రాజకీయ నాయకుడిగా పేరుపొందిన రాం విలాస్ పాశ్వాన్ జూలై 5, 1946న బీహార్‌లోని షహర్‌బన్నిలో జన్మించారు. సంయుక్త సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన పాశ్వాన్ 1969లో తొలిసారిగా బీహార్ శాసనసభకు ఎన్నికైనారు. మొత్తం 8 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నిక కావడమే కాకుండా ఐదుగురు ప్రధానమంత్రుల హయంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా ఉంటూ అక్టోబరు 8, 2020న ఢిల్లీలో మరణించారు. ఈయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కూడా రాజకీయ నాయకుడిగా పేరుపొందారు.
రాజకీయ ప్రస్థానం: సంయుక్త సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన పాశ్వాన్ 1969లో తొలిసారిగా బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1974లో లోక్‌దళ్ పార్టీలో చేరి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. రాజ్ నారాయణ్, జయప్రకాష్ నారాయణ, కర్పూరి ఠాకుర్ ల ముఖ్యమైన అనుచరుడిగా ఉంటూ 1975లో ఇందిరగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించి జైలుకు వెళ్ళారు. 1977లో జనతాపార్టీ తరఫున తొలిసారిగా హాజీపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైనారు. ఈ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. 1989లో తొలిసారిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 1996లో దేవగౌడ మంత్రివర్గంలో, 1999లో వాజపేయి మంత్రివర్గంలో, 2004లో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంల్లో స్థానం పొందారు. 2014లో యుపిఏ కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ కూతమిలో చేరి నరేంద్రమోడి మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. 2020లో మరణించే సమయానికి మోడి ప్రభుత్వంలో ఆహార, ప్రజాపంపిణి శాఖ మంత్రిగా ఉన్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
10, అక్టోబర్ 2020, శనివారం
రాం విలాస్ పాశ్వాన్ (Ram Vilas Paswan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి