వైరా ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
వైరా ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

17, అక్టోబర్ 2020, శనివారం

వైరా మండలం (Wyra Mandal)

జిల్లాఖమ్మం
రెవెన్యూ డివిజన్ఖమ్మం
అసెంబ్లీ నియోవైరా
లోకసభ నియోఖమ్మం
మండల ప్రముఖులు
కందిబండ రంగారావు, మల్లు అనంత రాములు
వైరా ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు.మండల పరిధిలో వైరా జలాశయం ఉంది. విమోచనోద్యమ నాయకుడు కందిబండ రంగారావు, సాహితీవేత్త కావూరి పాపయ్యశాస్త్రి, కేంద్రమంత్రిగా పనిచేసిన మల్లు అనంత రాములు ఈ మండలమునకు చెందినవారు. మండలం గుండా వైరానది ప్రవహిస్తోంది.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున తల్లాడ మండలం, దక్షిణాన మధిర మండలం, నైరుతిన బోనకల్ మండలం, పశ్చిమాన చింతకాని మండలం, వాయువ్యాన మరియు ఉత్తరాన కొణిజెర్ల మండలం, ఆగ్నేయాన కొంతభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54333. ఇందులో పురుషులు 26788, మహిళలు 27545.

రాజకీయాలు:
ఈ మండలము వైరా అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ప్రముఖ రాజకీయ నాయకులు మల్లు అనంతరాములు, మల్లు రవి ఈ మండలమునకు చెందినవారు. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన  వేల్పుల పావని ఎన్నికయ్యారు.
 
మండలంలోని గ్రామాలు:
Astanagurthi, Brahmanapalli (AG), Dachapuram, Gannavaram, Garikapadu, Gollapudi, Gollenapadu, Khanapuram, Kondakodima, Lingannapalem, Medibanda, Musalimadugu, Narapunenipalli, Paladugu, Poosalapadu, Punyapuram, Rebbavaram, Siripuram (KG), Somavaram, Tatipudi, Vallapuram, Veppalamadaka
ప్రముఖ గ్రామాలు:
.

ఇవి కూడా చూడండి:
  • వైరానది,
  • వైరా రిజర్వాయర్, 
  • కందిబండ రంగారావు,
  • కావూరి పాపయ్యశాస్త్రి,
  • మల్లు అనంతరాములు, 
  • మల్లు రవి,
 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, వైరా మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Wyra or Vyra, Waira Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

19, డిసెంబర్ 2013, గురువారం

వైరా అసెంబ్లీ నియోజకవర్గం (Vyra Assembly Constituency)

వైరా అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాకు చెందిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గంకొత్తగా ఆవిర్భవించింది. ఇందులో 5 మండలాలున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
  • కారేపల్లి,
  • ఎంకూరు,
  • కొణిజెర్ల,
  • తల్లాడ,
  • వైరా

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 బానోత్ చంద్రావతి సి.పి.ఎం. రాంచంద్రనాయక్ కాంగ్రెస్ పార్టీ
2014 మదన్‌లాల్ వైఎస్సార్ కాంగ్రెస్ బానోత్ బాలాజీ తెలుగుదేశం పార్టీ
2018 లావుద్య రాములు నాయక్ ఇండిపెండెంట్ బానోత్ మదన్‌లాల్ తెరాస

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీచేసిన సి.పి.ఎం.అభ్యర్థి బానోత్ చంద్రావతి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాంచంద్రనాయక్ పై 13661 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చంద్రావతికి 53090 ఓట్లురాగా, రాంచంద్రనాయక్‌కు 393464 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి బానో వాణికి 16665 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 13 అభ్యర్థులు పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మదన్‌లాల్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బానోత్ బాలాజీపై 10583 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2014, సెప్టెంబరు 1న మదన్‌లాల్ తెరాసలో చేరారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున బానోతు మదన్‌లాల్, భాజపా తరఫునభూక్యా రేష్మాబాయి, ప్రజాకూటమి తరఫున సీపీఐ పార్టీకి చెందిన బానోతు విజయ పోటీచేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి లావుద్య రాములు నాయక్ తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన బానోత్ మదన్‌లాల్ పై 2013 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, ఖమ్మం లోకసభ నియోజకవర్గం, వైరా అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

14, అక్టోబర్ 2020, బుధవారం

కొణిజెర్ల మండలం (Konijerla Mandal)

జిల్లాఖమ్మం
రెవెన్యూ డివిజన్ఖమ్మం
అసెంబ్లీ నియోవైరా
లోకసభ నియోఖమ్మం
కొణిజెర్ల  ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల తూర్పు సరిహద్దులో వైరా రిజార్వాయర్ ఉంది.
 
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యభాగంలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యాన ఎన్కూరు మండలం, తూర్పున తల్లాడ మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన వైరా మండలం, నైరుతిన చింతకాని మండలం, వాయువ్యాన రఘునాథ పాలెం మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 61464. ఇందులో పురుషులు 30929, మహిళలు 30535.

రాజకీయాలు:
ఈ మండలము వైరా అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన  గోసు మధుసూదన్ రావు ఎన్నికయ్యారు.
 
కొణిజెర్ల మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
మండలంలోని గ్రామాలు (18):
Ammapalem, Duddepudi, Goparam, Gopathi, Gubbagurthi, Gundrathimadugu, Kacharam H, Kondavanamala, Konijerla, Lingagudem, Mallupally, Munagala, Pallipadu, Singaraipalem, Sivaruvenkatapuram, Thanikella, Thummalapally, Yathamkuntla

మండలంలోని గ్రామపంచాయతీలు (27):
అమ్మపాలెం, అంజనాపురం, అన్నవరం, బొడ్య తండా, చిన్న గోపతి, చిన్న మునగాల, గద్దలగూడెం, గోపారం, గుబ్బగుర్తి, గుండ్రాతి మడుగు, కొండవనమాల, కొణిజర్ల, కొత్తకాచారం, లక్ష్మీపురం, లింగగూడెం, మల్లుపల్లి, మేకలకుంట, పెద్దగోపతి, పెదమునగాల, రాజ్యతండా, రామనరసయ్య నగర్, సాలెబంజర, సింగరాయపాలెం, తీగలబంజర, తనికెళ్ళ, తుమ్మలపల్లి, ఉప్పలచలక
ప్రముఖ గ్రామాలు:
.

ఇవి కూడా చూడండి:

 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, కొణిజెర్ల మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Konijerla Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

29, నవంబర్ 2014, శనివారం

కందిబండ రంగారావు (Kandibanda Ranga Rao)

కందిబండ రంగారావు
జననంనవంబరు 26, 1907
స్వస్థలంసిరిపురం (ఖమ్మం జిల్లా)
రంగంవిమోచనోద్యమం
మరణం23 ఆగస్టు, 1987
విమోచనోద్యమకారుడిగా పేరుపొందిన కందిబండ రంగారావు ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో నవంబరు 26, 1907న జన్మించారు. 1927లో నిజాంకళాశాల నుంచి బి.ఏ. డిగ్రీ తీసుకుని ఖమ్మం జిల్లాలో ప్రప్రథమ పట్టభద్రుడైనారు. వంశపారంపర్యంగా వస్తున్న గ్రామకరణంగా పనిచేస్తుండేవారు. గ్రామ సర్పంచిగా, వైరా పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడిగా, తెలంగాణ గ్రామాధికారుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసారు.1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. మృత్యువు అంచుల్లోకి వెళ్లి చివరి క్షణంలో తప్పిం చుకుని స్వేచ్ఛా జీవితాన్ని పొందారు. రంగారావు తన స్వగ్రా మమైన సిరిపురంలో 23 ఆగస్టు, 1987న మరణించారు.

విభాగాలు: ఖమ్మం జిల్లా సమరయోధులు, వైరా మండలం, 1907లో జన్మించినవారు, 1987లో మరణించినవారు,


 = = = = =

సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,

16, అక్టోబర్ 2020, శుక్రవారం

తల్లాడ మండలం (Tallada Mandal)

జిల్లాఖమ్మం
రెవెన్యూ డివిజన్కల్లూర్
అసెంబ్లీ నియోసత్తుపల్లి
లోకసభ నియోఖమ్మం
తల్లాడ ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పశ్చిమ సరిహద్దులో వైరా రిజార్వాయర్ ఉంది. మండలంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున మరియు దక్షిణాన కల్లూరు మండలం, పశ్చిమాన కొణిజెర్ల మండలం, నైరుతిన వైరా మండలం, ఉత్తరాన ఎన్కూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55825. ఇందులో పురుషులు 27945, మహిళలు 27880.

రాజకీయాలు:
ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన దొడ్డా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
 
మండలంలోని గ్రామాలు:
Annarugudem, Balapeta, Baswapuram, Billupadu, Gopalpeta, Kalakodima, Kodavatimetta, Kurnavalli, Laxmipuram, Mallaram, Mittapalli, Muddunuru, Nutankal, Pinapaka, Ramanujavaram, Rejerla, Tallada, Telagaram, Vengannapeta
ప్రముఖ గ్రామాలు:
.
గోపాల్‌పేట (Tallada):
గోపాల్‌పేట ఖమ్మం జిల్లా తల్లాడ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో బయోమెడికల్ వేస్టేజీ ప్లాంట్ నిర్మించబడింది

ఇవి కూడా చూడండి:
  • వైరా రిజార్వాయర్,
  •  
 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, తల్లాడ మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Tallada Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

23, సెప్టెంబర్ 2020, బుధవారం

జూలూరుపాడు మండలం (Julurpad Mandal)

జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
రెవెన్యూ డివిజన్ కొత్తగూడెం
అసెంబ్లీ నియోజకవర్గంవైరా
లోకసభ నియోజకవర్గంఖమ్మం
జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము.  మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు కలవు. 
 
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన టేకులపల్లి మండలం, ఈశాన్యాన సుజాతానగర్ మండలం, తూర్పున చంద్రుగొండ మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 33421. ఇందులో పురుషులు 16811, మహిళలు 16610.

రాజకీయాలు:
ఈ మండలము వైరా అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన లావుడ్యా సోని ఎన్నికయ్యారు.



జులూర్‌పాడు మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Gundepudi, Julurupad, Kakarla, Karivarigudem, Machinenipeta, Nallabandabodu, Padamatinarsapuraam, Papakollu


ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

కాకర్ల (Kakarla) :
కాకర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలమునకు చెందిన గ్రామము. కాకర్ల గ్రామసమీపంలో పాలగుట్టపై స్వయంభూగా వెలిసిన సంతాన వేణిగోపాలస్వామి ఆలయం ఉంది.


ఇవి కూడా చూడండి:



ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలాలు,  జులూర్‌పాడు మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 237 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://kothagudem.telangana.gov.in/te/ (Official Website of Bhadradri Kothagudem Dist)


Julurpad Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,

11, అక్టోబర్ 2020, ఆదివారం

ఎన్కూరు మండలం (Enkuru Mandal)

జిల్లాఖమ్మం
రెవెన్యూ డివిజన్కల్లూర్
అసెంబ్లీ నియోవైరా
లోకసభ నియోఖమ్మం
ఎన్కూరు ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పత్తిపంటకు, మిరప పంటకు ప్రసిద్ధి. టెలివిజన్ నటి లలిత ఈ మండలమునకు చెందినది.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన సింగరేణి మండలం, దక్షిణాన తల్లాడ మండలం, పశ్చిమాన రఘునాథపాలెం మండలం, నైరుతిన కొణిజెర్ల మండలం, వాయువ్యాన కామేపల్లి మండలం, తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 35532. ఇందులో పురుషులు 18019, మహిళలు 17513. స్త్రీపురుష నిష్పత్తి 972/ప్రతి వెయ్యి పురుషులకు.

రాజకీయాలు:
ఈ మండలము వైరా అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన  అరెం వరలక్ష్మి ఎన్నికయ్యారు.
 
ఎన్కూరు మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
మండలంలోని గ్రామాలు:

ప్రముఖ గ్రామాలు:
ఎన్కూరు (Enkuru):
ఎన్కూరు (ఎంకూరు) ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. టెలివిజన్ నటి లలిత ఈ గ్రామానికి చెందినది.


 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, ఎన్కూరు మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Enkur or Yenkur Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

10, అక్టోబర్ 2020, శనివారం

సింగరేణి మండలం (Singareni Mandal)

జిల్లా ఖమ్మం
జిల్లా
రెవెన్యూ డివిజన్ ఖమ్మం
అసెంబ్లీ నియోజకవర్గంవైరా
లోకసభ నియోజకవర్గంఖమ్మం
సింగరేణి ఖమ్మం  జిల్లాకు చెందిన మండలము. ఈ మండలానికి మరోపేరు కారేపల్లి మండలం. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 41 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. కాజీపేట -విజయవాడ రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది.  
 
 
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతి ఉత్తరాన ఉంది. ఈ మండలానికి  దక్షిణాన కామేపల్లి మండలం, ఆగ్నేయాన ఎన్కూరు మండలం, ఉత్తరాన మరియు తూర్పున భద్రాద్రి కొత్తగూడెం మండలం, పశ్చిమాన మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. డోర్నకల్ - విజయవాడ సెక్షన్‌లో కారేపల్లి రైల్వేస్టేషన్ ఉంది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54908. ఇందులో పురుషులు 27603, మహిళలు 27305.

రాజకీయాలు:
ఈ మండలం వైరా అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన  శకుంతల ఎన్నికయ్యారు.



సింగరేణి మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు (11):
Bajumallaigudem, Gatekarepally, Kamalapuram, Komatlagudem, Madharam, Manikyaram, Perupally, Relakayalapally, Singareni, Usirikayalapally, Vishwanadhapally
 
మండలంలోని పంచాయతీలు (41):
అప్పయ్యగూడెం, భాగ్యనగర్ తండా, బజుమల్లాయిగూడెం, బాజ్య తండా, బోటితండా, చీమలపాడు, చిన్నమదన్‌పల్లి, దుబ్బ తండా, గడిపాడు, గంగారం తండా, గేట్ కారేపల్లి, గట్టి రెలకాయలపల్లి, గిడ్డవారిగూడెం, గంపలగూడెం, గుట్టకిందగంప, జైత్రంతండ, కమలాపురం, కొమట్లగూడెం, కొమ్మగూడెం, కొత్త తండా, మాదారం, మంగలి తండా, మాణిక్యారం, మోట్లగూడెం, నానునగర్ తండా, పాత కమలాపురం, పాటిమీద గంపు, పేరుపల్లి, పొలంపల్లి, రావోజితండా, రేగులగూడెం, రెలకాయలపల్లి, సీతారాంపురం, సింగరేణి, సూర్యతండ, టేకులగూడెం, తోడితాళగూడెం, ఉసిరికాయలపల్లి, వెంకటయ్య తండా, విశ్వనాధపల్లి, ఎర్రబోడు



ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

...:
...


ఇవి కూడా చూడండి:



ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: ఖమ్మం జిల్లా మండలాలు,  సింగరేణి మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Singareni Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

30, మార్చి 2018, శుక్రవారం

తెలంగాణలో కొత్త పురపాలక సంఘాలు (Newly formed Muncipalities in telangana)

తెలంగాణలో పురపాలక సంఘాలు
ఇదివరకు ఉన్న పురపాలక సంఘాలు73 (MC+Corp)
కొత్తగా ఏర్పడ్డ పురపాలక సంఘాలు71
మొత్తం పురపాలక సంఘాలు144 (MC+Corp)


తెలంగాణ రాష్ట్రంలో మార్చి 30న కొత్తగా 71 పురపాలక సంఘాలు ఏర్పాటుచేశారు. దీనితో తెలంగాణలో 140కి పైగా పురపాలక సంఘాలు ఉన్నాయి. కొత్తగా 22 జిల్లాలలో అవతరించిన పురపాలక సంఘాల పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి.

  1. కరీంనగర్ జిల్లా : చొప్పదండి, కొత్తపల్లి
  2. కామారెడ్డి జిల్లా : ఎల్లారెడ్డి
  3. ఖమ్మం జిల్లా : వైరా
  4. జగిత్యాల జిల్లా : రాయికల్, ధర్మపురి
  5. జోగులాంబ గద్వాల జిల్లా : వడ్డేపల్లి, ఆలంపూర్
  6. నల్గొండ జిల్లా : నక్రేకల్, విజయపురి సౌత్, చిట్యాల, హాలియా, చండూర్
  7. నిజామాబాదు జిల్లా : భీంగల్
  8. నిర్మల్ జిల్లా : ఖానాపూర్
  9. పెద్దపల్లి జిల్లా : మంథని
  10. మంచిర్యాల జిల్లా : నర్సాపూర్, చెన్నూర్, క్యాతపల్లి, లక్సెట్టిపేట
  11. మహబూబాబాదు జిల్లా : డోర్నకల్, మరిపెడ, తొర్రూర్
  12. మహబూబ్‌నగర్ జిల్లా : మక్తల్, భూత్పూర్, కోస్గి
  13. మెదక్ జిల్లా : తూఫ్రాన్, రామాయంపేట, నర్సాపూర్
  14. మేడ్చల్ జిల్లా : జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్, కొంపల్లి, బొరంపేట, దుండిగల్
  15. యాదాద్రి భువనగిరి జిల్లా : మోత్కూరు, చౌటుప్పల్, ఆలేరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట
  16. రంగారెడ్డి జిల్లా : శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, బండ్లగూడ జాగీర్, ఆదిభట్ల, శంకర్‌పల్లి, తుక్కుగూడ, ఆమన్‌గల్,
  17. వనపర్తి జిల్లా : కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత
  18. వరంగల్ గ్రామీణ జిల్లా : వర్థన్నపేట
  19. వికారాబాదు జిల్లా : పరిగి, కోడంగల్
  20. సంగారెడ్డి జిల్లా : నారాయణఖేడ్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్
  21. సిద్ధిపేట జిల్లా : చేర్యాల,
  22. సూర్యాపేట జిల్లా : నేరెడుచెర్ల, తిరుమలగిరి


విభాగాలు: తెలంగాణ పురపాలక సంఘాలు, 


 = = = = =



Tags: New Muncipalities in telangana, Choppadandi, Kothapalli, Yellareddy, Wyra, Raikal, Dharmapuri, Waddepalli, Alampur, Nakrekal, Vijayapuri South, Chityal, Halia, Chandur, Bheemgal, Khanapur, Manthani, Narsapur, Chennur, Kyathapalli, Laxettipet, Dornakal, Maripeda, Thorrur, Makthal, Bhoothpur, Kosgi, Thupran, Ramayampet, Narsapur, Jawaharnagar, Dammaipet, Nagaram, Pocharam, Ghatkesar, Tumkunta, Nijampet, Bachupalli, Pragathinagar, Kompalli, Borampet, Dundigal, Mothkur, Chowthuppal, Alair, Pochampalli, Yadagirigutta, Shamshabad, Turkayanjil, Manikonda, Narsimgi, Bandlaguda, Adibhatla, Shankarpalli, Thukkuguda, Kothakota, Pebbair, Athmakur, Amarchinta, Varthannapet, Pargi, Kodangal, narayankhed, Bollaram, Tellapur, Aminpur, Cheryal, Neredcherla, Thirumalagiri

18, మే 2020, సోమవారం

తెలంగాణ పురపాలక సంఘాలు (Telangana Muncipalities)


తెలంగాణ పురపాలక సంఘాలు
క్రమ సంఖ్యపురపాలక సంఘం పేరువార్డుల సంఖ్యస్థాపన
ఆదిలాబాదు జిల్లా
1అదిలాబాదు పురపాలక సంఘం49
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
2కొత్తగూడెం పురపాలక సంఘం36
3పాల్వంచ పురపాలక సంఘం

4ఇల్లందు పురపాలక సంఘం24
5మణుగూరు పురపాలక సంఘం

జగిత్యాల జిల్లా
6మెట్‌పల్లి పురపాలక సంఘం262004
7జగిత్యాల పురపాలక సంఘం48
8కోరుట్ల పురపాలక సంఘం33
9రాయికల్ పురపాలక సంఘం12
10ధర్మపురి పురపాలక సంఘం15
జనగామ జిల్లా
11జనగామ పురపాలక సంఘం301953
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
12భూపాలపల్లి పురపాలక సంఘం 30
జోగులాంబ గద్వాల జిల్లా
13గద్వాల పురపాలక సఘం371952
14అయిజ పురపాలక సంఘం20
15వడ్డేపల్లి పురపాలక సంఘం10
16అలంపూర్ పురపాలక సంఘం10
కామారెడ్డి జిల్లా
17కామారెడ్డి పురపాలక సంఘం49
18బాన్సువాడ పురపాలక సంఘం19
19ఎల్లారెడ్డి పురపాలక సంఘం12
కొమంరంభీం జిల్లా
20సిర్పూర్ కాగజ్‌నగర్‌ పురపాలక సంఘం30
కరీంనగర్ జిల్లా
21హుజూరాబాద్ పురపాలక సంఘం30
22జమ్మికుంట పురపాలక సంఘం30
23చొప్పదండి పురపాలక సంఘం14
24కొత్తపల్లి పురపాలక సంఘం12
ఖమ్మం జిల్లా
25సత్తుపల్లి పురపాలక సంఘం23
26మధిర పురపాలక సంఘం22
27వైరా పురపాలక సంఘం20
మహబూబాబాదు జిల్లా
28మహబూబాబాదు పురపాలక సంఘం36
29డోర్నకల్ పురపాలక సంఘం15
30మరిపెడ పురపాలక సంఘం15
31తొర్రూరు పురపాలక సంఘం16
మహబూబ్‌నగర్ జిల్లా
32మహబూబ్‌నగర్ పురపాలక సంఘం491952
33భూత్‌పూర్‌ పురపాలక సంఘం10
34బాదేపల్లి పురపాలక సంఘం

మంచిర్యాల జిల్లా
35మంచిర్యాల పురపాలక సంఘం36
36బెల్లంపల్లి పురపాలక సంఘం34
37మందమర్రి పురపాలక సంఘం

38లక్సెట్టిపేట పురపాలక సంఘం15
39చెన్నూరు పురపాలక సంఘం18
40నస్పూర్ పురపాలక సంఘం25
41క్యాతన్‌పల్లి పురపాలక సంఘం22
మెదక్ జిల్లా
42మెదక్ పురపాలక సంఘం32
43నర్సాపూర్ పురపాలక సంఘం15
44రామాయంపేట పురపాలక సంఘం12
45తూప్రాన్ పురపాలక సంఘం16
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా
46మేడ్చల్ పురపాలక సంఘం23
47దమ్మాయిగూడ పురపాలక సంఘం18
48నాగారం పురపాలక సంఘం20
49గుండ్ల పోచంపల్లి పురపాలక సంఘం15
50కొంపల్లి పురపాలక సంఘం18
51ఘట్‌కేసర్ పురపాలక సంఘం18
52పోచారం పురపాలక సంఘం18
53దుండిగల్ పురపాలక సంఘం18
54తూంకుంట పురపాలక సంఘం16
నాగర్‌కర్నూల్ జిల్లా
55నాగర్‌కర్నూల్ పురపాలక సంఘం24
56కొల్లాపూర్ పురపాలక సంఘం20
57అచ్చంపేట పురపాలక సంఘం

58కల్వకుర్తి పురపాలక సంఘం22
నల్గొండ జిల్లా
59నల్గొండ పురపాలక సంఘం481953
60దేవరకొండ పురపాలక సంఘం20
61మిర్యాలగూడ పురపాలక సంఘం48
62నక్రేకల్ పురపాలక సంఘం

63చిట్యాల్ పురపాలక సంఘం12
64చండూరు పురపాలక సంఘం10
65నందికొండ (సాగర్) పురపాలక సంఘం12
66హాలియా పురపాలక సంఘం12
నారాయణపేట జిల్లా
67నారాయణపేట పురపాలక సంఘం24
68కొస్గి పురపాలక సంఘం16
69మక్తల్ పురపాలక సంఘం16
నిర్మల్ జిల్లా
70నిర్మల్ పురపాలక సంఘం42
71భైంసా పురపాలక సంఘం26
72ఖానాపూర్ పురపాలక సంఘం12
నిజామాబాదు జిల్లా
73ఆర్మూర్ పురపాలక సంఘం362006
74బోధన్ పురపాలక సంఘం38
75భీంగల్ పురపాలక సంఘం12
పెద్దపల్లి జిల్లా
76పెద్దపల్లి పురపాలక సంఘం36
77మంథని పురపాలక సంఘం13
78సుల్తానాబాద్ పురపాలక సంఘం15
రాజన్న సిరిసిల్ల జిల్లా
79సిరిసిల్ల పురపాలక సంఘం28
80వేములవాడ పురపాలక సంఘం39
రంగారెడ్డి జిల్లా
81షాద్‌నగర్ పురపాలక సంఘం28
82శంషాబాద్ పురపాలక సంఘం25
83జల్‌పల్లి పురపాలక సంఘం28
84ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం24
85పెద్దఅంబర్‌పేట్ పురపాలక సంఘం24
86తుర్కయాంజల్ పురపాలక సంఘం24
87ఆదిబట్ల పురపాలక సంఘం15
88శంకరపల్లి పురపాలక సంఘం15
89తుక్కుగూడ పురపాలక సంఘం15
90ఆమనగల్ పురపాలక సంఘం15
91మణికొండ పురపాలక సంఘం20
92నార్సింగి పురపాలక సంఘం18
సంగారెడ్డి జిల్లా
93సంగారెడ్డి పురపాలక సంఘం38
94జహీరాబాదు పురపాలక సంఘం

95సదాశివపేట పురపాలక సంఘం261954
96నారాయణఖేడ్ పురపాలక సంఘం15
97బొల్లారం పురపాలక సంఘం22
98తెల్లాపూర్ పురపాలక సంఘం17
99అమీన్‌పూర్ పురపాలక సంఘం24
100ఆందోల్-జోగిపేట పురపాలక సంఘం20
సిద్దిపేట జిల్లా
101సిద్దిపేట పురపాలక సంఘం

102దుబ్బాక పురపాలక సంఘం20
103హుస్నాబాద్ పురపాలక సంఘం20
104గజ్వేల్ పురపాలక సంఘం20
105చేర్యాల పురపాలక సంఘం12
సూర్యాపేట జిల్లా
106సూర్యాపేట పురపాలక సంఘం48
107కోదాడ పురపాలక సంఘం35
108హుజూర్‌నగర్ పురపాలక సంఘం28
109నేరేడుచర్ల పురపాలక సంఘం15
110తిరుమలగిరి పురపాలక సంఘం15
వికారాబాదు జిల్లా
111తాండూరు పురపాలక సంఘం36
112వికారాబాద్ పురపాలక సంఘం34
113పరిగి పురపాలక సంఘం15
114కోడంగల్ పురపాలక సంఘం12
వనపర్తి జిల్లా
115వనపర్తి పురపాలక సంఘం331984
116కొత్తకోట పురపాలక సంఘం15
117పెబ్బేరు పురపాలక సంఘం12
118అమరచింత పురపాలక సంఘం10
119ఆత్మకూరు పురపాలక సంఘం10
వరంగల్ గ్రామీణ జిల్లా
120పరకాల పురపాలక సంఘం22
121వర్థన్నపేట పురపాలక సంఘం12
122నర్సంపేట్ పురపాలక సంఘం24
యాదాద్రి భువనగిరి జిల్లా
123యాదగిరిగుట్ట పురపాలక సంఘం12
124భువనగిరి పురపాలక సంఘం35
125చౌటుప్పల్ పురపాలక సంఘం20
126మోత్కూర్ పురపాలక సంఘం12
127ఆలేరు పురపాలక సంఘం12
128పోచంపల్లి పురపాలక సంఘం13

హోం
ఇవి కూడా చూడండి: తెలంగాణ నగరపాలక సంస్థలు (కార్పోరేషన్లు), ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు,


19, జులై 2014, శనివారం

ఖమ్మం జిల్లా (Khammam Dist)

మండలాలు21
రెవెన్యూ డివిజన్లు
2 (ఖమ్మం, కల్లూర్)
జనాభా14,01,639
వైశాల్యం4361 చకిమీ
రెవెన్యూ గ్రామాలు
379
గ్రామపంచాయతీలు584
ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. జిల్లాలో 21 మండలాలు, 379 రెవెన్యూ గ్రామాలు, 584 గ్రామపంచాయతీలు కలవు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, సమరయోధులు జమలాపురం కేశవరావు, నల్లమల గిరిప్రసాద్, చేకూరి రామారావు, బోడేపల్లి వెంకటేశ్వరరావు, కొండుభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు. గోదావరి నది జిల్లా గుండా ప్రవహిస్తున్నది. వైరా, పాలేరు, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు జిల్లాలో కలవు. 2011 ప్రకారం జిల్లా జనాభా 14,01,639. ఖమ్మం, జిల్లాలోని ముఖ్య పట్టణాలు. జిల్లా వైశాల్యం 4361 చదరపు కిలోమీటర్లు.

భౌగోళికం, సరిహద్దులు:
ఖమ్మం జిల్లాకు ఉత్తరాన మహబూబాబాదు జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, పశ్చిమాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి..

చరిత్ర:
మొదట ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ మధిరలో జరిగింది. 1953లో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. 1956లో హైదరాబాదు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన పిదప తూర్పు గోదావరి జిల్లాలోని నూగూరు, భద్రాచలం తాలుకాలు ఖమ్మం జిల్లాలో కలుపబడినవి. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగింది. 2009-14 కాలంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు, కార్మికులు, న్యాయవాదులు, మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 2011లో  42 రోజుల పాటు సకలజనుల సమ్మె సంపూర్ణంగా జరిగింది. 2014, జూన్ 2న ఖమ్మం జిల్లా తెలంగాణలో భాగమైన తర్వాత పోలవరం ముంపును గురయ్యే 7 మండలాలు (2 పాక్షిక) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఖమ్మం జిల్లా తూర్పు భాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా అవతరించింది. 
 
రవాణా సౌకర్యాలు:
డోర్నకల్ నుంచి విజయవాడ వెళ్ళు రైలుమార్గం మరియు డోర్నకల్ నుంచి సింగరేణి మార్గం జిల్లా గుండా వెళ్తున్నాయి. ఖమ్మం, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, కారేపల్లి, చింతకాని, తొండల గోపవరం జిల్లాలోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లు. ఇవి దక్షిణమధ్యరైల్వేలో భాగంగా సికింద్రాబాదు డీవిజన్ పరిధిలోకి వస్తాయి. ఖమ్మం నుంచి ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గాలున్నాయి. ఖమ్మం, మధిర, సత్తుపల్లిలలో తెలంగాణ రోడ్డు రవాణాసంస్థకు చెందిన ఆర్టీసి డీపోలున్నాయి.


ఉమ్మడి ఖమ్మం జిల్లా (upto 2016_
ఇవి కూడా చూడండి:


 హోం,
విభాగాలు: తెలంగాణ జిల్లాలు, ఖమ్మం జిల్లా,


 = = = = =


11, ఫిబ్రవరి 2014, మంగళవారం

విభాగము: ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు (Portal: Khammam Dist Projects)

  విభాగము: ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు 
(Portal: Khammam Dist Projects)
  1. వైరా ప్రాజెక్టు (),
  2. తలిపేరు ప్రాజెక్టు (),
  3. పెద్దవాగు ప్రాజెక్టు (),
  4. లంకసాగర్ ప్రాజెక్టు (),
  5. బయ్యారం ప్రాజెక్టు (),
  6. గుండ్లవాగు ప్రాజెక్టు (),
  7. కిన్నెరసాని ప్రాజెక్టు (),

విభాగాలు: ఖమ్మం జిల్లా, తెలంగాణ ప్రాజెక్టులు,   

14, జూన్ 2013, శుక్రవారం

ఖమ్మం లోకసభ నియోజకవర్గం (Khammam Loksabha Constituency)

ఖమ్మం లోకసభ నియోజకవర్గం
జిల్లాఖమ్మం
ప్రస్తుత ఎంపినామా నాగేశ్వరరావు
పార్టీతెరాస


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెరాసకు చెందిన నామా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.

నియోజకవర్గ చరిత్ర:
ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరుగగా 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తొలి 2 ఎన్నికలలో పీడీఎఫ్ విజయం సాధించగా ఆ తర్వాత వరుసగా 8 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందినారు. 1996లో సీపీఐ ఆ తర్వాత మళ్ళీ వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2009లో తెలుగుదేశం పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. 2014లో వైకాపా అభ్యర్థి విజయం సాధించారు.

కేంద్రమంత్రులు:
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఇద్దరు కేంద్రంలో మంత్రిపదవులు పొందారు. 1991లో విజయం సాధించిన పి.వి.రంగయ్యనాయుడు పి.వి.నరసింహరావు మంత్రివర్గంలో కేంద్రమంత్రిపదవి నిర్వహించగా 2004లో ఇక్కడి నుంచి గెలుపొందిన రేణుకాచౌదరి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో స్థానం పొందారు. అంతేకాకుండా ఈ నియోజవర్గం నుంచి లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన జగలం వెంగళరావు, నాదెండ్ల భాస్కరరావులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు.



దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 టి.బి.విఠల్ రావు పీడీఎఫ్
2వ 1957-62 టి.బి.విఠల్ రావు పీడీఎఫ్
3వ 1962-67 తేళ్ల లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 తేళ్ల లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 తేళ్ల లక్ష్మీకాంతమ్మ కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 జలగం కొండలరావు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 జలగం కొండలరావు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ
9వ 1989-91 జలగం వెంగళరావు కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 పి.వి.రంగయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 తమ్మినేని వీరభద్రం సీపీఎం
12వ 1998-99 నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ
14వ 2004-09 రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
16వ 2014-19 శ్రీనివాస్ రెడ్డి వైకాపా
17వ 2019- నామా నాగేశ్వరరావు తెరాస


2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన నామా నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిని 124448 ఓట్ల తేడాతో ఓడించారు. నామా నాగేశ్వరరావుకు 469368 ఓట్లు రాగా, రేణుకాచౌదరికి 344920 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి జె.హేమమాలిని 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 27 అభ్యర్థులు పోటీచేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన నామా నాగేశ్వరరావుపై 10162 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి లోకసభలో ప్రవేశించారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన నామా నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేణుకా చౌదరిపై 168062 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెరాస అభ్యర్థికి 567459 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 399397 ఓట్లు లభించాయి. సీపీఎంకు చెందిన బోడ వెంకట్ 57,102 ఓట్లతో మూడోస్థానంలో, భాజపాకు చెందిన దేవకి వాసుదేవరావు 20,488 ఓట్లతో నాలుగో స్థానంలో, జనసేనకు చెందిన నారాల సత్యనారాయణ 19,315 ఓట్లతో ఐదోస్థానంలో నిలిచారు.
 



విభాగాలు: ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, ఖమ్మం లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు,




 = = = = =

18, ఏప్రిల్ 2015, శనివారం

ఖమ్మం జిల్లా పురపాలక సంఘాలు (Muncipalities in Khammam District)


ఖమ్మం జిల్లా పురపాలక సంఘాలు 
(Muncipalities in Khammam District)
  1. ఖమ్మం నగరపాలన సంస్థ (Khammam Muncipal Corporation),
 Muncipalities
  1. మధిర పురపాలక సంఘం (Madhira Muncipality),
  2. సత్తుపల్లి పురపాలక సంఘం (Sathupalli Muncipality),
  3. వైరా పురపాలక సంఘం (Wyra Muncipality),
విభాగాలు: తెలంగాణ పురపాలక సంఘాలు, ఖమ్మం జిల్లా,


= = = = =

11, అక్టోబర్ 2020, ఆదివారం

చింతకాని మండలం (Chintakani Mandal)

జిల్లాఖమ్మం
రెవెన్యూ డివిజన్ఖమ్మం
అసెంబ్లీ నియోమధిర
లోకసభ నియోఖమ్మం
చింతకాని ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. డోర్నకల్-విజయవాడ సెక్షన్‌లో చింతకాని, పందిళ్ళపల్లి మరియు నాగులవంచలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన రఘునాథపల్లి మండలం, ఈశాన్యాన కొణిజెర్ల మండలం, తూర్పున వైరా మండలం, దక్షిణాన బోనకల్లు మండలం మరియు ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన ముదిగొండ మండలం, వాయువ్యాన ఖమ్మం పట్టణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా కాజీపేట-విజయవాడ రైలుమార్గం వెళ్ళుచున్నది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49432. ఇందులో పురుషులు 24541, మహిళలు 24891.

రాజకీయాలు:
ఈ మండలము మధిర  అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా ఇండిపెండెంటుకు చెందిన కోపూరి పూర్ణయ్య ఎన్నికయ్యారు.
 
రవాణా సౌకర్యాలు:
మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. డోర్నకల్-విజయవాడ మార్గంలో మండల కేంద్రం చింతకాని, పందిళ్ళపల్లి మరియు నాగులవంచలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గం దక్షిణమధ్య రైల్వే జోన్‌లో భాగంగా సికింద్రాబాదు డివిజన్ పరిధిలో ఉంది.
 

మండలంలోని గ్రామాలు:
Ananthasagar, Bashwapuram, Chinnamandava, Chinthakani, Kodumuru, Lachagudem, Mathikepally, Nagiligonda, Nagulavancha, Nerada, Pandillapally, Patharlapadu, Prothutoor, Repallevada, Thimminenipalem, Vandanam
ప్రముఖ గ్రామాలు:
చింతకాని (Chintakani):
చింతకాని ఖమ్మంజిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. డోర్నకల్-విజయవాడ మార్గంలో చింతకానిలో రైల్వేస్టేషన్ ఉంది.
నాగులవంచ (Nagulavancha):
నాగులవంచ ఖమ్మంజిల్లా చింతకాని మండలమునకు చెందిన గ్రామము. డోర్నకల్-విజయవాడ మార్గంలో నాగులవంచలో రైల్వేస్టేషన్ ఉంది.
పందిళ్ళపల్లి (Pandillapalli):
పందిళ్ళపల్లి ఖమ్మం జిల్లా చింతకాని మండలమునకు చెందిన గ్రామము. 2013, జూలై 29న ఈ గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు, న్యాయవాది అలవాల శ్రీనివాసరావు హత్య జరిగింది. డోర్నకల్-విజయవాడ మార్గంలో పందిళ్ళపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
రామకృష్ణాపురం (Ramakrishnapuram):
రామకృష్ణాపురం ఖమ్మం జిల్లా చింతకాని మండలమునకు చెందిన గ్రామము. నవంబరు 24, 2011న గ్రామంలో జరిగిన రచ్చబండకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.


 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, చింతకాని మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Chintakani Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

29, మే 2020, శుక్రవారం

మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka)

మల్లు భట్టివిక్రమార్క
జననంజూన్ 15, 1961
రంగంరాజకీయాలు
పదవులు3 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గంమధిర
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన మల్లు భట్టివిక్రమార్క జూన్ 15, 1961న జన్మించారు. ఈయన స్వగ్రామం వైరా మండలం స్నానాల లక్ష్మీపురం. అభ్యసన దశలోనే సెంట్రల్ యూనివర్శిటి NSUI అధ్యక్షుడిగా పనిచేసి 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1990-92 కాలంలో పిసిసి కార్యనిర్వాహక సభ్యుడిగా, 2000-03 కాలంలో పిసిసి కార్యదర్శిగా పనిచేశారు. 2007-09 కాలంలో ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. 2009లో మధిర నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై డిప్యూటి స్పీకరుగా పనిచేశారు. 2014, 2018లలో కూడా మధిర నుంచి ఎన్నికై హాట్రిక్ సాధించారు. 2015లో తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైనారు

పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన మల్లు అనంతరాములు, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేసిన మల్లు రవి ఈయన సోదరులు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకులు, ఖమ్మం జిల్లా ప్రముఖులు,


 = = = = =


11, అక్టోబర్ 2020, ఆదివారం

బోనకల్ మండలం (Bonakal Mandal)

జిల్లాఖమ్మం
జనాభా44000
అసెంబ్లీ నియోమధిర అ/ని
లోకసభ నియోఖమ్మం లో/ని
బోనకల్ ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల తూర్పు సరిహద్దు గుండా వైరానది ప్రవహిస్తోంది.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మరియు వాయువ్యాన చింతకాని మండలం, ఈశాన్యాన వైరా మండలం, తూర్పున మరియు దక్షిణాన మధిర మండలం, పశ్చిమాన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా కాజీపేట-విజయవాడ రైలుమార్గం వెళ్ళుచున్నది.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44000. ఇందులో పురుషులు 22133, మహిళలు 21867.

రాజకీయాలు:
ఈ మండలము మధిర అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కంకణాల సౌభాగ్య ఎన్నికయ్యారు.
 
రవాణా సౌకర్యాలు:
మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది. డోర్నకల్-విజయవాడ మార్గంలో మండల కేంద్రం బోనకల్లు మరియు మోటమర్రిలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గం దక్షిణమధ్య రైల్వే జోన్‌లో భాగంగా సికింద్రాబాదు డివిజన్ పరిధిలో ఉంది.

మండలంలోని గ్రామాలు:
Allapadu, Bonakal, Brahmanapalli (K), Chinnabeeravalli, Chirunomula, Choppakatlapalem, Garlapadu, Govindapuram, Kalakota, Laxmipuram, Motamarri, Mustikuntla, Narayanpuram, Peddabeeravalli, Ramapuram, Rapalli, Ravinuthala, Thutikuntla
ప్రముఖ గ్రామాలు:
బోనకల్ (Bonakal):
బోనకల్ ఖమ్మం జిల్లాఖు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. గ్రామానికి రైలు సదుపాయం ఉంది. గ్రామ పిన్‌కోడ్ 507204.
మోటమర్రి (Motamarri):
మోటమర్రి ఖమ్మం జిల్లా బోనకల్ మండలమునకు చెందిన గ్రామము. డోర్నకల్-విజయవాడ మార్గంలో గ్రామానికి రైలు సదుపాయం ఉంది.


 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
ఖమ్మం జిల్లా మండలాలు, బోనకల్ మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 236 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://khammam.telangana.gov.in/te/ (Official Website of Khammam Dist)


Bonakal Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక