ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2013, జాతీయ వార్తలు-2013, అంతర్జాతీయ వార్తలు-2013, క్రీడావార్తలు-2013, |
జనవరి 2013:
- 2013, జనవరి 23: స్వాతంత్ర్య సమరయోధుడు పరకాల పట్టాభి రామారావు మరణించారు.
- 2013, జనవరి 26: రాష్ట్ర మాజి డిజిపి ఎస్.ఆర్.సుకుమార మరణించారు.
- 2013, జనవరి 28: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ టి.మీనాకుమారి మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం.
ఫిబ్రవరి 2013:
- 2013, ఫిబ్రవరి 8: మాజీ మంత్రి డి.నర్సింగరావు మరణించారు.
- 2013, ఫిబ్రవరి 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి మరోసారి నియామకం.
- 2013, ఫిబ్రవరి 22: నటుడు కొంగర జగ్గారావు మరణించారు.
- 2013, ఫిబ్రవరి 25: ఆప్కో అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి హన్మంతరావు ఎన్నిక.
- 2013, ఫిబ్రవరి 28: 10వ వేతన కమీషన్ అధ్యక్షుడిగా ప్రదీప్ కుమార్ అగర్వాల్ నియామకం.
- 2013, ఫిబ్రవరి 28: ప్రకాశం జిల్లా రామయ్యపట్నంలో భారీ ఓడరేవుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
మార్చి 2013:
- 2013, మార్చి 2: మార్క్‌ఫెడ్ చైర్మెన్‌గా కంచి రంగారావు నియామకం.
- 2013, మార్చి 9: చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాటకొండ సాగర్‌రెడ్డి మరణించారు.
- 2013, మార్చి 11: సంగీత కళానిధి శ్రీపాద పినాకపాణి మరణించారు.
- 2013, మార్చి 15: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన అవిశ్వాసతీర్మానం వీగిపోయింది.
- 2013, మార్చి 15: రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత కళ్ళం అంజిరెడ్డి మరణించారు.
- 2013, మార్చి 16: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ చైర్మెన్‌గా ఎన్.వి.రమణ నియామకం.
- 2013, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ 7 పర్యాటక పురస్కారాలు పొందినది.
- 2013, మార్చి 22: జర్నలిస్ట్ వాసిరెడ్డి సత్యనారాయణ మరణించారు.
- 2013, మార్చి 23: రఘుపతి వెంకయ్య అవార్డుకు కైకాల సత్యనారాయణ ఎంపికయ్యారు.
ఏప్రిల్ 2013:
- 2013, ఏప్రిల్ 3: రాష్ట్రంలో కొత్తగా 10 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు జారీ.
- 2013, ఏప్రిల్ 10: లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షునిగా కటారి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
- 2013, ఏప్రిల్ 13: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చిన్నపరెడ్డి మరణించారు.
- 2013, ఏప్రిల్ 17: తెలుగు రచయిత రావూరి భరద్వాజకు 2012 సంవత్సరపు జ్ఞాన్‌పీఠ్ అవార్డుకు ప్రకటించారు. (ఈ అవార్డు పొందిన మూడవ తెలుగు కవి).
- 2013, ఏప్రిల్ 17: కర్ణాటక గవర్నరుగా, కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్‌గా పనిచేసిన వి.ఎస్.రమాదేవి మరణించారు.
- 2013, ఏప్రిల్ 20: బెలిజ్‌లో అమెరికా రాయబారిగా తెలుగు వ్యక్తి వినయ్ కుమార్ రెడ్డి నియామకం.
- 2013, ఏప్రిల్ 21: కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే బ్రాహ్మణయ్య మరణించారు.
- 2013, ఏప్రిల్ 24: ప్రముఖ పారిశ్రామికవేత్త, లోకసభ మాజీ సభ్యుడు డి.కె.ఆదికేశవులు మరణించారు.
- 2013, ఏప్రిల్ 26: చంద్రబాబునాయుడు పాదయాత్ర విశాఖపట్టణంలో ముగిసింది.
- 2013, ఏప్రిల్ 28: రాష్ట్ర మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ మరణించారు.
- 2013, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్ మహంతి నియామకం.
మే 2013:
- 2013, మే 2: శాసనమండలివిపక్షనేతగా యనమల రామకృష్ణుడు నియమించబడ్డారు.
- 2013, మే 12: వందేళ్ళ భారతీయ సినిమాలో అత్యద్భుత దృశ్యకావ్యంగా "మాయాబజార్" నిలిచింది (సీఎన్.ఎన్.-ఐబీఎస్ సర్వేలో).
- 2013, మే 17: ప్రముఖ కవి కలేకూరి ప్రసాద్ మరణించారు.
- 2013, మే 20: అంతర్జాతీయ బాక్సింగ్ కప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ దుర్గారావు స్వర్ణం సాధించారు.
- 2013, మే 21: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా నియమించబడ్డారు.
- 2013, మే 24: ప్రముఖ కథా రచయిత త్రిపుర (రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు) మరణించారు.
- 2013, మే 26: మంత్రులు సబితా ఇంద్రారెడ్డి (హోంశాఖ), ధర్మాన ప్రసాదరావు (రోడ్డు భవనాల శాఖ) రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు.
- 2013, మే 28: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు 9వ సారి ఎన్నికయ్యారు.
- 2013 మే 30: ఆరెస్సెస్ ప్రముఖ ప్రచారక్ దీవి ద్వారకాచార్య మరణించారు.
జూన్ 2013:
- 2013, జూన్ 1: రాష్ట్ర మంత్రివర్గం నుంచి డి.ఎల్.రవీంద్రారెడ్డి బర్తరఫ్ అయ్యారు.
- 2013, జూన్ 4: నవలా రచయిత మైనంపాటి భాస్కర్ మరణించారు.
- 2013. జూన్ 7: సంగీత విధ్వాంసుడు జె.వి.రాఘవులు మరణించారు.
- 2013. జూన్ 8: శాసనసభలో పార్టీ విప్ ఉల్లంఘించిన 15 మంది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల శాసనసభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు.
- 2013, జూన్ 9: గుంటూరుకు చెందిన శ్రీకాంత్ థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంటు టైటిల్ సాధించాడు.
- 2013, జూన్ 12: గ్రామపంచాయతి ఎన్నికలకు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 21590 పంచాయతీలలో ఎస్టీలకు 2497, ఎస్సీలకు 3958, బీసీలకు 6929, ,మహిళలకు (అన్ని కేటగేరీలు కలిపి) 10795, జనరల్ 8209 స్థానాలు.
- 2013, జూన్ 15: సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా అరుణాచలం బాధ్యతలు చేపట్టారు.
- 2013, జూన్ 17: రాష్ట్రానికి చెందిన కావూరి సాంబశివరావు మరియు జె.డి.శీలంలకు కేంద్రంలో మంత్రిపదవులు లభించాయి. కావూరికి జౌళిశాఖ, శీలంకు ఆర్థిక శాఖ కేటాయించారు.
- 2013, జూన్ 17: స్వాతంత్ర్య సమరయోధుడు, పారిశ్రామికవేత్త, విధానమండలి డిప్యూటి చైర్మెన్‌గా పనిచేసిన గోకరాజు సుబ్బరాజు మరణించారు.
- 2013, జూన్ 18: కర్నూలు రైల్వేస్టేషన్ పేరు కర్నూలు సిటి రైల్వేస్టేషన్‌గా మారుస్తూ ఉత్తర్వు జారీ.
- 2013, జూన్ 18: వెలుగొండ ప్రాజెక్టు రూపశిల్పి కందుల నాగిరెడ్డి మరణించారు.
- 2013, జూన్ 21: రాష్ట్రంలో కొత్తగా 2 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు. విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి మరియు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం లను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ.
- 2013, జూన్ 30: గురజాల కేంద్రంగా గుంటూరు జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్ ప్రారంభమైంది.
జూలై 2013:
- 2013, జూలై 1: భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి.
- 2013, జూలై 2: భీమవరం మాజీ ఎమ్మెల్యే పెనుమత్స వెంకట నరసింహరాజు మరణించారు.
- 2013, జూలై 3: రాష్ట్రంలో పంచాయతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది
- 2013, జూలై 4: పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా డోన్ ఎమ్మెల్యే కె.ఈ.కృష్ణమూర్తి నియమితులైనారు.
- 2013, జూలై 10: ప్రముఖ ఫోటోగ్రాఫర్ గొల్లపూడి నాగభూషణం మరణించారు.
- 2013, జూలై 11: సంగీత విధ్వాంసుడు, పద్మభూషణ్ గ్రహీత నూకల చినసత్యనారాయణ మరణించారు.
- 2013, జూలై 20: మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు మరణించారు.
- 2013, జూలై 22: రచయిత గిడుగు రాజేశ్వరరావు మరణించారు.
- 2013, జూలై 23: గ్రామపంచాయతి ఎన్నికల తొలి విడత పోలింగ్ 21 జిల్లాలలో జరిగింది.
- 2013, జూలై 25: తిరుపతి నగరపాలక సంస్థలో 3 గ్రామాలు (ఎమ్మార్ పల్లి, రాజీవ్ నగర్, తిమ్మినాయుడుపాలెం) విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
- 2013, జూలై 27: గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ 22 జిల్లాలలో జరిగింది.
- 2013, జూలై 29: భారత హాకీ సమాఖ్య అధ్యక్షపదవికి దినేశ్ రెడ్డి రాజీనామా చేశారు.
- 2013, జూలై 30: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసేందుకు కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
- 2013, జూలై 30: అనకాపల్లి, భీమునిపట్నం పురపాలకసంఘాలతో సహా 10 పంచాయతీలు విశాఖ నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వి జారీ.
- 2013, జూలై 31: పంచాయతి ఎన్నికల 3వ విడత ఎన్నికలు జరిగాయి.
ఆగస్టు 2013:
- 2013, ఆగస్టు 3: ప్రముఖ సంగీత దర్శకుడు దక్షిణాముర్తి మరణించారు.
- 2013, ఆగస్టు 3: రాష్ట్ర మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి మరణించారు.
- 2013, ఆగస్టు 4: సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి మరణించారు.
- 2013, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీస్ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
- 2013, ఆగస్టు 15: తెలుగుదేశం పార్టీ నాయకుడు, గుంటూరు మాజీ ఎంపి లాల్‌జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో మరణించారు.
- 2013, ఆగస్టు 21: అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.
- 2013, ఆగస్టు 21: ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ మరణించారు.
- 2013, ఆగస్టు 23: విశాఖపట్టణంలోని హెచ్.పి.సి.ఎల్.లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
- 2013, ఆగస్టు 24: అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీహరి ప్రసాద్ విజయం సాధించారు.
సెప్టెంబరు 2013:
- 2013, సెప్టెంబరు2: రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్.వి.రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
- 2013, సెప్టెంబరు 6: పీలేరు గాంధీగా పేరుపొందిన సి.కె.నారాయణరెడ్డి మరణించారు.
- 2013, సెప్టెంబరు 7: కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం నేదునూరి కృష్ణమూర్తికి లభించింది.
- 2013, సెప్టెంబరు 8: రాష్ట్ర సాంస్కృతిక మండలి మాజీ అధ్యక్షుడు, సినీ నిర్మాత ఆర్.వి.రమణమూర్తి మరణించారు.
- 2013, సెప్టెంబరు 14: సినీ నిర్మాత వై.హరికృష్ణ మరణించారు.
- 2013, సెప్టెంబరు 14: హిందీని ఉత్తమ స్థాయిలో అమలుపర్చినందుకు విశాఖ ఉక్కుకర్మాగారానికి రాజభాషా పురస్కారం లభించింది.
- 2013, సెప్టెంబరు 15: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ మరణించారు.
- 2013, సెప్టెంబరు 16: జాతీయ బిసి కమీషన్ చైర్మెన్‌గా వంగల ఈశ్వరయ్య నియమితులైనారు.
- 2013, సెప్టెంబరు 17: సినీనిర్మాత తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి మరణించారు.
- 2013, సెప్టెంబరు 18: రాష్ట్ర మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి మరణించారు.
- 2013, సెప్టెంబరు 20: శ్రీకాకుళం జిల్లాకు చెందిన కవి ఛాయారాజ్ మరణించారు.
- 2013, సెప్టెంబరు 30: ఆంధ్రప్రదేశ్ డిజిపిగా బి.ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు.
అక్టోబరు 2013:
- 2013, అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
- 2013, అక్టోబరు 8: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో పురాతనమైన ఏకశిల సరస్వతి విగ్రహం లభించింది.
- 2013, అక్టోబరు 9: తెలుగు సినిమా నటుడు శ్రీహరి మరణించారు.
- 2013, అక్టోబరు 18: జ్ఞాన్‌పీఠ్ అవార్డూ గ్రహీత రావూరి భరధ్వాజ మరణించారు.
నవంబరు 2013:
- 2013, నవంబరు 2: విజయనగరం జిల్లా గొట్టాం వద్ద రైల్వేస్టేషన్‌లో రైలు కిందపడి పలువురు మృతిచెందారు.
- 2013, నవంబరు 8: సినీనటుడు, దర్శక-నిర్మాత అమంచి వెంకట సుబ్రమణ్యం మరణించారు.
- 2013, నవంబరు 21:సినీ నిర్మాత వడ్డె రమేష్ మరణించారు.
- 2013, నవంబరు 27: విప్లవకవి మండే సత్యం మరణించారు.
- 2013, నవంబరు 29: కృష్ణా జల వివాదాలపై నియమించిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తన తుది తీర్పును వెలువరించింది.
డిసెంబరు 2013:
- 2013,డిసెంబరు 5: తెలంగాణ ఏర్పాటు ముసాయుదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
- 2013, డిసెంబరు 7: పులిచింతల ప్రాజెక్టు (డా.కె.ఎల్.రావు ప్రాజెక్టు) ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేశారు.
- 2013, డిసెంబరు 7: ప్రకాశం జిల్లా మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు మరణించారు.
- 2013, డిసెంబరు 7: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించారు.
- 2013, డిసెంబరు 9: ఒంగోలు మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి మరణించారు.
- 2013, డిసెంబరు 18: కాత్యాయిని విద్మహే 2013 సం.పు సాహిత్య అకాడమీ పురస్కారంకు ఎంపికైనారు (తెలుగు భాషలో).
- 2013, డిసెంబరు 18: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కామన్ గుర్తుగా సీలింగ్ ఫ్యాన్ కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
- 2013, డిసెంబరు 24: వేంపల్లి గంగాధర్‌కు అంపశయ్య నవీన్ సాహిత్య నవలా పురస్కారం లభించింది.
- 2013, డిసెంబరు 29: శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్ సమీపంలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఒక బోగీలో మంటలు చెలరేగి 26 మంది మరణించారు.
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2014, |
|
Kairatabad Ganesh chaturti completed 59years and 59feets 9/9/2013
రిప్లయితొలగించండిEe Blog oka adbhuthamina samachara sekarini..dhinni maintain chesthunnandhuku meeku chala thanks ....
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.
తొలగించండిtelugu madyamam chadive variki oka goppa adbhuthamaina samachara vaani ee blog.. dhini kosam meeru chestunna krushi chala mandi students ki use avutundi.... thanks
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్య బాగుంది, మేమూ ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. ఈ బ్లాగు గురించి మీరు తెలిసినవారికి పరిచయం చేయండి.
తొలగించండి