కాప్రా ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
కాప్రా ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

29, అక్టోబర్ 2020, గురువారం

కాప్రా మండలం (Kapra Mandal)

జిల్లామేడ్చల్
రెవెన్యూ డివిజన్కీసర
అసెంబ్లీ నియోమేడ్చల్
లోకసభ నియోమల్కాజ్‌గిరి
రెవెన్యూ గ్రామాలు
3
కాప్రా మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు GHMCలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అంతకు క్రితం కీసర, శామీర్‌పేట్, ఘట్‌కేసర్ మండలాలలో ఉన్న ఒక్కో గ్రామాన్ని విడదీసి 3 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు..
 
ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కర్మాగారం, సెంట్రల్ జైలు మండలంలో ఉన్నాయి. మండలం గుండా రైలుమార్గం వెళ్ళుచున్నది.
 
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి తూర్పున కీసర మండలం, దక్షిణాన మేడిపల్లి మండలం, పశ్చిమాన మల్కాజ్‌గిరి మండలం మరియు ఆల్వాల్ మండలం, ఉత్తరాన షామీర్‌పేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 
 
మండలంలోని గ్రామాలు:
చెర్లపల్లి, జవహర్‌నగర్, కాప్రా,
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
.
చెర్లపల్లి (Cherlapally) :
చెర్లపల్లి మేడ్చల్ జిల్లా కాప్రా మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు GHMCలో భాగంగా కాప్రా సర్కిల్, వార్డు 2లో ఉంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం చెర్లపల్లిలో ఉంది. చెర్లపల్లిలో సెంట్రల్ జైలు, రైల్వేస్టేషన్ కూడా ఉన్నాయి.
జవహర్‌నగర్ (Cherlapally) :
జవహర్‌నగర్ మేడ్చల్ జిల్లా కాప్రా మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు GHMCలో భాగంగా ఉంది. BITS హైదరాబాదు క్యాంపస్ ఈ ప్రాంతంలో ఉంది.
కాప్రా (Kapra):
కాప్రా మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగంగా (వార్డు నెం.1) ఉంది. కీసర మండలంలో ఉన్న ఈ ప్రాంతం 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా మండల కేంద్రంగా మారింది.



ఇవి కూడా చూడండి:
  • ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL),
  • చెర్లపల్లి సెంట్రల్ జైలు,
 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా మండలాలు, కాప్రా మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
  • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
  • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


Kpra Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

కీసర మండలం (Keesara Mandal)

జిల్లామేడ్చల్
రెవెన్యూ డివిజన్కీసర
అసెంబ్లీ నియోమల్కాజ్‌గిరి
లోకసభ నియోమల్కాజ్‌గిరి
జనాభా
176019
రెవెన్యూ గ్రామాలు
16
కీసర మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.
 
మండలకేంద్రం కీసరలో పురాతనమైన "శ్రీరామలింగేశ్వరస్వామి" గా పేరుపొందిన త్రేతాయుగం నాటి శివాలయం ఉంది. క్రీ.శ.4-7 శతాభ్దాల కాలంలో పాలించిన విష్ణుకుండినులు కీసరగుట్టను సైనిక స్థావరంగా ఉపయోగించినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు.
 
అక్టోబరు 2020లో కీసర తహసీల్దారు నాగరాజు రూ.కోటి పదిలక్షలు లంచం పుచ్చుకుంటూ ఏసిబికి పట్టుబడి రికార్డు సృష్టించారు. అరెస్ట్ అయి, తర్వాత జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన షామీర్‌పేట మండలం, దక్షిణాన ఘట్‌కేసర్ మండలం, పశ్చిమాన కాప్రా మండలం, తూర్పున యాదాద్రి భునవగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 197145. ఇందులో పురుషులు 102191, మహిళలు 94954. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 176019. ఇందులో పురుషులు 89606, మహిళలు 86413. అక్షరాస్యుల సంఖ్య 141005. పట్టణ జనాభా 148765, గ్రామీణ జనాభా 27254.

రాజకీయాలు:
ఈ మండలము మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో కీసర మండల జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి బెస్త వెంకటేశ్ గెలుపొందారు. 2019లో ఎంపీటీసిలుగా ముగ్గురు తెరాస అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి, నలుగురు ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారు.
 
మండలంలోని గ్రామాలు:
Ahmedguda, Bogaram, Cheeryal, Dharmaram, Godumakunta, Haridaspally, Keesara, Keesara Daira, Keshavapur, Kundanpally, Nagaram, Narsampally, Rampally, Thimmaipally, Yadgarpally (East), Yadgarpally (West)
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
.
చీర్యాల్ (Cheeryal):
చీర్యాల్ మేడ్చల్ జిల్లా కీసర మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది మండల కేంద్రమైన కీసర నుంచి 8 కిమీ దూరంలో ఉంది. చీర్యాల్‌లో రీ లక్ష్మీనృసింహ్మస్వామి ఆలయం ఉంది.
కీసర (Keesara):
కీసర మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ పురాతనమైన "శ్రీరామలింగేశ్వరస్వామి" గా పేరుపొందిన త్రేతాయుగం నాటి శివాలయం ఉంది. క్రీ.శ.4-7 శతాభ్దాల కాలంలో పాలించిన విష్ణుకుండినులు కీసరగుట్టను సైనిక స్థావరంగా ఉపయోగించినట్లుగా చరిత్రకారులు నిర్థారించారు.
నాగారం (Nagaram):
నాగారం మేడ్చల్ జిల్లా కీసర మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది పురపాలక సంఘంగా ఉంది. ఈసీఐల్, పోచారం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉంది. ECIL నుంచి కీసరగుట్ట మార్గం నాగారం మీదుగా వెళ్ళుచున్నది.



ఇవి కూడా చూడండి:
  • కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం,

 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా మండలాలు, కీసర మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
  • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
  • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


Keesara Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

6, నవంబర్ 2020, శుక్రవారం

మేడిపల్లి మండలం (Medipalli Mandal)

జిల్లామేడ్చల్
రెవెన్యూ డివిజన్కీసర
అసెంబ్లీ నియోమేడ్చల్
లోకసభ నియోమల్కాజ్‌గిరి
రెవెన్యూ గ్రామాలు
8
మేడిపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అదివరకు ఘట్‌కేసర్ మండలంలో ఉన్న 8 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం మీదుగా జాతీయ రహదారి నెం 202 వెళ్ళుచున్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని బోడుప్పల్ మరియు పీర్జాదిగూడలు నగరపాలక సంస్థలుగా ఉన్నాయి.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున ఘట్‌కేసర్ మండలం, పశ్చిమాన ఉప్పల్ మండలం, ఉత్తరాన కాప్రా మండలం, ఈశాన్యాన కీసర మండలం, దక్షిణాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

రాజకీయాలు:
ఈ మండలము మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని బోడుప్పల్ మరియు పీర్జాదిగూడలు నగరపాలక సంస్థలుగా ఉన్నాయి.
 
మేడిపల్లి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
మండలంలోని గ్రామాలు:
Bibi shaeb Maqta, Boduppal, Chengicherla, Gulamaliguda, Parvatapur, Peerzadiguda, Medipally, Miyapur
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
.
బోడుప్పల్ (Boduppal):
బోడుప్పల్ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణప్రాంతము. 2016కు ముందు గ్రామపంచాయతీగా ఉన్న బోడుప్పల్ చెంగిచెర్లతో కలిపి పురపాలక సంఘంగా, 2019లో నగరపాలక సంస్థగా మారింది. ఈ ప్రాంతం జాతీయ రహదారి 163పై ఉంది. 2019లో సామల బుచ్చిరెడ్డి తొలి మేయరుగా ఎన్నికైనారు.
చెంగిచెర్ల (Chengicherla):
చెంగిచెర్ల మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న చెంగిచెర్ల 2016లో బోడుప్పల్ పురపాలకసంఘంలో కలిసింది. 2019లో బోడుప్పల్ నగరపాలక సంస్థగా మారింది.
మేడిపల్లి (Medipalli):
మేడిపల్లి మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న మేడిపల్లి  2016లో పీర్జాదిగూడ పురపాలకసంఘంలో కలిసింది. ఇది 2019లో నగరపాలక సంస్థగా మారింది. 
పర్వతాపూర్ (Parvatapur):
పర్వతాపూర్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న పర్వతాపూర్ 2016లో పీర్జాదిగూడ పురపాలకసంఘంలో కలిసింది. ఇది 2019లో నగరపాలక సంస్థగా మారింది. 
పీర్జాదిగూడ (Peerzadiguda):
పీర్జాదిగూడ మేడ్చల్ జిల్లాకు చెందిన పట్టణప్రాంతము. ప్రారంభంలో గ్రామపంచాయతీగా ఉన్న పీర్జాదిగూడ 2016లో మేడిపల్లి మరియు పర్వతాపూర్ పంచాయతీలతో కలిపి పురపాలకసంఘంగా, 2019లో నగరపాలక సంస్థగా మారింది.



ఇవి కూడా చూడండి:

 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా మండలాలు, మేడిపల్లి మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
  • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
  • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


Medipalli Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

22, ఆగస్టు 2016, సోమవారం

మేడ్చల్ జిల్లా (Medchal District)

మండలాలు15
రెవెన్యూ డివిజన్లు2
వైశాల్యం1084
జనాభా2440073
రెవెన్యూ గ్రామాలు
163
గ్రామపంచాయతీలు
61
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పాటైన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే. జిల్లా గుండా 3 జాతీయ రహదారులు, 3 రైల్వే మార్గాలు వెళ్ళుచున్నాయి. 

చారిత్రకమైన త్రేతాయుగం నాటి శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఈ జిల్లాలో ఉంది. సమరయోధురాలు సంగెం లక్ష్మీబాయమ్మ, వ్యవసాయ శాస్త్రవేత్త కె.రమేశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, ఉమావెంకట్రాంరెడ్డి ఈ జిల్లాకు చెందినవారు.

మేడ్చల్ జిల్లాలో చాలా భాగం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. అంతేకాకుండా జిల్లాలో 4 నగరపాలక సంస్థలు (పీర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట్), 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

మండలాలు:
మేడ్చల్, షామీర్‌పేట్, కీసర, కాప్రా, ఘట్‌కేసర్, మేడిపల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, దుండిగల్ గండిమైసమ్మ, బాచుపల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, మూడుచింతలపల్లి.
 
చరిత్ర:
సెప్టెంబరు 17, 1948న నిజాం పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాదు జిల్లాలో భాగంగా హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన పిదప 1978లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హయంలో ఈ ప్రాంతం అప్పుడు కొత్తగా అవతరించిన రంగారెడ్డి జిల్లాలో భాగమైంది. 1969లో మరియు 2009-14 కాలంలో ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 2011లో 42 రోజులపాటు సకలజనుల సమ్మె జయప్రదమైంది. జూన్ 2, 2014లో ఈ ప్రాంతం కొత్తగా అవతరించిన తెలంగాణలో భాగమైంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో రంగారెడ్డి జిల్లా నుంచి విడదీసిన 14 మండలాలతో మేడ్చల్ జిల్లా ఏర్పాటైంది. మార్చి 2019లో శామీర్‌పేట మండలాన్ని విభజించి మరో మండలాన్ని (మూడుచింతలపల్లి మండలం) ఏర్పాటుచేశారు. 

రవాణా సౌకర్యాలు:
సికింద్రాబాదు నుంచి నిజామాబాదు వెళ్ళు రైలుమార్గం,  కాజీపేట వెళ్ళు రైలుమార్గం మరియు హైదరాబాదు-వాడి మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. 7వ నెంబరు (కొత్తపేరు 44), 9వ నెంబరు మరియు 202 నెంబరు జాతీయ రహదారులు కూడా జిల్లాపై నుంచి వెళ్తున్నాయి.
 
రాజకీయాలు:
మేడ్చల్ జిల్లాకు చెందిన మండలాలు మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తాయి.


ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలంగాణ జిల్లాలు, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా,


 = = = = =


5, డిసెంబర్ 2020, శనివారం

హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికలు 2020 (Greater Hyderabad Muncipal Corporation Elections 2020)

గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు 2020
(Greater Hyderabad Muncipal Corporation Elections Results 2020)


హైదరాబాదు మహానగరపాలక సంస్థకు డిసెంబరు 1, 2020న ఎన్నికలు జరిగాయి. పాలకవర్గం గడుపు ఫిబ్రవరి వరకు ఉన్ననూ ముందస్తుగా ఎన్నికలు నిర్వహించారు. డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు జరిగింది. 150 డివిజన్లకుగాను తెరాస 55, భాజపా 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలలో విజయం సాధించాయి. భారతీయ జనతాపార్టీ 4 స్థానాల నుంచి ఏకంగా 12 రెట్లతో లబ్దిపొంది 48 స్థానాలలో విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనం సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గత ఎన్నికలలో పొందిన 99 స్థానాల నుంచి 55 స్థానాలకు పడిపోవడం జరిగింది. ఎంఐఎం మరియు కాంగ్రెస్ పార్టీ స్థానాలలో అంతగా మార్పులేదు.

ఈ ఎన్నికకు ముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా సాధించిన సంచలన విజయం ఈ ఎన్నికలలో కూడా కొనసాగినట్లుగా చెప్పవచ్చు. భాజపాకు మెజారిటీ స్థానాలు, మేయర్ స్థానం లభించకున్ననూ సాధించిన 48 స్థానాలలో అత్యధిక స్థానాలు తెరాస సిటింగ్ స్థానాలు కావడం అందులోనూ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో తెరాస ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. పలువులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంచార్జీలుగా పనిచేసి కూడా తెరాసకు విజయం దక్కలేదు. ఉప్పల్ డివిజన్‌లో తెరాస అభ్యర్థి ఉప్పల్ ఎమ్మెల్యే భార్య ఓడిపోవడం కూడా సంచలనమే.
 
ఎప్పటిలాగే నగరంలో ఓటింగ్ శాతం స్వల్పంగానే ఉంది. హోరాహోరీగా ప్రచారం సాగించిననూ ప్రజలలో ఆసక్తి లేదనడానికి స్వల్ప పోలింగ్ శాతమే నిదర్శనం. 


ఈ ఎన్నికలలో తెరాస ఓటమికి కారణాలు:
1) నగరంలో ఉద్యోగులు చాలా అధికంగా ఉన్నారు. కాని ఉద్యోగులకు తెరాసపై తీవ్ర నిరాశ ఉండటంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకగా ఓటువేశారు. పోస్టల్ ఓట్ల లెక్కింపులో భాజపా 92 స్థానాలలో మెజారిటీ పొందడం దీనికి తిరుగులేని నిదర్శనం. ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకోసారి ప్రకటించే వేతన స్థిరీకరణ ప్రకటించకపోవడం, కనీసం ఐఆర్ కూడా విడుదల చేయకపోవడం, ప్రతి 6 మాసాలకు రావాల్సిన డిఏ బకాయిలు క్రమంగా చెల్లించకపోవడం, లాక్‌డౌన్ సమయంలో 3 మాసాలు సగం జీతాలే ఇవ్వడం, మిగితా సగం జీతాలకై వాయిదాలు ఇంకనూ పూర్తిగా అందకపోవడం తదితరాలు ఉద్యోగులు తెరాసకు వ్యతిరేకంగా ఓటువేయడానికి కారణమైనాయి.
 
2)  ఎన్నికలకు ముందు వరదసహాయం రూ 10వేలు చెల్లింపునకు హైకోర్టు నిరాకరించడంతో ప్రజలలో తీవ్ర నిరాశ ఏర్పడింది. ఎనికలకు ఇంకనూ సమయం ఉన్ననూ వరద సహాయం చెల్లింపు వాయిదాకై ఎన్నికలు హుటాహుటినా పెట్టారనే అభిప్రాయం మరియు అపోహ ప్రజలలో కలిగింది.

3) ఎంఐఎం నాయకులు పి.వి.నరసింహారావు, ఎన్టీ రామారావు సమాధులు కూల్చివేయాలని ప్రకటించినప్పుడు తెరాస గట్టిగా ఖండించకపోవడం నగరవాసులకు రుచించలేదు. తెరాస, ఎంఐఎం లు ఒకేగూటి పక్షులుగా ఉన్నాయనే అపోహ ప్రజలలోకి వెళ్ళింది. దీనితో ప్రజలు భాజపై మొగ్గారు.
 
4) భాజపా తరఫున ప్రచారంకై జాతీయ అధ్యక్షులు జె,పి.నడ్డా, కేంద్ర మంత్రి అమిత్‌షా, జాతీయ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య తదితరులు రావడం రాజకీయంగా వేడెక్కింది. తెరాసకు ప్రత్యమ్నాయం భాజాపానే అనే అభిప్రాయం నగరవాసులలో నెలకొంది. 
 
5) గత ఆరేళ్ళుగా ఉద్యోగావకాశాలు లేకపోవడంతో నిరుద్యోగులలో, విద్యావంతులలో తీవ్ర నిరసన నెలకొంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, లాఠీదెబ్బలు తిని, జైలుకు కూడా వెళ్ళిన విద్యార్థులు రాష్ట్ర అవతరణ తర్వాత ఉద్యోగావకాశాలు ఉంటాయని ఆశించిననూ ఎలాంటి ప్రతిఫలం దక్కలేదు. దీనితో
నిరుద్యోగులు, విద్యావంతులు తెరాసకు వ్యతిరేకంగా ఓటువేశారు. 

6) అత్యంత ప్రధానమైనది తెరాస వ్యతిరేక ఓట్లు చీలకపోవడం. తెరాస ఉద్దేశ్యపుర్వకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడం భాజాపాకు బలం చేకూరింది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ నాయకులను తెరాసలో చేర్చుకోవడంతో కాంగ్రెస్ బలహీనమైంది. తెరాసకు ప్రత్యమ్నాయంగా భాజపా నిలిచింది. తెరాస వ్యతిరేక ఓట్లన్నీ భాజపా పొందడంలో లాభపడింది.


 
 
డివిజన్ సంఖ్య - డివిజన్ పేరు     గెలిచిన అభ్యర్థి     పార్టీ      
  1. కాప్రా (Kapra) -- స్వర్ణరాజ్ -- తెరాస
  2. ఏఎస్ రావు నగర్ (AS Rao Nagar) -- శిరీషారెడ్డి --  కాంగ్రెస్
  3. చర్లపల్లి (Cherlapaly) -- బొంతు శ్రీదేవి -- తెరాస
  4. మీర్ పేట్ హెచ్ బీ (Meerpet) -- జె.ప్రభుదాస్ -- తెరాస
  5. మల్లాపుర్ (Mallapur) దేవేందర్ రెడ్డి -- తెరాస
  6. నాచారం (Nacharam) -- శాంతి సాయిజెన్ శేఖర్ -- తెరాస
  7. చిలకానగర్ (Chilkanagar) -- బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ -- తెరాస
  8. హబ్సిగూడ (Habsiguda) -- చేతన -- భాజపా
  9. రామాంతపూర్ ఈస్ట్ (Ramanthapur East) బండారు శ్రీవాణి -- భాజపా   
  10. ఉప్పల్ (Uppal) -- రజిత -- కాంగ్రెస్
  11. నాగోల్ (Nagol) చింతల అరుణ -- భాజపా
  12. మన్సూర్ బాద్  (Mansurabad) -- కొప్పుల నర్సింహారెడ్డి -- భాజపా
  13. హయత్ నగర్ (Hayathnagar) -- కళ్ళెం నవజీవన్ రెడ్డి
  14. బీఎన్ రెడ్డి నగర్ (BN Reddy Nagar) -- మొద్దు లచ్చిరెడ్డి -- భాజపా
  15. వనస్థలిపురం (Vanasthalipuram) -- రాగుల వెంకటేశ్వర్ రెడ్డి -- భాజపా
  16. హస్తినాపురం (Hastinapuram) -- బానోత్ సుజాతానాయక్ -- భాజపా
  17. చంపాపేట్ (Champate) -- మధుసూధన్ రెడ్డి -- భాజపా
  18. లింగోజిగూడ (Lingojiguda) -- ఆకుల రమేష్ గౌడ్ -- భాజపా
  19. సరూర్ నగర్ (Saroornagar) -- ఆకుల శ్రివాణి -- భాజపా
  20. ఆర్ కే పురం  (RK Puram) -- వి.రాధ -- భాజపా 
  21. కొత్తపేట్  (Kothapet)
  22. చైతన్యపురి (Chaitanyapuri)
  23. గడ్డిఅన్నారం (Gaddi Annaram)
  24. సైదాబాద్ (Saidabad)
  25. ముసారాంబాగ్ (Nusarambagh)
  26. ఓల్డ్ మలక్ పేట్ (Old Malakpet) 
  27. అక్బర్ బాగ్ (Akbarbagh)
  28. అజామ్ పురా (Azampura)
  29. చవానీ (Chavani) 
  30. డబీర్ పురా (Dabirpura)
  31. రెయిన్ బజార్ (Rainbazar)
  32. ఫత్తార్ ఘాట్  (Patharghat)
  33. మొఘల్ పురా (Moghalpura)
  34. తలాబ్ చన్ చలం  (Talab chan chalam) 
  35. గౌలిపురా (Goulipura)
  36. లలితాబాగ్ (Lalithabagh)
  37. కుర్మాగూడ  (Kurmaguda)
  38.  ఐఎస్ సదన్ (IS Sadan)
  39. సంతోష్ నగర్ (Santhoshnagar)    
  40. రియాసత్ నగర్  (Riyasatnagar)
  41. కాంచన్ బాగ్ (Kanchanbagh)
  42. బార్కాస్ (Barcas)
  43. చాంద్రాయాణగుట్ట (Chandrayanagutta)  
  44. ఉప్పుగూడ (Uppuguda)
  45. జంగం మెట్ (Jangam mett)
  46. ఫలక్ నుమా  (Falaknuma) 
  47. నవాబ్ సాహెబ్ కుంట (Nawab Saheb kunta)    
  48. శాలిబండ (Shalibanda)
  49. ఘన్సీ బజార్ (Ghansibaxar)
  50. బేగంబజార్  (Begumbazar)
  51. గోషామహల్‌  (Ghoshamahal)     
  52. పురానా పూల్  (Puranapool)
  53. దూద్‌బౌలి (Doodhbowli)
  54. జహనుమా (Jahanuma)
  55. రామనాస్ పుర (Ramanaspura)     
  56. కిషన్‌బాగ్  (Kishanbagh)
  57. సులేమాన్ నగర్ (Suleman Nagar)
  58. శాస్త్రిపురం (Shastri puram)
  59. మైలార్‌దేవ్‌పల్లి (mailar dev palli)
  60. రాజేంద్రనగర్ (Rajendranagarar)
  61. అత్తాపూర్  (Allapur)
  62. జియాగూడ  (Jiyaguda)
  63. మంగళ్‌హట్  (Mangalhat)
  64. దత్తాత్రేయ  (Dattatreya)
  65. కార్వాన్ (Karvan)
  66. లంగర్‌హౌస్   (Langar house)
  67. గోల్కొండ (Golconda)
  68. టోలీ చౌకి (Tolichowki)
  69. నానల్‌నగర్  (Nanalguda)
  70. మెహిదీపట్నం (Mehdipatnam)
  71. గుడిమల్కాపూర్  (Gudimalkapur)
  72. ఆసిఫ్‌నగర్  (Asifnagar)
  73. విజయ్ నగర్ (Vijaynagar)
  74. అహ్మద్‌నగర్ (Ahmadnagar)
  75. రెడ్‌హిల్స్  (Redhills)
  76. మల్లేపల్లి  (Mallepalli)
  77. జాంబాగ్  (Jambagh)
  78. గన్‌ఫౌండ్రీ (Gunfoundri)
  79. హిమాయత్‌నగర్ (Himayathnagar)
  80. కాచిగూడ (Kachiguda)
  81. నల్లకుంట (Nallakunta)
  82. గోల్నాక (Golnaka)
  83. అంబర్‌పేట (Amberpet)
  84. బాగ్ అంబర్‌పేట (Bagh Amberpet)
  85. అడిక్‌మెట్ (Adikmet)
  86. ముషీరాబాద్ (Musheer
  87. రాంనగర్ (Ramnagara)
  88. భోలక్‌పూర్ (Bholakpur)
  89. గాంధీనగర్ (Gandhinagar)
  90. కవాడిగూడ (Kavadiguda)
  91. ఖైరతాబాద్ (Khairatabad0
  92. వెంకటేశ్వరకాలనీ (venkateshwar colony)
  93. బంజారాహిల్స్ (Bajara hills)
  94. షేక్‌పేట (Shaikpet)
  95. జూబ్లీహిల్స్  (Jublee hills)
  96. యూసుఫ్‌గూడ  (Yusuf guda)
  97. సోమాజిగూడ  (Somajiguda)
  98. అమీర్‌పేట (Ameerpet)
  99. వెంగళ్‌రావునగర్  (Vengalrao nagar)
  100. సనత్‌నగర్ (Sanat nagara)
  101. ఎర్రగడ్డ (Erragadda)
  102. రహ్మత్‌నగర్ (Rahmat nagara)
  103. బోరబండ (Borabanda)
  104. కొండాపూర్  (Kondapur)
  105. గచ్చిబౌలి  (Gachibowli)
  106. శేరిలింగంపల్లి  (Sherilingampalli)
  107. మాదాపూర్  (Madhapur)
  108. మియాపూర్  (Miyapur)
  109. హఫీజ్‌పేట  (Hafizpet)
  110. చందానగర్ (Chandanagar)
  111. భారత్ నగర్ (Bharatnagar)
  112. రామ చంద్రాపురం (Ramachandrapuram)
  113. పటాన్‌చెఱు (Patancheru)
  114. కేపీహెచ్‌బీ కాలనీ  (KPHB Colony)
  115. బాలాజీనగర్ (Balajinagar)
  116. అల్లాపూర్ (Allapur)
  117. మూసాపేట (Musapet)
  118. ఫతేనగర్  (Fathenagar)
  119. ఓల్డ్ బోయిన్‌పల్లి  (Old boinpalli)
  120. బాలానగర్ (Balanagar)
  121. కూకట్‌పల్లి  (Kukatpalli)
  122. వివేకానందనగర్ (Vivekanandanagar)
  123. హైదర్‌నగర్ (Hydernagar)
  124. ఆల్విన్‌కాలనీ (Alwyn Colonny)
  125. గాజులరామారం (Gajula Ramaram)
  126. జగద్గిరిగుట్ట  (Jagadgiri gutta)
  127. రంగారెడ్డినగర్  (Rangareddy nagar)
  128. చింతల్   (Chintal)
  129. సూరారం  (Suraram)
  130. సుభాష్‌నగర్  (Subhash nagar)
  131. కుత్బుల్లాపూర్  (Qutbullapur)
  132. జీడిమెట్ల  (Jeedimetla)
  133. మచ్చబొల్లారం  (Macha Bollaram)
  134. అల్వాల్  (Alwal)
  135. వెంకటాపురం  (Venkatapur)
  136. నేరెడ్‌మెట్  (Neredmet)
  137. వినాయకనగర్  (Vinayak nagar)
  138. మౌలాలి  (Moulali)
  139. ఈస్ట్ ఆనంద్‌బాగ్  (East Amberbagh)
  140. మల్కాజిగిరి  (Malkajgiri)
  141. గౌతమ్‌నగర్ (Gowthamnagar)
  142. అడ్డగుట్ట (Addagutta)
  143. తార్నాక  (Tarnaka)
  144. మెట్టుగూడ  (Mettuguda)
  145. సీతాఫల్‌మండి (Seethafal mandi)
  146. బౌద్ధనగర్  (Bowdhanagar)
  147. బన్సీలాల్‌పేట (Bansilalpet)
  148. రాంగోపాల్‌పేట (Ramgopalpet)
  149. బేగంపేట (Begumpet)
  150. మోండామార్కెట్  Mondamarket)

విభాగాలు: హైదరాబాదు, ఎన్నికలు, 2020,

GHMC, Hyderabad, GHMC Wards in Telugu, Ward wise corporators, TRS lost reasons in GHMC Elections, Reasons for BJP winning in GHMC elections 2020

1, నవంబర్ 2020, ఆదివారం

మల్కాజ్‌గిరి మండలం (Malkajgiri Mandal)

జిల్లామేడ్చల్
రెవెన్యూ డివిజన్మల్కాజ్‌గిరి
అసెంబ్లీ నియోమల్కాజ్‌గిరి
లోకసభ నియోమల్కాజ్‌గిరి
జనాభా
414530
రెవెన్యూ గ్రామాలు
2
మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగముగా ఉన్నది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలంలోని 10 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా ఆల్వాల్ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలం రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.. 
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన ఆల్వాల్ మండలం, తూర్పున కాప్రా మండలం, దక్షిణాన ఉప్పల్ మండలం, పశ్చిమాన హౌదరాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 287069. ఇందులో పురుషులు 146408, మహిళలు 140661. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 414530. ఇందులో పురుషులు 209591, మహిళలు 204939. అక్షరాస్యుల సంఖ్య 332143. మండలం మొత్తం పట్టణ ప్రాంతమే. అక్షరాస్యత శాతం 88.27%.

రాజకీయాలు:
ఈ మండలము మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాదులో వార్డు సంఖ్య 8 & 140లో ఉంది.
 
మల్కాజ్‌గిరి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
మండలంలోని గ్రామాలు:
మల్కాజ్‌గిరి, అమ్ముగూడ
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
.
అమ్ముగూడ (Ammuguda):
అమ్ముగూడ మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి మండలమునకు చెందిజ రెవెన్యూ గ్రామము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది (వార్డు సంఖ్య 8). బొల్లారం-సికింద్రాబాదు మార్గంలో అమ్ముగూడ రైల్వేస్టేషన్ ఉంది.
మల్కాజ్‌గిరి (Malkajgiri):
మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండలకేంద్రము. ఇది పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో భాగంగా ఉంది (వార్డు సంఖ్య 140, సర్కిల్ 28). 2007లో GHMCలో విలీనం చేయుటకు ముందు మల్కాజ్‌గిరి పురపాలక సంఘంగా ఉండేది. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన మేడ్చల్ జిల్లాలో కలిసింది. సికింద్రాబాద్-మన్మాడ్ మార్గంలో మల్కాజ్‌గిరిలో రైల్వేస్టేషన్ ఉంది.



ఇవి కూడా చూడండి:

 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా మండలాలు, మల్కాజ్‌గిరి మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
  • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
  • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


Malkajgiri Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

28, అక్టోబర్ 2020, బుధవారం

ఆల్వాల్ మండలం (Alwal Mandal)

జిల్లామేడ్చల్
రెవెన్యూ డివిజన్మల్కాజ్‌గిరి
అసెంబ్లీ నియోమల్కాజ్‌గిరి
లోకసభ నియోమల్కాజ్‌గిరి
ఆల్వాల్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము. ఇది గ్రేటర్ హైదరాబాదులో భాగముగా ఉన్నది. మండలం గుండా సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకుక్రితం మల్కాజ్‌గిరి మండలంలో ఉన్న 10 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మేడ్చల్ జిల్లాలో భాగమైంది.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన షామీర్‌పేట మండలం, తూర్పున కాప్రా మండలం, దక్షిణాన మల్కాజ్‌గిరి మండలం మరియు హైదరాబాదు జిల్లా, నైరుతిన బాలానగర్ మండలం, పశ్చిమాన కుత్బుల్లాపూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నది.
 
మండలంలోని గ్రామాలు:
Alwal, Lothukunta, Dammaiguda, Macha Bollaram, Farzanguda, Akbarja, Turkapally, Kowkoor, Mahadevpur, Yapral
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు:
ఆల్వాల్ (Alwal):
ఆల్వాల్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. 2006 వరకు ఇది పురపాలక సంఘంగా ఉండేది. 2006లో ఇది గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థలో భాగమైంది. 2016 వరకు రంగారెడ్డి జిల్లాలో ఉండగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మేడ్చల్ జిల్లాలో చేరింది. ఆల్వాల్‌లో రైల్వే స్టేషన్ ఉంది.
యాప్రాల్ (Yapral):
యాప్రాల్ మేడ్చల్ జిల్లా ఆల్వాల్ మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. ఇది హైదరాబాదు నగరంలో భాగము. ఆల్వాల్ పురపాలక సంఘం పరిధిలో ఉంటూ 2007లో గ్రేటర్ హైదరాబాదు కార్పోరేషన్‌లో భాగమైంది. ప్రస్తుతం GHMCలో మాల్కాజ్‌గిరి సర్కిల్‌లో నేరెడ్‌మెట్ డీవిజన్‌లో భాగంగా ఉంది.


ఇవి కూడా చూడండి:
  • హైదరాబాదు మహా నగరపాలక సంస్థ,
 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా మండలాలు, ఆల్వాల్ మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
  • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
  • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


Alwal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

6, ఫిబ్రవరి 2016, శనివారం

గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు 2015 (Greater Hyderabad Muncipal Corporation Elections Results 2016)

గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు 2015
(Greater Hyderabad Muncipal Corporation Elections Results 2016)


డివిజన్ సంఖ్య - డివిజన్ పేరు     గెలిచిన అభ్యర్థి     పార్టీ      
  1. కాప్రా (Kapra)     స్వర్ణరాజు శివమణి     టీఆర్ఎస్    
  2. ఏఎస్ రావు నగర్ (AS Rao Nagar)     పావని రెడ్డి     టీఆర్ఎస్      
  3. చర్లపల్లి (Cherlapaly)     బొంతు రామ్మోహన్ రావు     టీఆర్ఎస్   
  4. మీర్ పేట్ హెచ్ బీ (Meerpet)     గొల్లూరి అంజయ్య     టీఆర్ఎస్  
  5. మల్లాపుర్ (Mallapur)     దేవేందర్ రెడ్డి     టీఆర్ఎస్    
  6. నాచారం (Nacharam)     శాంతి     కాంగ్రెస్    
  7. చిలకానగర్ (Chilkanagar)     సరస్వతి     టీఆర్ఎస్    
  8. హబ్సిగూడ (Habsiguda)     స్వప్న సుభాష్ రెడ్డి     టీఆర్ఎస్      
  9. రామాంతపూర్ ఈస్ట్ (Ramanthapur East)     జ్యోస్నా నాగేశ్వరరావు     టీఆర్ఎస్  
  10. ఉప్పల్ (Uppal)     అనలా రెడ్డి     టీఆర్ఎస్   
  11. నాగోల్ (Nagol)    సంగీత ప్రశాంత్ గౌడ్     టీఆర్ఎస్   
  12. మన్సూర్ బాద్  (Mansurabad)    విఠల్ రెడ్డి     టీఆర్ఎస్    
  13. హయత్ నగర్ (Hayathnagar)     తిరుమల్ రెడ్డి     టీఆర్ఎస్    
  14. బీఎన్ రెడ్డి నగర్ (BN Reddy Nagar)    లక్ష్మీ ప్రసన్న గౌడ్     టీఆర్ఎస్   
  15. వనస్థలిపురం (Vanasthalipuram)    రాజశేకర్ రెడ్డి     టీఆర్ఎస్  
  16. హస్తినాపురం (Hastinapuram)    పద్మా నాయక్     టీఆర్ఎస్    
  17. చంపాపేట్ (Champate)    రమణా రెడ్డి     టీఆర్ఎస్    
  18. లింగోజిగూడ (Lingojiguda)    శ్రీనివాస రావు     టీఆర్ఎస్   
  19. సరూర్ నగర్ (Saroornagar)    అనితా దయాకర్ రెడ్డి     టీఆర్ఎస్      
  20. ఆర్ కే పురం  (RK Puram)   రాధారెడ్డి     బీజేపీ      
  21. కొత్తపేట్  (Kothapet)   సాగర్ రెడ్డి     టీఆర్ఎస్    
  22. చైతన్యపురి (Chaitanyapuri)    జీ విఠల్ రెడ్డి     టీఆర్ఎస్    
  23. గడ్డిఅన్నారం (Gaddi Annaram)    ప్రవీణ్ ముదిరాజ్     టీఆర్ఎస్   
  24. సైదాబాద్ (Saidabad)    సింగిరెడ్డి స్వర్ణ లతా రెడ్డి     టీఆర్ఎస్   
  25. ముసారాంబాగ్ (Nusarambagh)    తీగల సునీతా రెడ్డి     టీఆర్ఎస్    
  26. ఓల్డ్ మలక్ పేట్ (Old Malakpet)    అంజూమ్ ఫాతిమా     ఎంఐఎం    
  27. అక్బర్ బాగ్ (Akbarbagh)    సయ్యద్ మింజుద్దీన్     ఎంఐఎం      
  28. అజామ్ పురా (Azampura)    ఆయేషా జహన్ నసీం     ఎంఐఎం    
  29. చవానీ (Chavani)    మహ్మద్ మూర్తజా అలీ     ఎంఐఎం   
  30. డబీర్ పురా (Dabirpura)    రియాజ్ ఉల్ హసన్     ఎంఐఎం      
  31. రెయిన్ బజార్ (Rainbazar)    రియాజ్ ఉల్ హసన్     ఎంఐఎం      
  32. ఫత్తార్ ఘాట్  (Patharghat)    సయ్యద్ సోహైల్ ఖద్రీ     ఎంఐఎం   
  33. మొఘల్ పురా (Moghalpura)    అమ్తల్ అలీ     ఎంఐఎం  
  34. తలాబ్ చన్ చలం  (Talab chan chalam)   నస్రీన్ సుల్తానా     ఎంఐఎం      
  35. గౌలిపురా (Goulipura)    ఆలె లలిత     బీజేపీ      
  36. లలితాబాగ్ (Lalithabagh)    అలీ షరీఫ్     ఎంఐఎం      
  37. కుర్మాగూడ  (Kurmaguda)   సమీనా బేగం     ఎంఐఎం      
  38.  ఐఎస్ సదన్ (IS Sadan)    స్వప్న సుందర్ రెడ్డి     టీఆర్ఎస్    
  39. సంతోష్ నగర్ (Santhoshnagar)    ముజాఫర్ హుస్సేన్     ఎంఐఎం      
  40. రియాసత్ నగర్  (Riyasatnagar)   ముస్తఫాబేగ్     ఎంఐఎం      
  41. కాంచన్ బాగ్ (Kanchanbagh)   రేష్మా ఫాతిమా     ఎంఐఎం      
  42. బార్కాస్ (Barcas)    షబానా బేగం     ఎంఐఎం      
  43. చాంద్రాయాణగుట్ట (Chandrayanagutta)    అబ్దుల్ వాహెబ్     ఎంఐఎం      
  44. ఉప్పుగూడ (Uppuguda)    అబ్దుల్ సమీద్ బిన్ అబ్ద్     ఎంఐఎం      
  45. జంగం మెట్ (Jangam mett)    అబ్దుల్ రెహ్మాన్     ఎంఐఎం      
  46. ఫలక్ నుమా  (Falaknuma)  తారాబాయ్     ఎంఐఎం      
  47. నవాబ్ సాహెబ్ కుంట (Nawab Saheb kunta)    ష్రీన్ ఖాతున్     ఎంఐఎం      
  48. శాలిబండ (Shalibanda)    ముస్తఫా ఆలీ     ఎంఐఎం      
  49. ఘన్సీ బజార్ (Ghansibaxar)    రేణు సోని     బీజేపీ      
  50. బేగంబజార్  (Begumbazar)   శంకర్ యాదవ్     బీజేపీ    
  51. గోషామహల్‌  (Ghoshamahal)   ముఖేశ్ సింగ్     టీఆర్ఎస్      
  52. పురానా పూల్  (Puranapool)   రాజమోహన్     ఎంఐఎం    
  53. దూద్‌బౌలి (Doodhbowli)    గఫార్     ఎంఐఎం      
  54. జహనుమా (Jahanuma)    ఖాజ ముబాషీరుద్దీన్     ఎంఐఎం      
  55. రామనాస్ పుర (Ramanaspura)     మహ్మద్ ముబెన్     ఎంఐఎం      
  56. కిషన్‌బాగ్  (Kishanbagh)   మహ్మద్ సలీం     ఎంఐఎం      
  57. సులేమాన్ నగర్     అబీదా సుల్తానా     ఎంఐఎం    
  58. శాస్త్రిపురం     మిసబ్ ఉద్దీన్     ఎంఐఎం    
  59. మైలార్‌దేవ్‌పల్లి     టీ.శ్రీనివాసరెడ్డి     టీఆర్ఎస్   
  60. రాజేంద్రనగర్     కే. శ్రీలత     టీఆర్ఎస్    
  61. అత్తాపూర్     విజయ్ జంగయ్య     టీఆర్ఎస్   
  62. జియాగూడ     కృష్ణ     టీఆర్ఎస్    
  63. మంగళ్‌హట్     పరమేశ్వరి సింగ్     టీఆర్ఎస్    
  64. దత్తాత్రేయ     యూసఫ్     ఎంఐఎం    
  65. కార్వాన్     రాజేందర్ యాదవ్     ఎంఐఎం    
  66. లంగర్‌హౌస్     అమీనా బేగం     ఎంఐఎం    
  67. గోల్కొండ     హన్సీఫ్     ఎంఐఎం    
  68. టోలీ చౌకి     ఆయేషా హుమ్రా     ఎంఐఎం    
  69. నానల్‌నగర్     నస్రీద్దీన్     ఎంఐఎం   
  70. మెహిదీపట్నం     మాజిద్ హుస్సేన్     ఎంఐఎం    
  71. గుడిమల్కాపూర్     బంగారి ప్రకాశ్     టీఆర్ఎస్    
  72. ఆసిఫ్‌నగర్     ఫాతిమా అంజూం     ఎంఐఎం    
  73. విజయ్ నగర్     సల్మా అమీన్    ఎంఐఎం    
  74. అహ్మద్‌నగర్     ఆయేషా రుబీనా     ఎంఐఎం    
  75. రెడ్‌హిల్స్     ఆయేషా ఫాతిమా     ఎంఐఎం    
  76. మల్లేపల్లి     తర్నుమ్ నాజ్     ఎంఐఎం    
  77. జాంబాగ్     మోహన్     ఎంఐఎం    
  78. గన్‌ఫౌండ్రీ     మమతా గుప్తా     టీఆర్ఎస్    
  79. హిమాయత్‌నగర్     హేమలత యాదవ్     టీఆర్ఎస్      
  80. కాచిగూడ     చైతన్య కన్నా యాదవ్     టీఆర్ఎస్      
  81. నల్లకుంట     శ్రీదేవి     టీఆర్ఎస్      
  82. గోల్నాక     కాలేరు పద్మ     టీఆర్ఎస్      
  83. అంబర్‌పేట     పులి జగన్     టీఆర్ఎస్    
  84. బాగ్ అంబర్‌పేట     పద్మావతి డి.పి రెడ్డి     టీఆర్ఎస్      
  85. అడిక్‌మెట్     హేమలత     టీఆర్ఎస్      
  86. ముషీరాబాద్     భాగ్యలక్ష్మి యాదవ్     టీఆర్ఎస్      
  87. రాంనగర్     వీ.శ్రీనివాస రెడ్డి     టీఆర్ఎస్      
  88. భోలక్‌పూర్     రామారావు     టీఆర్ఎస్      
  89. గాంధీనగర్     పద్మా నరేశ్     టీఆర్ఎస్      
  90. కవాడిగూడ     లాస్య నందిత     టీఆర్ఎస్      
  91. ఖైరతాబాద్     పి. విజయా రెడ్డి     టీఆర్ఎస్      
  92. వెంకటేశ్వరకాలనీ     కవిత గోవర్దన్ రెడ్డి     టీఆర్ఎస్      
  93. బంజారాహిల్స్     గద్వాల్ విజయ లక్ష్మి     టీఆర్ఎస్      
  94. షేక్‌పేట     రషీద్ ఫరజుద్దీన్     ఎంఐఎం      
  95. జూబ్లీహిల్స్     కాజసూర్యనారాయణ     టీఆర్ఎస్      
  96. యూసుఫ్‌గూడ     సంజయ్ గౌడ్     టీఆర్ఎస్  
  97. సోమాజిగూడ     విజయలక్ష్మి     టీఆర్ఎస్    
  98. అమీర్‌పేట     శేషు కుమారి     టీఆర్ఎస్   
  99. వెంగళ్‌రావునగర్     మనోహర్     టీఆర్ఎస్  
  100. సనత్‌నగర్     లక్ష్మి బాల్ రెడ్డి     టీఆర్ఎస్    
  101. ఎర్రగడ్డ     షహీనా బేగం     ఎంఐఎం  
  102. రహ్మత్‌నగర్     నవీన్ యాదవ్     ఎంఐఎం    
  103. బోరబండ     బాబా ఫసీవుద్దీన్     టీఆర్ఎస్  
  104. కొండాపూర్     హమీద్ పటేల్     టీఆర్ఎస్      
  105. గచ్చిబౌలి     సాయిబాబా     టీఆర్ఎస్      
  106. శేరిలింగంపల్లి     నరేంద్ర యాదవ్     టీఆర్ఎస్      
  107. మాదాపూర్     వి.జగదీశ్ గౌడ్     టీఆర్ఎస్      
  108. మియాపూర్     మేకా రమేశ్     టీఆర్ఎస్    
  109. హఫీజ్‌పేట     పూజిత జగదీష్ గౌడ్     టీఆర్ఎస్      
  110. చందానగర్     నవతా రెడ్డి     టీఆర్ఎస్      
  111. భారతి నగర్     సింధు ఆదర్శ్ రెడ్డి     టీఆర్ఎస్   
  112. రామ చంద్రాపురం     అంజయ్య     టీఆర్ఎస్   
  113. పటాన్‌చెఱు     శంకర్ యాదవ్     కాంగ్రెస్  
  114. కేపీహెచ్‌బీ కాలనీ     శ్రీనివాస రావు     టీడీపీ   
  115. బాలాజీనగర్     కావ్య హరీష్ కుమార్     టీఆర్ఎస్  
  116. అల్లాపూర్     సబీహా బేగం     టీఆర్ఎస్   
  117. మూసాపేట     టీ. శ్రావణ్ కుమార్     టీఆర్ఎస్    
  118. ఫతేనగర్     సతీష్ బాబు     టీఆర్ఎస్    
  119. ఓల్డ్ బోయిన్‌పల్లి     నర్సింగ్ యాదవ్     టీఆర్ఎస్  
  120. బాలానగర్     నరేంద్ర చారి     టీఆర్ఎస్    
  121. కూకట్‌పల్లి     జూపల్లి సత్యనారాయణ రావు     టీఆర్ఎస్   
  122. వివేకానందనగర్     లక్ష్మీ బాయి     టీఆర్ఎస్   
  123. హైదర్‌నగర్     జానకీ రామరాజు     టీఆర్ఎస్    
  124. ఆల్విన్‌కాలనీ     వెంకటేశ్ గౌడ్     టీఆర్ఎస్   
  125. గాజులరామారం     శేషగిరి     టీఆర్ఎస్      
  126. జగద్గిరిగుట్ట     కొలుకుల జగన్     టీఆర్ఎస్    
  127. రంగారెడ్డినగర్     విజయ శేఖర్ గౌడ్     టీఆర్ఎస్    
  128. చింతల్     రషీదా బేగం     టీఆర్ఎస్   
  129. సూరారం     సత్యనారాయణ     టీఆర్ఎస్    
  130. సుభాష్‌నగర్     శాంతి రాజశ్రీ రాజేందర్ రెడ్డి     టీఆర్ఎస్      
  131. కుత్బుల్లాపూర్     కూన గౌరీశ్ పారిజాత     టీఆర్ఎస్      
  132. జీడిమెట్ల     పద్మా ప్రతాప్ గౌడ్     టీఆర్ఎస్  
  133. మచ్చబొల్లారం     జితేంద్ర నాథ్     టీఆర్ఎస్  
  134. అల్వాల్     విజయ శాంతి రెడ్డి     టీఆర్ఎస్    
  135. వెంకటాపురం     సబితా కిషోర్     టీఆర్ఎస్    
  136. నేరెడ్‌మెట్     కటిక నేని శ్రీదేవి     టీఆర్ఎస్      
  137. వినాయకనగర్     పుష్పలతా రెడ్డి     టీఆర్ఎస్      
  138. మౌలాలి     ఫాతిమా అమీనుద్దీన్     టీఆర్ఎస్      
  139. ఈస్ట్ ఆనంద్‌బాగ్     ఆకుల నర్సింగ్ రావు     టీఆర్ఎస్      
  140. మల్కాజిగిరి     జగదీష్ గౌడ్     టీఆర్ఎస్      
  141. గౌతమ్‌నగర్     శిరీషా జితేందర్ రెడ్డి     టీఆర్ఎస్      
  142. అడ్డగుట్ట     విజయ కుమారి     టీఆర్ఎస్  
  143. తార్నాక     సరస్వతి హరి     టీఆర్ఎస్    
  144. మెట్టుగూడ     భార్గవి     టీఆర్ఎస్   
  145. సీతాఫల్‌మండి     హేమ     టీఆర్ఎస్    
  146. బౌద్ధనగర్     ధనుంజయ్ దయానంద్ గౌడ్     టీఆర్ఎస్   
  147. బన్సీలాల్‌పేట     హేమలత     టీఆర్ఎస్    
  148. రాంగోపాల్‌పేట     అరుణా గౌడ్     టీఆర్ఎస్   
  149. బేగంపేట     తరుణి నాయి     టీఆర్ఎస్    
  150. మోండామార్కెట్     ఆకుల రూప హరికృష్ణ     టీఆర్ఎస్  

విభాగాలు: హైదరాబాదు, ఎన్నికలు, 2016,

GHMC, Hyderabad

12, నవంబర్ 2016, శనివారం

విభాగము: మేడ్చల్ జిల్లా మండలాలు (Portal: Medchal District Mandals)



విభాగము: మేడ్చల్ జిల్లా మండలాలు 
(Portal: Medchal District Mandals)
  1. ఆల్వాల్ మండలం (Alwal Mandal),
  2. బాచుపల్లి మండలం (Bachupally Mandal),
  3. బాలానగర్ మండలం (Balanagar Mandal),
  4. దుండిగల్ గండిమైసమ్మ మండలం (Dundigal Gandimaisamma Mandal),
  5. ఘట్‌కేసర్ మండలం (Ghatkesar Mandal),
  6. కాప్రా మండలం (Kapra Mandal),
  7. కీసర మండలం (Keesara Mandal),
  8. కూకట్‌పల్లి మండలం (Kukatpally Mandal),
  9. మల్కాజ్‌గిరి మండలం (Malkajgiri Mandal),
  10. మేడ్చల్ మండలం (Medchal Mandal),
  11. మేడిపల్లి మండలం (Medipally Mandal),
  12. మూడుచింతలపల్లి మండలం (Muduchintalapalli Mandal),
  13. కుతుబుల్లాపూర్ మండలం (Qutballapur Mandal),
  14. షామీర్‌పేట్ మండలం (Shamirpet Mandal),
  15. ఉప్పల్ మండలం (Uppal Mandal),

హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా,  తెలంగాణ మండలాలు
= = = = =

7, నవంబర్ 2020, శనివారం

శామీర్‌పేట్ మండలం (Shamirpet Mandal)

జిల్లామేడ్చల్
రెవెన్యూ డివిజన్కీసర
అసెంబ్లీ నియోమేడ్చల్
లోకసభ నియోమల్కాజ్‌గిరి
జనాభా
117554
రెవెన్యూ గ్రామాలు
14
శామీర్‌పేట్ మేడ్చల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కె.రమేశ్ రెడ్డి ఈమండలమునకు చెందినవారు. మండలంలోని పలు గ్రామాలలో కులీకుతుబ్‌షా కాలం నాటి చారిత్రక కట్టడాలున్నాయి. పర్యాటక ప్రాంతంగా పేరుపొందిన శామీర్‌పేట రత్నాలయం, శామీర్‌పేట చెరువు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీ, జవహర్ డీర్ పార్క్, జినోమ్‌ వాలీ ఈ మండలంలో ఉన్నాయి.
 
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్య్వస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో భాగమైంది. మార్చి 7, 2019న షామీర్‌పేట మండలంలోని 17 గ్రామాలను విడదీసి కొత్తగా మూడుచింతలపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు.
 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి పశ్చిమాన మేడ్చల్ మండలం, దక్షిణాన కీసర, కాప్రా, ఆల్వాల్ మండలాలు, తూర్పున యాదాద్రి భువనగిరి జిల్లా, ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 85291. ఇందులో పురుషులు 43943, మహిళలు 41348. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 117554. ఇందులో పురుషులు 61034, మహిళలు 56520.
 
శామీర్‌పేట్ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి.
మండలంలోని గ్రామాలు:
Aliabad, Anthaipally, Bommaraspet, Devaryamjal, Lalgadimalakpet, Majeedpur, Mandaipally, Muraharipally, Ponnal, Pothaipally, Shamirpet, Singaipally, Thumkunta, Turkapally, Yadaram,
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / పట్టణాలు:
.
శామీర్‌పేట్ (Shamirpet):
శామీర్‌పేట్ మేడ్చల్ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ రాజీవ్ రహదారి ప్రక్కన ప్రఖ్యాతిగాంచిన రత్నాలయం ఉంది. ఈ ఆలయం 2003లో నిర్మించబడింది. బిట్స్ పిలానీ, నల్సార్ విశ్వవిద్యాలయాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆలయం సమీపంలో పెద్ద చెరువు ఉంది. ఇది శామీర్‌పేట చెరువుగా పేరుపొందింది.
తుర్కపల్లి (Turkapalli):
తుర్కపల్లి మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలమునకు చెందిన రెవెన్యూ గ్రామము. జూలై 11, 2015 తుర్కపల్లి శివారులో ఆదిమానవుల చిత్రాల బయటపడ్డాయి.



ఇవి కూడా చూడండి:
  • నల్సార్ విశ్వవిద్యాలయం,
  • శామీర్‌పేట చెరువు
  • శామీర్‌పేట రత్నాలయం,
  • శామీర్‌పేట చెరువు,
 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
మేడ్చల్ జిల్లా మండలాలు, శామీర్‌పేట్ మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2013,
  • Handbook of Census Statistics, Rangareddy District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 249 తేది: 11-10-2016 
  • రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://medchal-malkajgiri.telangana.gov.in/te/ (Official Website of Medchal Dist)


Shamirpet Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక