శామీర్‌పేట్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కె.రమేశ్ రెడ్డి ఈమండలమునకు చెందినవారు. మండలంలోని పలు గ్రామాలలో కులీకుతుబ్‌షా కాలం నాటి చారిత్రక కట్టడాలున్నాయి. పర్యాటక ప్రాంతంగా పేరుపొందిన శామీర్‌పేట రత్నాలయం, శామీర్‌పేట చెరువు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీ, జవహర్ డీర్ పార్క్, జినోమ్ వాలీ ఈ మండలంలో ఉన్నాయి. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. మార్చి 7, 2019న షామీర్‌పేట మండలంలోని 17 గ్రామాలను విడదీసి కొత్తగా మూడుచింతలపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి పశ్చిమాన మేడ్చల్ మండలం, దక్షిణాన కీసర, కాప్రా, ఆల్వాల్ మండలాలు, తూర్పున యాదాద్రి భువనగిరి జిల్లా, ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 85291. ఇందులో పురుషులు 43943, మహిళలు 41348. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 117554. ఇందులో పురుషులు 61034, మహిళలు 56520. శామీర్‌పేట్ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Aliabad, Anthaipally, Bommaraspet, Devaryamjal, Lalgadimalakpet, Majeedpur, Mandaipally, Muraharipally, Ponnal, Pothaipally, Shamirpet, Singaipally, Thumkunta, Turkapally, Yadaram,
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు: .శామీర్‌పేట్ (Shamirpet): శామీర్‌పేట్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ రాజీవ్ రహదారి ప్రక్కన ప్రఖ్యాతిగాంచిన రత్నాలయం ఉంది. ఈ ఆలయం 2003లో నిర్మించబడింది. బిట్స్ పిలానీ, నల్సార్ విశ్వవిద్యాలయాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆలయం సమీపంలో పెద్ద చెరువు ఉంది. ఇది శామీర్‌పేట చెరువుగా పేరుపొందింది. తుర్కపల్లి (Turkapalli): తుర్కపల్లి మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. జూలై 11, 2015 తుర్కపల్లి శివారులో ఆదిమానవుల చిత్రాల బయటపడ్డాయి. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Shamirpet Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి