21, ఆగస్టు 2014, గురువారం

కాలరేఖ 1990 (Timeline 1990)


కాలరేఖ 1990 (Timeline 1990)
  • ఫిబ్రవరి 4: రిచర్డ్ హాడ్లీ టెస్ట్ క్రికెట్‌లో 400 వికెట్లను సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
  • ఫిబ్రవరి 7: సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది.
  • ఫిబ్రవరి 11: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించింది.
  • మార్చి 10: తెలుగు సినిమానటి రితువర్మ జననం 
  • మార్చి 11: లిథువేనియా సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
  • మార్చి 15: మిఖాయిల్ గోర్భచెవ్ రష్యా తొలి కార్యనిర్వాక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
  • మార్చి 17: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జననం
  • ఏప్రిల్ 29: బొరిక్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనారు.
  • మే 4: లాట్వియా సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
  • మే 22: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 3.0 సాఫ్ట్‌వేర్ విడుదల చేసింది.
  • జూన్ 8: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఇటలీలో ప్రారంభమైంది.
  • జూన్ 21: ఇరాన్ లో సంభవించిన భారీ భూకంపంలో 40వేల మంది మృతిచెందారు.
  • జూలై 8: పశ్చిమ జర్మనీ 1-0 తేడాతో అర్జెంటీనాను ఓడించి 1990 ప్రపంచ కప్ సాకర్ కప్ సాధించింది.
  • జూలై 16: ఫిలిప్పీన్స్ లో సంభవించిన భారీ భూకంపం వల్ల 1600కు పైగా ప్రజలు మరణించారు.
  • జూలై 28: పెరూ అధ్యక్షుడిగా అల్బెర్టో ఫుజుమొరి బాధ్యతలు చేపట్టారు.
  • ఆగస్టు 2: ఇరాక్ కువైట్ ను ఆక్రమించింది. దీనితో గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది.
  • సెప్టెంబర్ 16: ఇంగ్లాండు క్రికెట్ క్రీడాకారుడు లెన్ హట్టన్ మరణం.  
  • సెప్టెంబర్ 22: 11వ ఆసియా క్రీడలు చైనా లోని బీజింగ్ లో ప్రారంభమయ్యాయి.
  • అక్టోబర్ 3: పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి.
  • నవంబర్ 1: ఐర్లాండ్ తొలి మహిళా అధ్యక్షురాలిగా మేరీ రాబిన్సన్ ఎన్నికైనది.
  • నవంబర్ 10: భారత ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ పదవిని చేపట్టినారు.
  • నవంబర్ 12: జపాన్ 125 చక్రవర్తిగా అకిహితో సింహాసనం అధిష్టించారు.
  • నవంబర్ 21: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.
  • నవంబర్ 22: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్ర్ పదవికి మార్గరెట్ థాచర్ రాజీనామా, జాన్ మేజర్ ప్రధానమంత్రిగా నియమించబడ్డారు.
  • డిసెంబర్ 17: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేదురుమిల్లి జనార్ధనరెడ్డి పదవిని చేపట్టారు.
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: బీ.ఆర్.అంబేద్కర్, నెల్సన్ మండేలా.
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : అక్కినేని నాగేశ్వరరావు.
  • జ్ఞానపీఠ్ పురస్కారం : వి.కె.గోకక్.
  • జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: హెల్మట్ కోల్.
  • టెంపుల్టన్ అవార్డు : బాబా అమ్టే మరియు చార్లెస్ బిర్చ్‌ (సంయుక్తంగా).
  • నోబెల్ బహుమతులు: భౌతికశాస్త్రం (జెరోమ్ ఐజాక్ ఫ్రీడ్‌మన్, హెన్రీ వే కెండాల్, రిచర్డ్ ఎడ్వర్డ్ టేలర్.) రసాయన శాస్త్రం: (ఎలియాస్ జేమ్స్ కోరి.)     వైద్యశాస్త్రం: (జోసెఫ్ ఇ ముర్రే, ఇ.డొనాల్ థామస్.) సాహిత్యం: (ఆక్టావియో పాజ్. ) శాంతి: (మిఖాయిల్ గోర్భచెవ్.) ఆర్థికశాస్త్రం: (హారి మార్కోవిట్జ్, మెర్టన్ మిల్లర్, విలియం షార్పె).

 

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక