పెనుబల్లి ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
పెనుబల్లి ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

15, అక్టోబర్ 2020, గురువారం

పెనుబల్లి మండలం (Penuballi Mandal)

జిల్లాఖమ్మం
రెవెన్యూ డివిజన్కల్లూర్
అసెంబ్లీ నియోసత్తుపల్లి
లోకసభ నియోఖమ్మం
పెనుబల్లి ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 33 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఈ మండలనకు చెందినవారు. మండలంలో లంకాసాగర్ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ఉంది. ఇది సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగము.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున సత్తుపల్లి మండలం, ఆగ్నేయాన వేంసూర్ మండలం, పశ్చిమాన కల్లూరు మండలం, ఉత్తరాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52864. ఇందులో పురుషులు 26249, మహిళలు 26615.

రాజకీయాలు:
ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన లక్కినేని అలేఖ్య ఎన్నికయ్యారు.
 
మండలంలోని గ్రామాలు:
Adavimallayala, Bayyannagudem, Bhavnnapalem, Chinthagudem, Chowdaram, Ganeshpadu, Gollagudem, Gowararam, Karaigudem, Kondrupadu, Kuppenakuntla, Lankapalli, lingagudem, Mandalapadu, Penuballi, Ramachandrapuram, Tallapenta, Tekulapalli, Telgaram, Tummalapalli, Yerugatla
ప్రముఖ గ్రామాలు:
.
బయన్నగూడెం (Bayannagudem):
బయన్నగూడెం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలమునకు చెందిన గ్రామము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఈ గ్రామానికి చెందినవారు.

ఇవి కూడా చూడండి:
 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, పెనుబల్లి మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Penuballi Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

11, అక్టోబర్ 2020, ఆదివారం

కల్లూరు మండలం (Kallur Mandal)

జిల్లాఖమ్మం
రెవెన్యూ డివిజన్కల్లూరు
అసెంబ్లీ నియోసత్తుపల్లి
లోకసభ నియోఖమ్మం
కల్లూరు ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 18 ఎంపీటీసి స్థానాలు, 31 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63835.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున పెనుబల్లి మండలం, పశ్చిమాన తల్లాడ మండలం, వాయువ్యాన ఎన్కూరు మండలం, ఉత్తారన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63835. ఇందులో పురుషులు 31831, మహిళలు 32004.

రాజకీయాలు:
ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో కల్లూరు మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బీరవెల్లి రఘు, జడ్పీటీసీగా కట్టా అజయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు.
 
మండలంలోని గ్రామాలు:
Bathulapalli, Chandrupatla, Chennuru, Chinnakorukondi, Erraboinapalli, Gokaram, Gopaladeviboinapally, Kalluru, Khankhanpeta, Korlagudem, Laxmipuram, Lokaram, Mucharam, Narayanapuram, Payapur, Peddakorukondi, Peruvancha, Raghunadhagudem, Ravikampadu, Talluru, Telgaram (IW), Vennavalli, Yagnanarayanapuram,
ప్రముఖ గ్రామాలు:
కల్లూరు (Kallur):
కల్లురు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఇది కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది.


 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, కల్లూరు మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Kallur Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

15, అక్టోబర్ 2020, గురువారం

సత్తుపల్లి మండలం (Sattupally Mandal)

జిల్లాఖమ్మం
రెవెన్యూ డివిజన్కల్లూర్
అసెంబ్లీ నియోసత్తుపల్లి
లోకసభ నియోఖమ్మం
సత్తుపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలోని బేతుపల్లి చెరువు నుంచి తమ్మిలేరు నది పుట్టుతుంది. మండల పరిధిలో కాకతీయుల మరియు రెడ్డి రాజుల కాలం నాటి ప్రాచీన దేవాలయాలు, కోటలు ఉన్నాయి.
 
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతితూర్పున ఉంది. ఈ మండలానికి పశ్చిమాన పెనుబల్లి మండలం, దక్షిణాన వేంసూర్ మండలం, ఉత్తరాన మరియు తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగ్నేయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:
సత్తుపల్లికి వెయ్యేళ్ళ ఘనచరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండటమే కాకుండా ఈ మండల పరిధిలో పలు దేవాలయాలు, నిర్మాణాలు చేశారు. తుమ్మూరు, తర్వాత రెడ్డి రాజులు 2 శతాబ్దాలు పాలించారు. రెడ్డిరాజులు తుమ్మూరు (తుంబూరు)లో మట్టికోటను, కళ్యాణమండపాన్ని నిర్మించారు. రెడ్డిరాజుల తర్వాత నిజాంలు పాలించారు. 1947-48లో రజాకార్లకు, నిజాం పాలనకు వ్యతిరేకంగా సత్తుపల్లికి యోధులు ఉద్యమించారు. సెప్టెంబరు 1948లో నిజాం పాలన ముగిసి భారత యూనియన్ లో హైదరాబాదు రాష్ట్రంలో భాగమైంది. 1969లో మరియు 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. 2011లో 42 రోజులపాటు సకలజనుల సమ్మె సంపూర్ణంగా జరిగింది. జూన్ 2, 2014లో మండలం తెలంగాణలో భాగమైంది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 77074. ఇందులో పురుషులు 38424, మహిళలు 38650.
 
సత్తుపల్లి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
మండలంలోని గ్రామాలు:
Ayyagaripeta, Bethupally, Cherukupally, Dacharam, Jaganadhapuram, Kakarlapally, Kistaram, Kommepally, Regallapadu, Rejerla, Rudrakashapally, Sadhasivunipalem, Sathupally, Siddharam, Thumburu, Yathalakunta
ప్రముఖ గ్రామాలు:
.
బేతుపల్లి (Bethupalli):
బేతుపల్లి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలమునకు చెందిన గ్రామము. కాకతీయ బేతరాజు మీదుగా గ్రామానికి ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. గ్రామంలో కాకతీయుల కాలం నాటి పురాతనమైన శివాలయం ఉంది.
సత్తుపల్లి (Sattupaly):
సత్తుపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన పట్టణం మరియు మండల కేంద్రము. సత్తుపల్లిలో శ్రీజ్ఞానసరస్వతీ దేవాలయం ఉంది. ఇది పురపాలక సంఘము మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రం.

ఇవి కూడా చూడండి:

 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, సత్తుపల్లి మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Sathupalli or Sattupali Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

17, అక్టోబర్ 2020, శనివారం

వేంసూర్ మండలం (Vemsur Mandal)

జిల్లాఖమ్మం
రెవెన్యూ డివిజన్కల్లూర్
అసెంబ్లీ నియోసత్తుపల్లి
లోకసభ నియోఖమ్మం
వేంసూర్ ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన పెనుబల్లి మండలం మరియు సత్తుపల్లి మండలం ఉండగా మిగితా వైపులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42908. ఇందులో పురుషులు 21845, మహిళలు 21063. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 45233. ఇందులో పురుషులు 22914, మహిళలు 22319.

రాజకీయాలు:
ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన పగుట్ల వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.
 
మండలంలోని గ్రామాలు:
Adasarlapadu, Ammapalem, Bharanipadu, Chowdaram (Ogiralavada), Duddepudi, Guduru, Kallurugudem, Kandukuru, Kondrugatlamallela, Kunchaparthy, Pallevada, Vemsoor, Vennachedu, Yerragunta
ప్రముఖ గ్రామాలు:
.
కందుకూరు (Kandukur):
కందుకూరు ఖమ్మం జిల్లా వేంసూరు మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ 5 దశాబ్దాల చరిత్ర ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. మండల కేంద్రం వేంసూరు తర్వాత మండలంలో ఇది అత్యధిక జనాభా కల రెండవ గ్రామము.
కుంచపర్తి (kunchakurthy):
కుంచపర్తి ఖమ్మం జిల్లా వేంసూర్ మండలమునకు చెందిఅ గ్రామము. గ్రామంలో మారెమ్మ ఆలయం ఉంది
వేంసూరు (Vemsur):
వేంసూరు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం ఉంది.

ఇవి కూడా చూడండి:

 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, వేంసూర్ మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Vemsur or Vemsoor Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

19, డిసెంబర్ 2013, గురువారం

సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (Sattupally Assembly Constituency)

సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాకు చెందిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గంలో 5 మండలాలున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. గతంలో ఈనియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ప్రాతినిధ్యం వహించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
  • తల్లాడ,
  • సత్తుపల్లి,
  • పెనుబల్లి,
  • కల్లూరు,
  • వేంసూరు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1994 తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ
1999 తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ పి.సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 జలగం వెంకటరావు కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
2009 ఎస్.వెంకటవీరయ్య తెలుగుదేశం పార్టీ సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ
2014 ఎస్.వెంకటవీరయ్య తెలుగుదేశం పార్టీ దయానంద్ వైకాపా
2018 సండ్ర వెంకటవీరయ్య తెలుగుదేశం పార్టీ పిడమర్తి రవి తెరాస

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జలగం వెంకటరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తుమ్మల నాగేశ్వరరావుపై 9536 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. వెంకటరావుకు 89986 ఓట్లు రాగా, నాగేశ్వరరావు 80450 ఓట్లు పొందినారు.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఎస్.వెంకటవీరయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన సంభాని చంద్రశేఖర్ పై 14008 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టికి చెందిన వెంకటవీరయ్య తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దయానంద్ పై 2778 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున పిడమర్తి రవి, భాజపా తరఫున నంబూరి రామలింగేశ్వరరావు, ప్రజాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య పోటీచేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన పిడమర్తి రవి పై 19002 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, ఖమ్మం లోకసభ నియోజకవర్గం, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

22, జూన్ 2013, శనివారం

విభాగము: ఖమ్మం జిల్లా మండలాలు (Portal: Khammam Dist Mandals)

 విభాగము: ఖమ్మం జిల్లా మండలాలు
(Portal: Khammam Dist Mandals)
  1. బోనకల్ మండలం (Bonakal Mandal),
  2. చింతకాని మండలం (Chintakani Mandal),
  3. ఎన్కూరు  (ఎంకూరు) మండలం (Enkuru Mandal),
  4. కల్లూరు మండలం (Kalluru Mandal),
  5. కామేపల్లి మండలం (Kamepalli Mandal),
  6. ఖమ్మం గ్రామీణ మండలం (Khammam Rural Mandal),
  7. ఖమ్మం పట్టణ మండలం (Khammam Urban Mandal),
  8. కొణిజెర్ల మండలం (Konijerla Mandal),
  9. కూసుమంచి మండలం (Kusumanchi Mandal),
  10. మధిర మండలం (Madhira Mandal),
  11. ముదిగొండ మండలం (Mudigonda Mandal),
  12. నేలకొండపల్లి మండలం (Nelakondapalli Mandal),
  13. పెనుబల్లి మండలం (Penuballi Mandal),
  14. రఘునాథపాలెం మండలం (Raghunathapalem Mandal),
  15. సత్తుపల్లి మండలం (Sathupalli Mandal),
  16. సింగరేణి మండలం (Singareni Mandal),
  17. తల్లాడ మండలం (Thallada or Tallada Mandal),
  18. తిరుమలాయపాలెం మండలం (Thirumalayapalem Mandal),
  19. వేంసూర్ మండలం (Vemsoor Mandal),
  20. వైరా మండలం (Wyra Mandal),
  21. ఎర్రుపాలెం మండలం (Yerrupalem Mandal),

హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా, తెలంగాణ మండలాలు,

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు,  వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక