ఉప్పల్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. మండలం మీదుగా జాతీయ రహదారి నెం 202 వెళ్ళుచున్నది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాదు మెట్రోకు చెందిన ఉప్పల్ డీపో ఈ మండలంలో ఉన్నాయి. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. . భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మల్కాజ్‌గిరి మండలం, తూర్పున మేడిపల్లి మండలం, పశ్చిమాన హైదరాబాదు జిల్లా, దక్షిణన హైదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 118085. ఇందులో పురుషులు 61322, మహిళలు 56763. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 388750. ఇందులో పురుషులు 200048, మహిళలు 188702. అక్షరాస్యుల సంఖ్య 313079. మండలం మొత్తం పట్టణ ప్రాంతమే. మండలంలోని గ్రామాలు:
Bandlaguda, Fathullaguda, Habsiguda, Kothapet, Mallapur, Meerpet, Nacharam, Nagole, Navoranguda Bhagayath, Navoranguda Khalsa, Ramanthapur Bagayath , Ramanthapur Khalsa, Uppal Bagayath, Uppal Khalsa
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు: .బండ్లగూడ (Bandlaguda ): బండ్లగూడ మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామం. నవచేతన బుక్ పబ్లిషింగ్ హౌస్, నవ తెలంగాణ దినపత్రిక కార్యాలయం ఇక్కడ ఉన్నాయి. నాచారం (Nacharam): నాచారం మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలమునకు చెందిన పట్టణ ప్రాంతము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది (వార్డు సంఖ్య 6). పాదరక్షాల (చెప్పుల) పరిశ్రమకు ఈ ప్రాంతం పేరుపొందింది. అలాగే ఫ్యాబ్రికేషన్, టెక్స్‌టైల్స్, టైర్లు, ట్యూబులు, ఫర్నీచరు తదితర ఉత్పత్తులకు చెందిన పరిశ్రమలున్నాయి. నాగోల్ (Nagole): నాగోల్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలానికి చెందిన పట్టణ ప్రాంతము. 1990 దశకంలో మామూలు ప్రాంతంగా ఉన్న నాగోల్ 2000 దశకంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ అభివృద్ధి చెంది 2010 దశకం నాటికి పూర్తిగా పట్టణప్రాంతంగా మారింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. మెట్రోరైలు సదుపాయం కూడా ఉంది. ఉప్పల్ మరియు ఎల్బీనగర్ ప్రాంతాల మధ్యలో ఉంది. ఉప్పల్ (Uppal): ఉప్పల్ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణ ప్రాంతము, మండల కేంద్రము మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉంది. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది (సర్కిల్ 2). గ్రేటర్‌లో విలీనానికి ముందు ఉప్పల్ పురపాలక సంఘంగా ఉండేది. పురాతనమైన రామాలయం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మెట్రోరైల్వేకు చెందిన ఉప్పల్ డిపో ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఉప్పల్ రహదారి కూడలి హైదరాబాదులోని ముఖ్యమైన కూడళ్ళలో ఒకటి. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Uppal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి