.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1387. ఇందులో పురుషులు 710, మహిళలు 677. గృహాల సంఖ్య 296. అక్షరాస్యత శాతం 46.58%. గ్రామ కోడ్ సంఖ్య 575133.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మేకల చెన్నమ్మ ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాములు తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన వెంకట్యాపై 169 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

తిరుమలగిరి (Thirumalagiri)

 తిరుమలగిరి గ్రామము
గ్రామముతిరుమలగిరి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2640 (2001)
2911 (2011)
తిరుమలగిరి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2911.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2640. ఇందులో పురుషులు 1370, మహిళలు 1270. గృహాల సంఖ్య 485.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2911. ఇందులో పురుషులు 1506, మహిళలు 1405. గృహాల సంఖ్య 646. అక్షరాస్యత శాతం 33.32%. గ్రామ కోడ్ సంఖ్య 575136.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా తిరుపతినాయక్ ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన కిషన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన బాసుపై 103 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

రాజాపూర్ (Rajapur)

రాజాపూర్ గ్రామము
గ్రామమురాజాపూర్
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5098 (2001)
5849 (2011)
రాజాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5849. ఈ గ్రామం జాతీయ రహదారిపై ఉంది. గ్రామానికి రైలు సదుపాయం కూడా ఉంది. గ్రామంలో గ్రామీణ బ్యాంకు శాఖ ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5098. ఇందులో పురుషులు 2587, మహిళలు 2511.గృహాల సంఖ్య 1102.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5849. ఇందులో పురుషులు 2929, మహిళలు 2920. గృహాల సంఖ్య 1325. అక్షరాస్యత శాతం 53.07%. గ్రామ కోడ్ సంఖ్య 575129.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా హన్మగల్ల లక్ష్మమ్మ ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో భాజపాకు చెందిన బుచ్చమ్మ తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంటుగా పోటీచేసిన రాములమ్మపై 86 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 
రాజాపూర్ గ్రామంలోని ఒక వీధి

రాజాపూర్ గ్రామపంచాయతి కార్యాలయం

విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

గౌతాపూర్ (Gowthapur)

 గౌతాపూర్ గ్రామము
గ్రామముగౌతాపూర్ 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1031 (2001)
1127 (2011)
గౌతాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1127.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1031. ఇందులో పురుషులు 528, మహిళలు 503.గృహాల సంఖ్య 211.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1127. ఇందులో పురుషులు 582, మహిళలు 545. గృహాల సంఖ్య 282అక్షరాస్యత శాతం 49.87%. గ్రామ కోడ్ సంఖ్య 575117.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా పి.చంద్రయ్య ఎన్నికయ్యారు.



గౌతాపూర్ గ్రామంలోని ఒక వీధి


గౌతాపూర్ గ్రామపంచాయతి కార్యాలయము



విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

పెద్దరేవల్లి (Peddarevalli)

పెద్దరేవల్లి గ్రామము
గ్రామముపెద్దరేవల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2572 (2001)
2832 (2011)
పెద్దరేవల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2832.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2572. ఇందులో పురుషులు 1289, మహిళలు 1283.గృహాల సంఖ్య 521.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2832. ఇందులో పురుషులు 1442, మహిళలు 1390. గృహాల సంఖ్య 641. అక్షరాస్యత శాతం 46.33%. గ్రామ కోడ్ సంఖ్య 575120.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మాధవి బంద్యాల ఎన్నికయ్యారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

అగ్రహారం పొట్లపల్లి (Agraharam Potlapally)

 అగ్రహారం పొట్లపల్లి గ్రామము
గ్రామముఅగ్రహారం పొట్లపల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా454 (2001)
436 (2011)
అగ్రహారం పొట్లపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 436.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 454. ఇందులో పురుషులు 226, మహిళలు 228.గృహాల సంఖ్య 110.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 436. ఇందులో పురుషులు 225, మహిళలు 211. గృహాల సంఖ్య 98. అక్షరాస్యత శాతం 47.94%. గ్రామ కోడ్ సంఖ్య 575123.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ముదావత్ కేస్లి ఎన్నికయ్యారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

చిన్నరేవల్లి (Chinna Revalli)

చిన్నరేవల్లి గ్రామము
గ్రామముచిన్నరేవల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2989 (2001)
3380 (2011)
చిన్నరేవల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3380.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2989. ఇందులో పురుషులు 1519, మహిళలు 1470.గృహాల సంఖ్య 511.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3380. ఇందులో పురుషులు 1737, మహిళలు 1643. గృహాల సంఖ్య 805. అక్షరాస్యత శాతం 42.28%. గ్రామ కోడ్ సంఖ్య 575135.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బాతుల శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన సునీత తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపై 55 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

లింగారం (Lingaram)

లింగారం గ్రామము
గ్రామములింగారం 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా223 (2001)
284 (2011)
లింగారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 284.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 223. ఇందులో పురుషులు 111, మహిళలు 112.గృహాల సంఖ్య 40.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 284. ఇందులో పురుషులు 138, మహిళలు 146. గృహాల సంఖ్య 62. అక్షరాస్యత శాతం 43.66%. గ్రామ కోడ్ సంఖ్య 575119.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

అప్పాజీపల్లి (Appajipally)

అప్పాజీపల్లి  గ్రామము
గ్రామముఅప్పాజీపల్లి  
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా410 (2001)
518 (2011)
అప్పాజీపల్లి  మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 518.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 410. ఇందులో పురుషులు 207, మహిళలు 203.గృహాల సంఖ్య 82.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 518. ఇందులో పురుషులు 275, మహిళలు 243. గృహాల సంఖ్య 122. అక్షరాస్యత శాతం 39.19%. గ్రామ కోడ్ సంఖ్య 575121.

విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

ఈద్గాన్‌పల్లి (Edganpally)

ఈద్గాన్‌పల్లి గ్రామము
గ్రామముఈద్గాన్‌పల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2270 (2001)
2357 (2011)
ఈద్గాన్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2357.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2270. ఇందులో పురుషులు 1144, మహిళలు 1126.గృహాల సంఖ్య 451.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2357. ఇందులో పురుషులు 1187, మహిళలు 1170. గృహాల సంఖ్య 572. అక్షరాస్యత శాతం 39.33%. గ్రామ కోడ్ సంఖ్య 575132.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జె.గోపాల్ ఎన్నికయ్యారు. 
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన స్వరూపరాణి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతిపై 125 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

రాఘవాపూర్ (Raghavapur)

 రాఘవాపూర్ గ్రామము
గ్రామముఅగ్రహారం  
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1078 (2001)
1086 (2011)
రాఘవాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1086.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1078. ఇందులో పురుషులు 547, మహిళలు 531.గృహాల సంఖ్య 180.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1086. ఇందులో పురుషులు 543, మహిళలు 543. గృహాల సంఖ్య 248. అక్షరాస్యత శాతం 38.21%. గ్రామ కోడ్ సంఖ్య 575108.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

గుండ్లపొట్లపల్లి (Gundlapotlapally)

గుండ్లపొట్లపల్లి గ్రామము
గ్రామముగుండ్లపొట్లపల్లి 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా725 (2001)
933 (2011)
గుండ్లపొట్లపల్లి మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 933.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 725. ఇందులో పురుషులు 372, మహిళలు 353.గృహాల సంఖ్య 159.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 933. ఇందులో పురుషులు 458, మహిళలు 475. గృహాల సంఖ్య 231. అక్షరాస్యత శాతం 55.84%. గ్రామ కోడ్ సంఖ్య 575124.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జి.శరణమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక