నెహ్రూ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
నెహ్రూ ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

26, మే 2014, సోమవారం

జవహార్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)

జవహార్ లాల్ నెహ్రూ
జననంనవంబర్ 14, 1889
స్వస్థలంఅలహాబాదు
పదవులుప్రధానమంత్రి (1947-64), కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,
మరణంమే 27, 1964
భారత స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొని, దేశ తొలి ప్రధానమంత్రిగా సుధీర్ఘకాలం పనిచేసిన జవహార్ లాల్ నెహ్రూ నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో జన్మించారు. పండిత్‌జీగా, చాచానెహ్రూగా ప్రసిద్ధి చెందిన ఈయన గాంధీ-నెహ్రూ కుటుంబంలో ప్రముఖుడు. దేశ ప్రధానిగా 17 సంవత్సరాలు పనిచేశారు. ఈయన వారసులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. మే 27, 1964న నెహ్రూ మరణించారు.

బాల్యం:
నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జన్మించిన జవహార్ లాల్ నెహ్రూ కాశ్మీరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. స్థానికంగా అలహాబాదులో అభ్యసించి న్యాయవాద విద్యకై ఇంగ్లాండు వెళ్ళినారు. స్వదేశం తిరిగివచ్చిన పిదప జాతీయోద్యమంలో ప్రవేశించి మహాత్మాగాంధీకి సన్నిహితులైనారు.

జాతీయోద్యమంలో:
భారతదేశ జాతీయోద్యమ పోరాటంలో పాల్గొని నెహ్రూ పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా జాతీయోద్యమ నాయకుడు. జైలులో ఉన్నప్పుడే "గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ", "ది డిస్కవరీ అఫ్ ఇండియా" గ్రంథాలు రచించారు. 1929లో భారత జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. 1936, 1937 చివరిగా 1946 లలో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడైనారు. జాతీయోద్యమంలో గాంధీజీ తర్వాత రెండో ప్రముఖ నాయకుడిగా అవతరించారు.
జవహార్ లాల్ నెహ్రూ
జనరల్ నాలెడ్జి

ప్రధానమంత్రిగా:
1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి నెహ్రూ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. స్వాతంత్ర్యానంతరం పూర్తిస్థాయి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి తొలి ప్రధానమంత్రిగా కీర్తి పొందారు. 1952, 1957, 1962లలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించి మొత్తం 17 సంవత్సరాలు ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు. విదేశాంగ విధానంలో సోషలిజం వైపు మొగ్గి రష్యాకు చేరువైనారు. చైనాతో పంచశీల ఒప్పందం కుదుర్చుకొని ఖ్యాతిచెందిననూ 1962లో చైనా యుద్ధంలో భూభాగాన్ని కోల్పోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. అలీనవిధానం ప్రతిపాదించిన త్రిమూర్తులలో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడ్డారు.

బ్లాగులో నెహ్రూ గురించి శోధించండి
గుర్తింపులు:
జవహార్‌లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1955లో దేశపు అత్యున్నత అవార్డు అయిన భారతరత్న పురస్కారం ప్రకటించబడింది. నెహ్రూ పేరుతో విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలు, పలు జాతీయ సంస్థలు ఉన్నాయి. నగరాలు, పట్టణాలలో నెహ్రూ విగ్రహాలు, నెహ్రూ పేరుతో కూడళ్ళు, వీధులు లెక్కకుమించి ఉన్నాయి.

గాంధీ-నెహ్రూ కుటుంబం:
భారత జాతీయోద్యమంలో నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా పాలుపంచుకున్నారు. మోతీలాల్ 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత కూడా వహించారు. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ 1966-77 మరియు 1980-84 కాలంలో ప్రధానమంత్రిగా పనిచేయగా నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీ కూడా 1984-89కాలంలో ప్రధానమంత్రి పదవి నిర్వహించారు. రాజీవ్‌గాంధీ భార్య సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకి సుధీర్ఘకాలం అధ్యక్షురాలిగా పనిచేయగా, నెహ్రూ మునిమనవడి రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు.

ఇవి కూడా చూడండి .. 

 

 

హోం
విభాగాలు: భారతదేశ ప్రధానమంత్రులు, భారతరత్న అవార్డు గ్రహీతలుభారత స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలహాబాదు, 1889లో జన్మించినవారు, 1964లో మరణించినవారు, 1వ లోకసభ సభ్యులు, 2వ లోకసభ సభ్యులు, 3వ లోకసభ సభ్యులు, 


 = = = = =



Tags: About Nehru in Telugu, Jawaharlal Nehru essay in Telugu, telugulo nehru vyasam, first prime minister nehru in telugu, jawahar lal nehru Jeevitha Charitra



పోస్టు ద్వారా మా "CCKRao సీరీస్" క్విజ్ పుస్తకాలు పొందగోరేవారు ఇక్కడ చూడండి.

4, జూన్ 2020, గురువారం

రాహుల్ గాంధీ (Rahul Gandhi)

జననం
జూన్ 19, 1970
రంగం
రాజకీయాలు
పదవులు
5 సార్లు ఎంపి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,
ప్రస్తుత నియో.
వయనాడ్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను, ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగాను ఎన్నికైన రాహుల్ గాంధీ జూన్ 19, 1970న న్యూఢిల్లీలో జన్మించారు. తల్లిదండ్రులు సోనియాగాంధీ, రాజీవ్‌గాంధీ. 1989లో LTTE తీవ్రవాదుల చేతిలో తండ్రి రాజీవ్‌గాంధీ హత్య తర్వాత భద్రతకై ప్లోరిడా లోని రోలిన్స్ కళాశాలలో రావుల్ విన్సీ అనే మారుపేరుతో అభ్యసించారు భారతదేశ రాజకీయాలలో ప్రముఖపాత్ర వహించిన గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ 2004లో రాజకీయాలలో ప్రవేశించి శతాధిక సంవత్సరాల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ లోక్‌సభకు వరుసగా 5 సార్లు ఎన్నికైనారు. రాహుల్‌గాంధీ అవివాహితుడిగా ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం:
2004లో రాజకీయాలలో ప్రవేశించిన రాహుల్ గాంధీ అదే ఏడాది అమేథీ నుంచి లోక్‌సభకు ఎన్నికైనారు. అంతకు క్రితం ఈ స్థానానికి తల్లి సోనియాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2007లో రాహుల్ కాంగ్రె పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2009, 2014లలో కూడా రాహుల్ అమేథీ నుంచి ఎన్నికై హాత్రిక్ సాధించారు. 2013లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, డిసెంబరు 2017లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉంటూ 2019లో రెండు చోట్ల పోటీచేసి అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయి, వయనాడ్ (కేరళ) నుంచి లోక్‌సభకు ఎన్నికైనారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ "చౌకీదార్ చోర్ హై" నినాదంతో, "రాఫెల్ కుంభకోణం" ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగి 52 స్థానాలు మాత్రమే సాధించింది (542 స్థానాలకుగాను). జూలై 2019లో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత అధ్యక్షపదవి త్యజించారు.

కుటుంబం:
రాహుల్‌గాంధీ భారతదేశ రాజకీయాలలో అత్యంత ప్రముఖమైన గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తి. ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీలు ప్రధానమంత్రులుగా పనిచేశారు. పై ముగ్గురితో పాటు ముత్తాత్తాత్త మోతీలాల్ నెహ్రూ, తల్లి సోనియాగాంధీలు కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులుగా కూడా పనిచేశారు. సోదరి ప్రియాంక వాధ్రా ప్రత్యక్ష రాజకీయాలలో లేకున్ననూ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గుంటుంది.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: కాంగ్రెస్ పార్టీ నాయకులు,


 = = = = =


4, మే 2014, ఆదివారం

జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం (Jaggampeta Assembly Constituency)

జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది కాకినాడ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 171.
రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 52 గా మారింది.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 తోట నరసింహం కాంగ్రెస్ పార్టీ జ్యోతుల నెహ్రూ ప్రజారాజ్యం పార్టీ
2014 జ్యోతుల నెహ్రూ వైఎస్సార్ కాంగ్రెస్ జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం పార్టీ
2019 జ్యోతుల చంటిబాబు వైకాపా జ్యోతుల వెంకట అప్పారావు తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)పై 789 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన జ్యోతుల చంటిబాబుపై 15932 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన జ్యోతుల నాగవీర వెంకటవిష్ణు సత్య మార్తాండరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల వెంకట అప్పారావు పై 23365 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


హోం,
విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కాకినాడ లోకసభ నియోజకవర్గం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

28, మార్చి 2015, శనివారం

శ్యాంప్రసాద్ ముఖర్జీ (Shyam Prasad Mukherjee)

శ్యాంప్రసాద్ ముఖర్జీ
జననంజూలై 6, 1901
రంగంజాతీయోద్యమం, రాజకీయాలు,
పదవులువైస్ ఛాన్సలర్, కేంద్రమంత్రి,
మరణంమే 23, 1953
ప్రముఖ జాతీయవాదిగా పేరుపొందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901, జూలై 6న జన్మించారు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1949 లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953 న మరణించేవరకు కొనసాగినారు.

ప్రారంభ జీవితం:
శ్యాంప్రసాద్ ముఖర్జీ జూలై 6, 1901 న కోల్‌కతలో జన్మించారు. తండ్రి అశుతోష్ ముఖర్జీ బెంగాల్‌లో గౌరవాదరణ కలిగిన న్యాయవాది మరియు కలకత్తా విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేసిన ప్రముఖుడు. తల్లి పేరు జోగ్‌మాయా దేవి ముఖర్జీ. ముఖర్జీ డిగ్రీ విద్యాభ్యాసం కోల్‌కతలోనే కొనసాగింది. 1921లో ఆంగ్లంలో మొదటి స్థానంలో పట్టా పుచ్చుకున్నారు. 1923 లో ఎంఏ పట్టా, 1924 లో న్యాయవాద పట్టా కూడా స్వీకరించినాడు. ఇంగ్లాండు నుంచి 1927 లో బారిష్టరు పట్టా పొందినారు. 1934లో 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయపు కులపతిగా నియమించబడి, పిన్న వయస్సులో ఈ పదవిని పొందిన ఘనత పొందినారు.

కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా
రాజకీయ జీవితం:
ముఖర్జీ తొలుత భారతీయ జాతీయ కాంగ్రెసు తరఫున బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యారు. 1941-42 లో బెంగాల్ ప్రావిన్సు మొదటి ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టినారు. అనతికాలంలోనే హిందువుల తరఫున మాట్లాడే వక్తగా పేరు పొంది హిందూమహాసభలో ప్రవేశించి 1944 లో ఆ సంస్థ అధ్యక్షుడైనారు. ముఖర్జీ ముస్లిములకు వ్యతిరేకి కాకున్ననూ పాకిస్తాన్ ఏర్పాటును కోరుకొనే మహమ్మద్ అలీ జిన్నా యొక్క ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన హిందూ రాజకీయ నాయకుల పంథాను అనుసరించారు. ప్రారంభంలో భారత విభజనకు వ్యతిరేకంగా ఉన్న ముఖర్జీ 1946-47 మతకలహాల అనంతరం బెంగాల్ విభజనకు సైతం అంగీకరించారు.

స్వాతంత్ర్యానంతరం:
జవహర్ లాల్ నెహ్రూ తన తాత్కాలిక ప్రభుత్వంలో ముఖర్జీకి చోటు కల్పించి పరిశ్రమల మంత్రిత్వశాఖను కేటాయించారు. సర్దార్ వల్లభభాయి పటేల్ మరియు భారతీయ జాతీయ కాంగ్రెసు ఇతర నాయకులచే ముఖర్జీ మంచి గౌరవప్రథమైన వ్యక్తిగా గుర్తింపుపొందారు. 1949 లో నెహ్రూ పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్‌ తో జరిపిన ఢిల్లీ ఒప్పందం అనంతరం ఏప్రిల్ 6, 1950 న ముఖర్జీ కేంద్ర మంత్రిపదవికి రాజీనామా సమర్పించాడు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత ఎం.ఎస్.గోల్వార్కర్ తో చర్చలు జరిపిన అనంతరం అక్టోబరు 21, 1951న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించారు. ఆ పార్టీ సంస్థాపక అధ్యక్షుడిగా ముఖర్జీ వ్యవహరించారు. నెహ్రూ సోషలిజానికి భిన్నంగా జనసంఘ్ పార్టీ స్వేచ్చా మార్కెట్ విధానానికి మద్దతు పలికింది. అంతేకాకుండా దేశం మొత్తానికి హిందువులు, ముస్లిములకు ఒకే విధమైన పౌరస్మృతి ఉండాలని ఉద్ఘాటించింది. గోహత్య మరియు కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 రాజ్యాంగ ప్రకరణపై కూడా వ్యతిరేకత చూపింది. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే భారతీయ జాతీయ కాంగ్రెసు విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా, ప్రధానమంత్రి ఉండటాన్ని తీవ్రంగా నిరసించాడు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని పేర్కొన్నారు.

గుర్తింపులు:
  • ఆగస్టు 27, 1998నాడు అహ్మదాబాదు కార్పోరేషన్‌చే ఒక వారధికి ముఖర్జీ పేరు పెట్టబడింది.
  • 2001 లో భారత పరిశోధనా సంస్థ అయిన CSIR ముఖర్జీ పేరిట ఫెల్లోషిప్‌ను స్థాపించింది.

విభాగాలు: కోల్‌కత ప్రముఖులు, జాతీయోద్యమ నాయకులు, 1901లో జన్మించినవారు, కేంద్రమంత్రులు, 1953లో మరణించినవారు, హిందూ జాతీయవాదులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆంగ్ల వికీపీడియా,
  • ప్రసిద్ధ భారతీయులు,
  • www.shyamaprasad.org
  • బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా,

10, జులై 2019, బుధవారం

వల్లభ్‌భాయి పటేల్ (Vallabhbhai Patel)


జననంఅక్టోబరు 31, 1875
జన్మస్థానంనాడియార్ (గుజరాత్)
పదవులుకేంద్రమంత్రి (1947-50)
అవార్డులుభారతరత్న (1991)
మరణండిసెంబరు 15,1950
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు అక్టోబరు 31, 1875న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్యయోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. ఇతను వల్లభ్‌భాయి పటేల్ పేరుమీదుగా కంటే సర్దార్ పటేల్‌గానే అధికంగా పిల్వబడుతారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్‌కే దక్కుతుంది.

ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు.

రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించి భారత రాజ్యాంగం రచనలో కూడా ప్రముఖ పాత్ర వహించారు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించారు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించారు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనారు. హైదరాబాదు విమోచనోద్యమంలో సర్దార్ పటేల్ పాత్ర ఘనమైనది.

కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి డిసెంబరు 15,1950న మరణించారు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది. అక్టోబరు 31, 2018 నాడు గుజరాత్‌లోని సబర్మతీ తీరాన దేశంలోనే ఎత్తయిన 182 మీటర్ల సర్దార్ పటేల్ విగ్రహాన్ని (ఏకతాశిల్పం) ని భారతప్రభుత్వం ప్రతిష్టించింది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: భారత స్వాతంత్ర్య సమరయోధులు, గుజరాత్ రాష్ట్ర ప్రముఖులు, భారతదేశ ప్రముఖులు, బారతదేశ ప్రముఖ రాజకీయ నాయకులు, భారతరత్న అవార్డు గ్రహీతలు,


 = = = = =


Tags: about Sardar vallabhbhai Patel, Sardar Patel, niography of Sardar Patel in telugu

17, జులై 2019, బుధవారం

చంద్రశేఖర్ ఆజాద్ (Chandra Shekhar Azad)


జననంజూలై 23, 1906
జన్మస్థానంభభ్రా (మధ్యప్రదేశ్)
రంగంస్వాతంత్ర్య సమరయోధుడు
మరణంఫిబ్రవరి 27, 1931
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన చంద్రశేఖర్ ఆజాద్ జూలై 23, 1906న మధ్యప్రదేశ్‌లోని భభ్రా (చంద్రశేఖర్ ఆజాద్ నగర్) లో జన్మించాడు. విద్యార్థిదశలోనే స్వాతంత్రోద్యమంలో ప్రవేశించిన ఆజాద్‌కు తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ లాంటి వారి భావాలవల్ల బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. ఆగస్టు 9, 1924 న ఈ విప్లవకారులంతా కలిసి ప్రభుత్వ ధనం ఉన్న రైలును ఆపి దోపిడి చేశారు. 
1928 సెప్టెంబరులో భగత్ సింగ్, సుఖ్ దేవ్ మొదలగు వారితో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకొని పొరపాటున సాండర్స్ అనే అధికారిని కాల్చారు. ఇదేకాలంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. పిబ్రవరి 27, 1931 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు. 
భగత్‌సింగ్‌ను ఎలాగైనా విడుదల చేయించాలనే ప్రణాళికలో భాగంగా ఫిబ్రవరి 27, 1931న చర్చలు జరుపుతుండగా అందులో రహస్య పోలీసులున్నట్లుగా అనుమానం వచ్చి ముగ్గురిని హతమార్చాడు. చివరికి తన తుపాకీలో ఒకే గుండు ఉందని తెలుసుకొని తాను పట్టుపడటం ఖాయం అనీ భావించి అరెస్ట్ కావడం కంటే చనిపోవడమే మేలని తనకుతాను కాల్చుకొని అమరుడయ్యాడు.

గుర్తింపులు:
  • ఆజాద్ మరణించిన అలహాబాదులోని ప్రయాగ్‌రాజ్ పార్కుకు చంద్రశేఖర్ ఆజాద్ పార్కుగా నామకరణం చేయబడింది. 
  • 1988లో భారతప్రభుత్వం చంద్రశేఖర్ ఆజాద్ ముఖచిత్రంతో తపాలాబిళ్ళను విడుదల చేసింది.
  • 1965లో షహీద్ సినిమాతో మొదలుపెట్టి పలు భాషలలో ఎన్నో సినిమాళు నిర్మించబడ్డాయి. 
  • 2018లో టెలివిజన్ సీరీస్ తీయబడింది.
  • చంద్రశేఖర్ ఆజాద్ జన్మించిన మధ్యప్రదేశ్‌లోని భభ్రా (భవ్రా) గ్రామం చంద్రశేఖర్ ఆజాద్ నగర్‌గా పిల్వడం జరుగుతోంది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: భారత స్వాతంత్ర్య సమరయోధులు, మధ్యప్రదేశ్ ప్రముఖులు, భారతదేశ ప్రముఖులు,


 = = = = =


Tags: about Chandra Sekhar Azad, biography of Chandra Sekhar Azad in telugu

2, మార్చి 2019, శనివారం

ఇందిరాగాంధీ (Indira Gandhi)

జననంనవంబర్ 19, 1917
పదవులుప్రధానమంత్రి
గుర్తింపులుభారతరత్న (1971)
మరణంఅక్టోబర్ 31, 1984
భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ నవంబర్ 19, 1917న అలహాబాదులో జన్మించారు. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఇందిర భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె మరియు స్వాతంత్ర్యోద్యమ నాయకుడు మోతీలాల్ నెహ్రూ మనుమరాలు. ఇందిరాగాంధీ తల్లి కమలానెహ్రూ. ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్‌గాంధీ ఈమె కుమారుడు. 1971లో ఇందిరాగాంధీకి భారతదేశపు అత్యున్నతమైన భారతరత్న పురస్కారం లభించింది.

ఇందిర తొలి పేరు ప్రియదర్శిని ఇందిర. చిన్న వయస్సులోనే వానరసేనను ఏర్పాటుచేసింది. మెట్రిక్ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన శాంతినికేతన్‌లో చేరింది. 1942లో ఫిరోజ్ గాంధీతో వివాహమైంది. 1959లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నెహ్రూ మరణానంతరం 1964లో లాల్ బహదూస్ శాస్త్రి మంత్రివర్గంలో ఇందిర సమాచారశాఖ మంత్రిగా పదవి పొందారు. లాల్ బహదుర్ శాస్త్రి మరణం తర్వాత 1966లో భారత 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1980 వరకు దేశాన్ని పాలించారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హటావో నినాదంతో చేపట్టిన పేదరిక నిర్మూలన పథకాలు, 20 సూత్రాల పథకం, ఇండోపాక్ యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తదితర ముఖ్యమైన పరిణామాలు ఇందిర హయంలోనే జరిగాయి.

1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమేథీలో ఇందిర ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇది రాజకీయ సంక్షోభానికి చివరికి దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడటానికి దారితీసింది. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చే అత్యవసర పరిస్థితి విధించిన ఇందిర అప్పటి ముఖ్యమైన ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళకు పంపించింది. దీని ప్రభావం 1977లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓడిపోవడానికి దారితీసింది. ఇందిర స్వయంగా రాయ్‌బరేలీ నియోజకవర్గంలో కూడా ఓటమి పాలయ్యారు. 1977లో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మురార్జీ దేశా, చరణ్ సింగ్‌ల ప్రభుత్వాలు అధికకాలం కొనసాగలేవు. 1980లో మధ్యంతర ఎన్నికలలో మళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. స్వర్ణదేవాలయంలో సైనికులను పంపారనే కారణంతో (ఆపరేషన్ బ్లూస్టార్) ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు ఆమెను అక్టోబర్ 31, 1984న కాల్చి చంపారు. ఇందిర మరణం తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధి ప్రధానమంత్రి అయ్యారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: భారతదేశ ప్రధానమంత్రులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, భారతదేశ రాజకీయ నాయకులు, భారతదేశ ప్రముఖ మహిళలు


 = = = = =


26, జులై 2020, ఆదివారం

శారదా ముఖర్జీ (Sharda Mukherjee)

 శారదా ముఖర్జీ
జననంఫిబ్రవరి 24, 1919
పదవులు2 సార్లు ఎంపీ, 2 సార్లు గవర్నరు,
మరణంజూలై 6, 2007
ప్రత్యేకతఆంధ్రప్రదేశ్ తొలి మహిళా గవర్నరు
ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాల తొలి మహిళా గవర్నరుగా పేరుపొందిన శారదా ముఖర్జీ ఫిబ్రవరి 24, 1919న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మరాఠీ కుటుంబంలో జన్మించారు. తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూతో ఈమెకు బంధుత్వం ఉంది. భర్త మరణానంతరం రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు లోక్‌సభకు ప్రవేశించడమే కాకుండా 2 రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశారు. జూలై 6, 2007న శారదా ముఖర్జీ ముంబాయిలో మరణించారు

రాజకీయ ప్రస్థానం:
భర్త అకాల మరణానంతరం శారద రాజకీయాలలో ప్రవేశించింది. అప్పుటి ప్రధానమంత్రి జనహార్‌లాల్ నెహ్రూతో బంధుత్వం కారణంగా ఈమె కోరుకున్న స్థానం పొందుటలో సఫలమైనారు. బంధువులు అధికంగా ఉండే మహారాష్ట్రలోని రత్నగిరి స్థానం నుంచి 1962లో తొలిసారి పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండో పర్యాయం 1967లో కూడా ఇదే స్థానం నూంచి విజయం సాధించారు. 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక సమయంలో ఇందిర వైపు కాకుండా సిండికేట్ కాంగ్రెస్ పక్షాన వహించి 1971లో ఓటమి చెందారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రావడంతో ఈమెను 1977మేలో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు. ఆ తర్వాత 1978-83 కాలంలో గుజరాత్ గవర్నరుగా పనిచేశారు.

కుటుంబం:
శారద చిన్నాన్న (రంజిత్ సీతారాం పండిత్) జవహర్ లాల్ నెహ్రూ చెల్లెలు విజయలక్షిని పెళ్ళిచేసుకున్నారు. శారదా ముఖర్జీ తల్లి సరస్వతీబాయి పండిత్ అలనాటి హిందీ సినిమా నటి దుర్గా ఖోటే సోదరి. ప్రముఖ రచయిత్రి నయనతార సెహగల్ ఈమెకు వరసకు చెల్లెలు (బాబాయి కూతురు). శారద భర్త తొలి భారతీయ ఎయిర్ చీఫ్ మార్షల్ సుబ్రతో ముఖర్జీ. సరోజినీ నాయుడు వీరి వివాహ సంబంధం కుదిర్చింది.


ఇవి కూడా చూడండి:
  • ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు
  • భారతదేశంలో తొలి వ్యక్తులు,
  • సుబ్రతో ముఖర్జీ (ఎయిర్ చీఫ్ మార్షల్ ),
  • నయనతార సెహగల్, 
  • భారతదేశంలో మహిళా గవర్నర్లు,

హోం,
విభాగాలు: భారతదేశ ప్రముఖ మహిళలు, 3వ లోకసభ సభ్యులు, 4వ లోకసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, గుజరాత్ గవర్నర్లు,భారతదేశంలో మహిళా గవర్నర్లు,


 = = = = =


18, మార్చి 2015, బుధవారం

నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project)

 నాగార్జునసాగర్ ప్రాజెక్టు
ప్రాంతమునందికొండ
జిల్లానల్గొండ జిల్లా
నదికృష్ణానది
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో నందికొండ వద్ద కృష్ణానదిపై నిర్మించబడింది. ప్రారంభంలో నందికొండ ప్రాజెక్టుగా పిలువబడిన ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాంతపు చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.

నిర్మాణ చరిత్ర:
1952లో ఖోస్లా కమిటీ నందికొండ వద్ద డ్యాం నిర్మాణానికి సిఫార్సుచేసింది. ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను 1952లో ఆమోదించింది. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. డ్యాము నిర్మాణం 1969లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని 1974లో పూర్తయింది.

ప్రాంత చరిత్ర:
నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలంగా కూడా పేరుపొందింది. శాతవాహనుల కాలమునాటి శ్రీపర్వతమే నాగార్జునకొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రిక కట్టడాల శిధిలాలను జలాశయం మధ్యలో "నాగార్జున కొండ" అని ఇప్పుడు పిలువబడే మ్యూజియంలో భద్ర పరచారు. ఆ మ్యూజియంను నాగార్జునకొండ మ్యూజియం అంటారు.

శంకుస్థాపన సమయంలో నెహ్రూ
ప్రాజెక్టు గణాంకాలు:
  • డ్యాము పొడవు: 15,956 అ.
  • ప్రధాన రాతి ఆనకట్ట పొడవు: 4756 అ.
  • మొత్తం మట్టికట్టల పొడవు: 11,200 అ.
  • మొత్తం క్రెస్టుగేట్ల సంఖ్య: 26
  • కుడి కాలువ పొడవు: 203 కి.మీ.
  • ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ.
  • పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 408 టి.ఎం.సి.
  • విద్యుదుత్పత్తికై మూడు కేంద్రాలున్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్థ్యం 960 మెగావాట్లు.

ఆయకట్టు:
  • కుడి కాలువ:
  • గుంటూరు జిల్లా    6,68,230
  • ప్రకాశం జిల్లా    4,43,180
ఎడమ కాలువ:
  • నల్గొండ జిల్లా    3,72,970
  • ఖమ్మం జిల్లా    3,46,769
  • కృష్ణా జిల్లా    4,04,760

హోం,
విభాగాలు:
నల్గొండ జిల్లా ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులు, కృష్ణానది, పెద్దవూర మండలం,


 = = = = =


12, మార్చి 2014, బుధవారం

మాధవరావుపల్లి (Madhavarao Pally)

మాధవరావుపల్లి గ్రామము
గ్రామముమాధవరావుపల్లి 
మండలముపానగల్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా832 (2001)
841 (2011)
మాధవరావుపల్లి మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ మండలమునకు చెందిన గ్రామము. 1956లో భూదానోద్యమం సందర్భంగా వినోబా భావే మాధవరావుపల్లిలో జరిగిన సభలో పాల్గొన్నారు. వినోబాభావేను కలవడానికి అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా మాధరవుపల్లికి వచ్చారు. భాషాప్రయుక్త రాష్ట్రాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాబోంతుందని నెహ్రూ తొలిసారిగా ఇక్కడే ప్రకటించారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 832. ఇందులో పురుషులు 411, మహిళలు 421. గృహాల సంఖ్య 173.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 841. ఇందులో పురుషులు 414, మహిళలు 427. గృహాల సంఖ్య 196.



విభాగాలు: పానగల్ మండలంలోని గ్రామాలు


 = = = = =


5, జులై 2013, శుక్రవారం

రావూరి భరద్వాజ (Ravuri Bharadwaja)

 రావూరి భరద్వాజ
జననంజూలై 5, 1927
స్వస్థలంమొగులూరు (కృష్ణా జిల్లా)
రంగంరచయిత
అవార్డులుజ్ఞాన్‌పీఠ్ అవార్డు (2012),
మరణంఅక్టోబరు 18, 2013
ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జూలై 5, 1927న కృష్ణా జిల్లా మోగులూరు గ్రామంలో జన్మించారు. వీరిది దేశభక్తుల కుటుంబం. తండ్రి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. పేదరికంతో చినిగిన బట్టలు వేసుకున్నందుకు తరగతి గదిలో జరిగిన అవమానాల కారణంగా 8వ తరగతి అభ్యసిస్తున్నప్పుడు మధ్యలోనే చదుపు ఆపివేశారు. బతుకు పోరాటం కోసం కూలీగా పనిచేశారు. తిండి కోసం సైన్యంలో చేరారు.  1948లో వివాహం అనంతరం తెనాలిచేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేశారు. కొన్నాళ్ళ తర్వాత ఒక పత్రికకు ఉపసంపాదకుడైనారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఒక కంపెనీలో సేల్స్‌మన్‌గా, ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో కళాకారునిగా చేరినారు.పేదరికం నుంచి జ్ఞానపీఠ్ అవార్డు వరకు అతను సాగించిన జీవన సమరం ఎన్నో మలుపులు తిరిగింది 2013, అక్టోబరు 18న రావూరి మరణించారు.

రచనా ప్రస్థానం:
భరద్వాజ తన తొలి కథను 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశారు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం అధికంగా ఉన్నది. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు, బాధలు రావూరి రచనల్లో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఆయన రచనలో సాహిత్యమే కాదు, సాంఘిక విలువలూ కనిపిస్తాయి. రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది పాకుడురాళ్లు నవల. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.

గుర్తింపులు:
1968 లో రావూరికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1983లో కేంద్ర సాగిత్య అకాడమీ ఆవార్డు లభించాయి. 1987లో సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు పొందారు. అదే ఏడాది రాజాలక్ష్మి పురస్కారం లభించింది. 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం రావూరికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి. 2012లో విశిష్టమైన జ్ఞానపీఠ అవార్డు పాకుడురాళ్ళు నవలకు గాను లభించింది. ఏప్రిల్ 17, 2013న ఈయనకు ప్రకటించబడ్డ జ్ఞాన్‌పీఠ్ అవార్డు తెలుగు సాహిత్యానికే గర్వకారణం. విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డిల సరసన ఇతన్ని ఈ అవార్డు చేర్చిననూ రచనా ప్రపంచంలో ఇతని శైలి మాత్రం అంతకంటె గొప్పది.

విభాగాలు: కృష్ణా జిల్లా రచయితలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీతలు, 1927లో జన్మించినవారు, 2013లో మరణించినవారు,


 = = = = =

19, జులై 2019, శుక్రవారం

జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayan)


జననంఅక్టోబరు 11, 1902
జన్మస్థానంసీతాబ్దియారా
రంగంసమరయోధుడు, రాజకీయాలు
బిరుదు లోక్‌నాయక్
మరణంఅక్టోబరు 8, 1979
అవార్డులుభారతరత్న (1998), మెగ్సేసే అవార్డు,
లోక్‌నాయక్‌గా ప్రసిద్ధి చెందిన జయప్రకాశ్ నారాయణ అక్టోబరు 11, 1902న ఉత్తరప్రదేశ్‌లోని సీతాబ్దియారాలో జన్మించారు. స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడిగా పేరుపొందిన ఈయన 1970 వ దశకంలో ప్రధాని ఇందిరాగాంధీకి విధానాలకు వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చి ప్రసిద్ధిచెందారు. 1977 ఎన్నికలలో కాంగ్రెస్‌ను గద్దెదింపి జనతాపార్టీ అధికారంలోకి రావడానికి చేసిన కృషి కూడా అమోఘం. సంక్షిప్తంగా జె.పి.గా ప్రసిద్ధి చెందిన ఈయన 76 సం.ల వయస్సులో అక్టోబరు 8, 1979న పాట్నాలో జయప్రకాష్ మరణించారు ఈయన జయంతిని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా జరుపుకుంటారు. 1998లో భారతరత్న పురస్కారం (మరణానంతరం) ప్రకటించబడింది.

బాల్యం, విద్యాభ్యాసం:
జయప్రకాశ్ నారాయణ ఉత్తరప్రదేశ్‌లోని సీతాబ్దియారా గ్రామంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పాట్నాలో అభ్యసించి ఆ తర్వాత అమెరికాలో 8 సం.లు విద్యనభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చారు. అమెరికాలో ఉన్న సమయంలో మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేసి అదేసమయంలో యం.యన్.రాయ్ రచనల ప్రభావానికి కూడా లోనయ్యారు. 1920లో స్వాతంత్ర్య సమరయోధురాలు, కస్తూర్బా గాంధీ అనుచరురాలైన ప్రభావతీ దేవిని వివాహమాడారు.

స్వాతంత్ర్య సమరం:
అమెరికానుండి వచ్చిన వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి మహాత్మాగాంధీకి సన్నిహితుడైనారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. విడుదల అనంతరం కాంగ్రెసు సోషలిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెస్ నేతలంతా అరెస్ట్ కాగా రాం మనోహర్ లోహియా, బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఈయన ఉద్యమాన్ని ముందుకు నడిపారు. స్వాతంత్ర్యానంతరం జె.పి. ఆచార్య నరేంద్ర దేవ్ మొదలైన వారితో కలసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీగా మారి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించింది.

సర్వోదయ:
1954లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబాభావే యొక్క సర్వోదయ ఉద్యమానికి మరియు దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశారు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిబాగ్‌లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. జె.పి. త్వరితగతిన భారతదేశంలో మహాత్మాగాంధీ భావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందారు.

సంపూర్ణ క్రాంతి:
1960 వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి బీహారు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనారంభించారు. 1974లో బీహారులో జె.పి. నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం ఆ తర్వాత బీహార్ ఉద్యమంగా ప్రసిద్ధి పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారినది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవా నికి జె.పి. పిలుపునిచ్చారు.

అత్యవసర పరిథితి (ఎమర్జెన్సీ):
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని అలహాబాదు హైకోర్టు తప్పుపట్టగా వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి మిలిటరీకి మరియు పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించారు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెనీ) ని విధించింది. జె.పి.ని మరియు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆఖరికి కాంగ్రెసు పార్టీ లోనే యంగ్ టర్క్‌లు గా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు. జె.పి. ఛండీగర్‌లో డిటెన్యూగా ఉంచబడ్డాడు. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డారు. చివరికి ఇందిరా గాంధీ జనవరి 18, 1977న ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలను ప్రకటించడంతో ఆమెను ఎదుర్కోవటానికి కాంగ్రెసుకు వ్యతిరేకంగా జె.పి.మార్గదర్శకత్వంలో జనతా పార్టీ రూపుదిద్దుకున్నది. ఆ ఎన్నికలలో జనతాపార్టీ కాంగ్రెస్‌ను ఓడించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించింది.

గుర్తింపులు:
  • జయప్రకాష్ నారాయణ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1998లో భారత ప్రభుత్వం ఇతనికి దేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్నను (మరణానంతరం) ప్రకటించింది. 
  • 1965లో మెగసెసే అవార్డు పొందారు. 
  • పాట్నా విమానాశ్రయానికి ఈయన పేరుపెట్టబడింది.
  • 2015లో ప్రవేశపెట్టిన చాప్రా-ఢిల్లీ-చాప్రా ఎక్స్‌ప్రెస్‌కు లోక్‌నాయక్ ఎక్స్‌ప్రెస్‌గా పేరుపెట్టబడింది.
  • ప్రకాష్ ఝా దర్శకత్వంలో లోక్‌నాయక్ పేరుతో సినిమా తీయబడింది.
హోం
విభాగాలు: భారత స్వాతంత్ర్య సమరయోధులు, ఉత్తరప్రదేశ్ ప్రముఖులు, భారతదేశ ప్రముఖులు, భారతరత్న గ్రహీతలు,


 = = = = =
సంప్రదించిన వెబ్‌సైట్లు, గ్రంథాలు:
  • తెలుగు వికీపీడియా,
  • భారతదేశ ప్రముఖులు,
  • భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు,

Tags: about Jayaprakash Narayan in Telugu, biography of JP Narayana in telugu

19, డిసెంబర్ 2013, గురువారం

దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah)

దామోదరం సంజీవయ్య
(1921-1972)
జననంఫిబ్రవరి 1, 1921
స్వస్థలంపెద్దపాడు (కర్నూలు జిల్లా)
పదవులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి,
మరణంమే 7, 1972
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందినవారు. 1921 ఫిబ్రవరి 1న సంజీవయ్య జన్మించారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకే తండ్రి మరణించారు. దీనితో కుటుంబం మేనమామతో పాలకుర్తి తరలివెళ్ళింది. సంజీవయ్య పశువులు కాసేపనిచేశారు. 4వ తరగతి తర్వాత అమెరికా బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరి 1938లో ఎస్.ఎస్.ఎల్.సి.లో జిల్లాలోనే ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యారు. చదువు పూర్తయిన పిదప లాయరుగా ప్రాక్టీస్ ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాలలో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి రాజీనామా చేయడంతో సంజీవయ్య తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1960లో ముఖ్యమంత్రి అయ్యారు.  ఈయన తొలి దళిత ముక్యమంత్రిగా ఖ్యాతిచెందారు. ఏఐసిసి అధ్యక్షుడిగానూ పనిచేశారు. కేంద్రం లోనూ అనేక పదవులు నిర్వహించిన సంజీవయ్య లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. 1972, మే 7న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
సంజీవయ్య 1950లో తాత్కాలిక పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1952 ఏప్రిల్‌లో సంయుక్త మద్రాసు రాష్ట్ర రాజాజీ మంత్రివర్గంలో పురపాలక శాఖ మంత్రిగా నియమితులైనారు. 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడీన పిదప టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిపదవిని నిర్వహించారు. 1956 నవంబరులో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్థానికపాలన మంత్రిగా కొనసాగినారు. బస్సురూట్ల జాతీయకరణ సందర్భంగా నీలం రాజీనామా చేయడంతో దామోదరం సంజీవయ్య 1960-62 కాలంలో రెండవ ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా తొలి దళిత ముఖ్యమంత్రిగానూ చరిత్ర సృష్టించారు. 1962లో ఏఐసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 1964 జనవరిలో జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో స్థానం పొందారు. నెహ్రూ మరణానంతరం అదే ఏడాది లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలోనూ చోటుపొందారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రివర్గమ్లో పరిశ్రమ శాఖను చేపట్టారు. 1971లో మరోసారి ఏఐసిసి అధ్యక్షుడైనారు. 



విభాగాలు: కర్నూలు జిల్లా ప్రముఖులు, కల్లూరు మండలము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, 1921లో జన్మించినవారు, 1972లో మరణించినవారు, 


 = = = = =

12, నవంబర్ 2020, గురువారం

నవంబరు 14 (November 14)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 14
  • జాతీయ బాలల దినోత్సవం
  • ప్రపంచ మధుమేహ దినోత్సవం

  • 1891: కెనడాకు చెందిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్ జననం
  • 1918: చెకొస్లోవేకియా రిపబ్లిక్‌గా మారింది
  • 1922: బిబిసి ఇంగ్లాండులో రేడియో ప్రసారాలను ప్రారంభించింది
  • 1939: తెలంగాణకు చెందిన నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగ‌ర్‌రావు జననం
  • 1943: హైదరాబాదు స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభమైంది
  • 1948: రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ జననం
  • 1960: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పడింది
  • 1967: క్రికెట్ క్రీడాకారుడు సి.కనకయ్యనాయుడు మరణం
  • 1971: ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ ఆడం గిల్‌క్రిస్ట్ జననం
  • 1971: మెరీనర్ ఉపగ్రహం అంగారక గ్రహకక్ష్యలోకి ప్రవేశించింది
  • 1978: రామగుండం థర్మల్ పవన్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది
  • 1995: గజపతుల సంస్థానాధీడు, రాజకీయ నాయకుడు పూసపాటి విజయరామ గజపతి రాజు మరణం
  • 2008: G-20 దేశాల తొలి శిఖరాగ్ర సమావేశం వాషింగ్టన్‌లో ప్రారంభమైంది
  • 2020: న్యూట్రినోస్ అనే అత్యంత సూక్ష్మకణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త మసుతొషి కోషిరా మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

24, ఆగస్టు 2014, ఆదివారం

కాలరేఖ 1955 (Timeline 1955)

కాలరేఖ 1955 (Timeline 1955)
  • ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు జన్మించారు.
  • జనవరి 1: ప్రముఖ భారత అణు శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ మరణించారు. 
  • మార్చి 13: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ మరణించారు. నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించారు.
  • మార్చి 28: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించారు.
  • ఏప్రిల్ 18: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్‌బెర్ట్ ఐన్‌స్టీన్ మరణించారు.  
  • మే 14: కమ్యూనిష్టు దేశాల మాధ్య వార్సా ఒప్పందం కుదిరింది.
  • మే 20: ప్రముఖ తెలుగు సినీగీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జన్మించారు.
  • జూలై 11: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
  • జూలై 19: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ బిన్నీ జన్మించారు. 
  • జూలై 27: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ అలాన్ బోర్డర్ జన్మించారు.
  • ఆగస్టు 1: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు అరుణ్ లాల్ జన్మించారు.
  • ఆగస్టు 22: ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు చిరంజీవి జన్మించారు.
  • అక్టోబర్ 3: చెన్నై వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది.
  • అక్టోబరు 17: హిందీ సినీనటి స్మితాపాటిల్ జన్మించింది.
  • నవంబర్ 24: ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఇయాన్ బోథం జన్మించాడు.
  • డిసెంబరు 10: నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.
అవార్డులు
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

18, ఆగస్టు 2014, సోమవారం

విజయలక్ష్మి పండిత్ (Vijaya Lakshmi Pandit)

విజయలక్ష్మి పండిత్
జననంఆగస్టు 18, 1900
జన్మస్థానంఅలహాబాదు
పదవులురాయబారి, గవర్నరు,
మరణంసెంబరు 1, 1990
ప్రముఖ దౌత్యవేత్తగా, రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన విజయలక్ష్మి పండిత్ ఆగస్టు 18, 1900న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో జన్మించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహార్‌లాల్ నెహ్రూ సోదరి అయిన ఈమె 1921లో రంజిత్ సీతారాం పండిత్‌ను వివాహం చేసుకున్నారు. వీరి కూతురు నాయంతర సెహగల్ ప్రముఖ నవలా రచయిత్రిగా పేరుపొందింది. మనమరాలు గీతా సెహగల్ కూడా రచయిత్రి. 90 సంవత్సరాల వయస్సులో డిసెంబరు 1, 1990న  విజయలక్ష్మి పండిత్ మరణించారు.

పదవులు:
1937లోనే యునైటెడ్ ప్రావిన్సు తాత్కాలిక శాసనసభకు ఎన్నికై కేబినెట్ మంత్రి పదవి పొంది ఈ ఘనత పొందిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 1946లో రాజ్యాంగసభకు ఎన్నికయ్యారు. భారతదేశ స్వాతంత్ర్యానంతరం 1947లో సోవియట్ యూనియన్‌కు రాయబారిగా పనిచేశారు. ఆ తర్వాత అమెరికా, మెక్సికో, ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్పెయిన్ దేశాల రాయబాదిగా కూడా విధులు నిర్వర్తించారు. ఈ పదవులు నిర్వహిస్తూనే 1946-68 కాలంలో ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధిగానూ వ్యవహరించారు. 1953లో ఐక్యరాజ్యసభ సాధారణ సభకు అధ్యక్షత వహించి ఈ పదవి పొందిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 1962లో మహారాష్ట్ర గవర్నరుగా నియమించబడి 1964లో సోదరుడు జవహార్‌లాల్ నెహ్రూ మరణంతో ఆ పదవికి రాజీనామా చేసి ఖాళీ అయిన స్థానం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన పిదప అభిప్రాయబేధాల వల్ల పదవులకు దూరంగా ఉన్నారు. జనతాపార్టీ కాలంలో 1979లో  ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమీషన్‌లో భారత ప్రతినిధిగా వ్యవహరించారు.

విభాగాలు: ఉత్తరప్రదేశ్ ప్రముఖులు, భారతదేశ ప్రముఖ మహిళలు, మహారాష్ట్ర గవర్నర్లు, 1900లో జన్మించినవారు, 1990లో మరణించినవారు,  3వ లోకసభ సభ్యులు,


 = = = = =


17, జనవరి 2014, శుక్రవారం

పద్మజా నాయుడు (Padmaja Naidu)

పద్మజా నాయుడు
(1900-1975)
జననంనవంబరు 17, 1900
రంగంజాతీయ ఉద్యమం, ఖాదీ ప్రచారం
పదవులుపశ్చిమ బెంగాల్ గవర్నరు
మరణంమే 2, 1975
పద్మజా నాయుడు 1900, నవంబరు 17న హైదరాబాదులో జన్మించారు. తల్లి సరోజినీ నాయుడు వలె ఈమె కూడా దేశశ్రేయస్సు కోసం పాటుపడింది. 21 సంవత్సరాల వయస్సులోనే జాతీయ స్థాయిలో ఖాదీ ప్రచారం కల్పించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో, మరియు ఖాదీ ప్రచారంలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1956-67 కాలంలో పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పనిచేశారు. అంతకు ముందు పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించారు. రెడ్‌క్రాస్‌లోనూ కృషిచేసి 1971-72లో భారత రెడ్‌క్రాస్ చైర్మెన్‌గా వ్యవహరించారు. ఈమె సేవలకు గుర్తింపుగా డార్జిలింగ్‌లోని ఒక పార్కుకు పద్మజానాయుడు పేరు పెట్టబడింది. 1962లో భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. మే 2, 1975న పద్మజానాయుడు కొత్త ఢిల్లీలో మరణించారు.
 
పద్మజానాయుడికి జిన్నా భార్యతో మరియు నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్‌తో సన్నిహిత సంబందాలుండేవి. జవహల్‌లాల్ నెహ్రూతో కూడా సన్నిహితంగా మెలిగినట్లు పలువులు చరిత్రకారులు పేర్కొనగా, చరిత్రకారుడు పపుల్ జయకర్ మాత్రం గవర్నర్ పదవి విరమణ నుంచి మరణించే వరకు నెహ్రూతో కలిసి ఉండిందని పేర్కొన్నారు.
 
 
ఇవి కూడా చూడండి:


విభాగాలు: భారతదేశ ప్రముఖ మహిళలు, జాతీయోద్యమ నాయకులు, పశ్చిమబెంగాల్ గవర్నర్లు, 1900లో జన్మించినవారు, 1975లో మరణించినవారు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు మహిళలు (రచన: వాసా ప్రభావతి) 
  • మహిళా మూర్తులు,
  •  


Tags: Padmaji naidu in telugu, Padmaji Naidu Essay,

23, ఆగస్టు 2014, శనివారం

భారతదేశము - మొట్టమొదటి వ్యక్తులు (First Persons in India)


రాష్ట్రపతులు - ఉపరాష్ట్రపతులు:
ప్రధానమంత్రులు - ఉపప్రధానమంత్రులు:
  • భారత దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి → జవహార్ లాల్ నెహ్రూ.
  • భారత దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి → ఇందిరా గాంధీ
  • భారత దేశపు మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిసర్దార్ పటేల్
  • భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి → మురార్జీ దేశాయ్
  • రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి → ఇందిరా గాంధీ
  • లోక్‌సభ విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి → వి.పి.సింగ్
  • పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి → మురార్జీ దేశాయ్
  • పార్లమెంటు సబ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి → పి.వి. నరసింహారావు.
  • పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి → జవహార్ లాల్ నెహ్రూ
  • భారత దేశపు మొట్టమొదటి దక్షిణాది ప్రధానమంత్రి → పి.వి.నరసింహారావు
కేంద్రమంత్రులు:
  • స్వతంత్ర బారత మొట్టమొదటి హోంశాఖ మంత్రి → వల్లభ్ భాయి పటేల్
  • భారతదేశపు మొట్టమొదటి కేంద్రవిద్యాశాఖ మంత్రి → మౌలానా అబుల్ కలాం ఆజాద్
  • స్వతంత్ర బారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి → బి.ఆర్.అంబేద్కర్
  • స్వతంత్ర బారత మొట్టమొదటి ఆరోగ్యశాఖ మంత్రి → అమృత్ కౌర్
  • స్వతంత్ర బారత మొట్టమొదటి రైల్వేశాఖ మంత్రి → జాన్ మథాయ్
  • స్వతంత్ర బారత మొట్టమొదటి పరిశ్రమలశాఖ మంత్రి → ఎస్.పి.ముఖర్జీ
  • స్వతంత్ర బారత మొట్టమొదటి రక్షణశాఖ మంత్రి → బల్‌దేవ్ సింగ్
  • పోర్ట్ పోలియో లేని మొట్టమొదటి కేంద్ర మంత్రి → గోపాల స్వామి అయ్యంగార్
ముఖ్యమంత్రులు:
  • భారత దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి → సుచేతా కృపాలానీ
  • రెండు రాష్ట్రాలకు ముఖ్యంమంత్రి గా పని చేసిన మొట్టమొదటి భారతీయుడు → ఎన్.డి.తివారి
  • దేశంలో మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి → దామోదరం సంజీవయ్య
  • దేశంలో మొట్టమొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి → మాయావతి
  • రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టుటవల్ల అధికారం కోల్పోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రి → గోపీచంద్ భార్గవ
  • దక్షిణ భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి → జానకి రామచంద్రన్
  • ముఖ్యమంత్రి పదవిని పొందిన మొట్టమొదటి సినీ నటుడుయం.జి.రామచంద్రన్
  • భారత దేశపు మొట్టమొదటి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి → నంబూద్రిపాద్
  • ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → నీలం సంజీవరెడ్డి
  • తెలంగాణా మొట్టమొదటి ముఖ్యమంత్రికె.చంద్రశేఖరరావు.
  • అస్సాం మొట్టమొదటి ముఖ్యమంత్రి → గోపీనాథ్ బోర్డోలాయ్
  • బీహార్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → శ్రీకృష్ణ సిన్హా
  • బీహార్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి → రబ్రీదేవి
  • ఢిల్లీ మొట్టమొదటి ముఖ్యమంత్రి → చౌదరీ బ్రహ్మప్రకాష్
  • గుజరాత్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → జీవ్‌రాజ్ నారాయణ్ మెహతా
  • హర్యానా మొట్టమొదటి ముఖ్యమంత్రి → పండిత్ భగవత్ దయాళ్ శర్మ
  • కేరళ మొట్టమొదటి ముఖ్యమంత్రి → ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్
  • మధ్యప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → రవిశంకర్ శుక్లా
  • మహారాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి → యశ్వంత్ రావ్ చౌహాన్
  • తమిళనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి → సి.ఎన్.అన్నాదురై
  • మద్రాసు రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి → పి.ఎస్.కుమారస్వామి రాజా
  • జమ్మూ కాశ్మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి → షేక్ అబ్దుల్లా
  • ఉత్తరఖండ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → నారాయణ్ దత్ తివారీ
  • ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → గోవింద వల్లభ్ పంత్
  • పంజాబ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → గోపీచంద్ భార్గవ
  • త్రిపుర మొట్టమొదటి ముఖ్యమంత్రి → సచింద్ర లాల్ సిన్హా
  • పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి ముఖ్యమంత్రి → ప్రపుల్ల చంద్ర ఘోష్
గవర్నర్లు:
  • భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్సరోజినీ నాయుడు (సరోజినీ నాయుడు ముఖ్యమైన జికె పాయింట్లు (యూట్యూబ్ వీడియో))
  • ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్ → సి.యం.త్రివేది
  • తెలంగాణ మొట్టమొదటి గవర్నర్ఇ.ఎస్.ఎల్.నరసింహన్
  • ఝార్ఖండ్ మొట్టమొదటి గవర్నర్ → ప్రభాత్ కుమార్
  • కర్ణాటక మొట్టమొదటి గవర్నర్ → జయ చామరాజ వడయార్ బహదూర్
  • మధ్యప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్ → పట్టాభి సీతారామయ్య
  • పంజాబ్ మొట్టమొదటి గవర్నర్ → సి.యం.త్రివేది
  • రాజస్థాన్ మొట్టమొదటి గవర్నర్ → గురుముఖ్ నిహాల్ సింగ్
  • రాజస్థాన్ మొట్టమొదటి మహిళా గవర్నర్ → ప్రతిభా పాటిల్
  • ఉత్తరా‌ఖండ్ మొట్టమొదటి గవర్నర్ → సుర్జీత్ సింగ్ బర్నాలా
  • పశ్చిమ బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ → సి.రాజగోపాల చారి
  • ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్ → హెచ్.పి.మోడి
న్యాయమూర్తులు:
  • .భారత దేశపు మొట్టమొదటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి → హరిలాల్ జే కానియా
  • సుప్రీం కోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి → మీరా సాహెబ్ ఫాతిమా బీవీ
  • భారత దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ → లీలాసేథ్
  • దేశంలో మొట్తమొదటి మహిళా న్యాయమూర్తి → అన్నా చాందీ
  • ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి → కోకా సుబ్బారావు
  • అంతర్జాతీయ న్యాయస్థానం లో న్యాయమూర్తిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు → బి.ఎన్.రావు
రాజకీయ పార్టీలు:
  • భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు → ఉమేష్ చంద్ర బెనర్జీ
  • భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన మొట్టమొదటి మహిళ → సరోజినీ నాయుడు
  • భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు → బద్రుద్దీన్ త్యాబ్జీ
  • కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మొట్టమొదటి అధ్యక్షుడు → యస్.వి.డాగే
  • జనసంఘ్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు → శ్యాం ప్రసాద్ ముఖర్జీ
  • భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు → అటల్ బిహారీ వాజపేయి
  • తెలుగు దేశం పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడునందమూరి తారక రామారావు.
 లోకసభ / అసెంబ్లీ స్పీకర్లు:
  • లోక్‌సభ మొట్టమొదటి స్పీకర్ → జి.వి.మౌలాంకర్
  • హైదరబాదు రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి స్పీకర్ → కాశీనాథరావు వైద్య.
  • లోక్‌సభ మొట్టమొదటి దళిత స్పీకర్ → జి.యం.సి.బాలయోగి
  • ఒక రాష్ట్రపు అసెంబ్లీకి స్పీకర్ గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ → షాన్నో దేవి
  • ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా స్పీకర్ → ప్రతిభా భారతి
 అవార్డులు / బహుమతులు:
భారతరత్న అవార్డులు:
  • భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయులు → సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజగోపాలా చారి, సి.వి. రామన్
  • భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ → ఇందిరా గాంధీ
  • ప్రధానమంత్రిగా పనిచేస్తూ భారత రత్న అందుకున్న మొట్టమొదటి వ్యక్తి → జవహార్ లాల్ నెహ్రూ
  • భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి ఇంజనీరుమోక్షగుండం విశ్వేశ్వరయ్య
  • భారతరత్వ అవార్డు పొందిన మొట్టమొదటి క్రీడాకారుడు → సచిన్ టెండుల్కర్.
  • మరణానంతరం భారత రత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు → లాల్ బహదూర్ శాస్త్రి
పద్మవిభూషణ్ అవార్డులు:
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి పారిశ్రామిక వేత్త → జే.ఆర్.డి.టాటా
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి రచయిత → సత్యేంద్ర నాథ్ బోస్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు → శివాజీ గణేషణ్
  • పద్మవిభూషణ్ అవార్డు పొందిన మొట్టమొదటి చరిత్ర కారుడు → సర్వేపల్లి గోపాల్ 
నోబెల్ బహుమతులు:
అర్జున అవార్డులు:
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ క్రీడాకారుడు--సలీం దుర్రాని
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--గుర్ బచన్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--నందు నటేకర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు--పి.కే.బెనర్జీ
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--రామనాథన్ కృష్ణన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి గోల్ఫ్ క్రీడాకారుడు--చిరంజీవి మిల్కాసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఆర్చెరీ క్రీడాకారుడు--కృష్ణాదాస్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాస్కెట్ ‌బాల్ క్రీడాకారుడు--సర్బ్‌జిత్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు--జే.పిచ్చయ్య
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ క్రీడాకారుడు--బుడ్డీ డి సౌజా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి క్యారమ్స్ క్ర్రీడాకారుడు--మేరియా ఇరుదయమ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి సైక్లింగ్ క్రీడాకారుడు--అమర్ సింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి ఏక్వెస్ట్రియన్ క్రీడాకారుడు--దఫేదార్ ఖాన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారుడు--శ్యాంలాల్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--పి.సంగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి జూడో క్రీడాకారుడు--సాండే బ్యాలా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రోయింగ్ క్రీడాకారుడు--పర్వీన్ ఒబెరాయ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--కార్నిసింగ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు--జే.సి.ఓరా
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి స్విమ్మింగ్ క్రీడాకారుడు--బజరంగ్ ప్రసాద్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ క్రీడాకారుడు--పాలనిసామి
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు--ఏ.ఎన్.ఘోష్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ క్రీడాకారుడు--ఉడే చాన్ఫ్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ క్రీడాకారుడు--ఎస్.జే.కాంట్రాక్టర్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--అలోక్ కుమార్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--మాన్యువెల్ ఆరోన్
  • అర్జున అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డీ క్రీడాకారుడు--ఆశన్ కుమార్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు:
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ క్రీడాకారుడు--విశ్వనాథన్ ఆనంద్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ క్రీడాకారుడు--గీత్ సేథి
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి--కరణం మల్లేశ్వరి
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు--లియాండర్ పేస్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్ క్రీడాకారుడు--జ్యోతిర్మయి సిక్దర్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి హాకీ క్రీడాకారుడు--ధన్‌రాజ్ పిళ్ళే
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ క్రీడాకారుడు--పుల్లెల గోపీచంద్
  • రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ క్రీడాకారుడు--అభినవ్ బింద్రా
రామన్ మెగ్సేసే అవార్డులు:
  • రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--వినోబా భావే (వినోబాభావే 15 ముఖ్యమైన విషయాలు (యూట్యూబ్ వీడియో))
  • సామాజిక సేవా రంగంలో రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--సి.డి.దేశ్‌ముఖ్
  • రామన్ మెగ్సేసే అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి--యం.ఎస్.సుబ్బలక్ష్మి
మిస్ ఇండియా, వరల్డ్, యూనివర్స్:
  • భారత దేశపు మొట్టమొదటి మిస్ వరల్డ్--రీటా పారియా
  • భారత దేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్--సుశ్మితా సేన్
  • మిస్ యూనివర్స్ లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు--ఇంద్రాణి రెహ్మాన్
  • మిస్ వరల్డ్ లో పాల్గొన్న మొట్టమొదటి భారతీయురాలు--ప్లెయుర్ ఎజెకీల్ (Fleur Ezekiel)
  • మిస్ ఆసియా-పసిపిక్ గెల్చిన మొట్టమొదటి భారతీయురాలు--దియా మీర్జా
జ్ఞాన్‌పీఠ్ అవార్డులు
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి రచయిత-- శంకర్ కురూప్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మహిళా రచయిత్రి--ఆశాపూర్ణదేవి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి తెలుగు రచయిత--విశ్వనాథ సత్యనారాయణ
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి హిందీ రచయిత--సుమిత్రా నందన్ పంత్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఉర్దూ రచయిత--ఫిరాఖ్ గోరఖ్ పురి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మళయాళం రచయిత--శంకర్ కురూప్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి బెంగాలీ రచయిత--తారా శంకర్ బందోపాధ్యాయ
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కన్నడ రచయిత--కే.వి.పుట్టప్ప
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి గుజరాతి రచయిత--ఉమా శంకర్ జోషి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి ఒరియా రచయిత--గోపీ కాంత్ మహంతి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మరాఠి రచయిత--విష్ణు శంకర్ ఖందేల్కర్
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి పంజాబీ రచయిత--అమృతా ప్రీతం
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి కాశ్మీరీ రచయిత--రెహమాన్ రాహి
  • జ్ఞాన్ పీఠ్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి అస్సామీ రచయిత--బీరేంద్ర కుమార్ భట్టాచార్య
దాదా సాహెబ్ అవార్డులు
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--దేవికా రాణి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు--పృథ్వీరాజ్ కపూర్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి దర్శకుడు--బి.ఎన్.రెడ్డి
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి నిర్మాత--బి.ఎన్.సిర్కార్
  • దాదా సాహెబ్ అవార్డు పొందిన మొట్టమొదటి సంగీత దర్శకుడు--పంకజ్ ముల్లిక్
ద్రోణాచార్య అవార్డులు:
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి అథ్లెటిక్స్ కోచ్--ఓ.యం.నంబియార్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి క్రికెట్ కోచ్--దేశ్ ప్రేమ్ ఆజాద్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్ కోచ్--నయీముద్దీన్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వాలీబాల్ కోచ్--రమణారావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బిలియర్డ్స్ కోచ్--విల్సన్ జోన్స్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి హాకి కోచ్--గుడియల్ సింగ్ భాంగు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాక్సింగ్ కోచ్--ఓం ప్రకాష్ భరద్వాజ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి రెజ్లింగ్ కోచ్--భులచంద్ భాస్కర్ భగవత్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి చెస్ కోచ్--రఘునందన్ వసంత్ గోఖలే
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి వెయిట్‌లిఫ్టింగ్ కోచ్--పాల్‌సింగ్ సాంధు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి బాడ్మింటన్ కోచ్--ఎస్.ఎం.ఆరిఫ్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి ఖోఖో కోచ్--గోపాల పురుషోత్తం
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి షూటింగ్ కోచ్--సన్నీ థామస్
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి కబడ్డి కోచ్--ప్రసాద్ రావు
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి యాచింగ్ కోచ్--హెచ్.డి.మోతివాలా
  • ద్రోణాచార్య అవార్డు పొందిన మొట్టమొదటి స్క్వాష్ కోచ్--సైరిష్-యం-పోంచా
ఇతర అవార్డులు:
  • బోర్లాగ్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--అమృతా ప్రీతం
  • ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--భాను అథియ్య
  • మూర్తిదేవి అవార్డును పొందిన మొట్టమొదటి రచయిత్రి--ప్రతిభా రే
  • భట్నాగర్ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ--అసిమా చటర్జీ
  • రష్యా దేశపు ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు--చండ్ర రాజేశ్వర రావు
  • పాకిస్తాన్ ప్రభుత్వపు నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డును స్వీకరించిన మొట్టమొదటి భారతీయుడు-- మురార్జీ దేశాయ్
  • బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
  • విక్టోరియా క్రాస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఖుదాదాద్ ఖాన్
  • పరమ వీర చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--మేజర్ సోమనాథ్ శర్మ
  • అశోక చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--నీరజా భానట్
  • సాంస్కృతిక అవగాహనలో యూథాంట్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--వినోబా భావే
  • జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--మదర్ థెరీసా
  • వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎస్.స్వామినాథన్
  • టెంపుల్టన్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.రాధాకృష్ణన్
  • ఆంగ్ల భాష తరపున సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన మొట్టమొదటి భారతీయుడు--ఆర్.కే.నారాయణ
  • ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి--ఇంద్రజిత్ గుప్తా
అధికార పదవులు:
  • భారతదేశపు మొట్టమొదటి మహిళా డి.జి.పి--కంచన్ భట్టాచార్య
  • భారతదేశపు మొట్టమొదటి ఎన్నికల కమీషనర్--సుకుమార్ సేన్
  • భారతదేశపు మొట్టమొదటి మహిళా ఎన్నికల కమీషనర్--వి. యస్. రమాదేవి
  • భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐ.ఏ.ఎస్.అధికారిణి--అన్నా రాజం జార్జి
  • భారతదేశపు మొట్టమొదటి మహిళా మేయర్--తారా చెరియన్
  • భారతదేశపు మొట్టమొదటి పీల్డ్ మార్షల్--ఎస్.హెచ్.ఎప్.జే.మానెక్ షా
  • భారత నౌకాదళంలో మొట్టమొదటి అడ్మిరల్--ఆర్.డి.కటారి
  • భారతదేశపు మొట్టమొదటి కమాండర్-ఇన్-ఛీప్--కే.యం.కరియప్ప
  • భారత నౌకాదళంలో వైస్ అడ్మిరల్ స్థాయికి చేరిన మొట్టమొదటి మహిళ--పునీతా అరోరా
  • భారత దేశపు మొట్టమొదటి మహిళా రాయబారి--విజయ లక్ష్మీ పండిత్
  •  ఐ.పి.ఎస్ అధికారిణి అయిన మొట్టమొదటి భారతీయ మహిళ--కిరణ్ బేడి
  • ఐ.సి.ఎస్.ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్రనాథ్ ఠాగూర్
  • ప్రసార భారతి బోర్డు మొట్టమొదటి చైర్మెన్--నిఖిల్ చక్రవర్తి
  • బ్రిటన్ కు భారత మొట్టమొదటి హై కమీషనర్--వి.కే.కృష్ణమీనన్
  • యూనివర్శిటి గ్రాంట్స్ కమీషన్ మొట్టమొదటి చైర్మెన్--ఎస్.ఎస్.భట్నాగర్
  • స్వతంత్ర భారత మొట్టమొదటి విదేశాంగ కార్యదర్శి--కే.పి.ఎస్.మీనన్
సాహస కృత్యాలు:
  • ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహిర్ సేన్
  • పాక్ జలసంధి ని ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహీర్ సేన్
  • ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--టెన్సింగ్ నార్కే
  • ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ--బచేంద్రీపాల్
  • దక్షిణ దృవం చేరిన మొట్టమొదటి భారతీయుడు--జే.కే.బజాజ్
  • ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ--సంతోష్ యాదవ్
  • అంటార్కిటికా వెళ్ళు బారత బృందానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి భారతీయుడు--ఎస్.జడ్,ఖాసిమ్
  • ఉత్తర దృవం పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మొట్టమొదటి భారతీయుడు--సంజయ్ థాపర్
  • ఉత్తర దృవం లో భారత త్రివర్ణ పతాకం ఎగుర వేసిన మొట్టమొదటి భారతీయ మహిళ--ప్రీతి సేన్ గుప్తా
  • ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడు--ఫూ డొర్జు
  • పనామా కాలువ ను ఈదిన మొట్టమొదటి భారతీయుడు--మిహిర్ సేన్
క్రీడలు:
క్రికెట్ 
టెస్ట్ క్రికెట్
  • టెస్ట్ క్రికెట్ కు మొట్టమొదటి భారత కెప్టెన్--సి.కే.నాయుడు
  • ఇంగ్లాండు తరఫుఅ టెస్ట్ క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడు--రంజిత్ సింగ్
  • భారత్ కు టెస్ట్ విజయాన్ని అందించిన మొట్టమొదటి భారతీయ కెప్టెన్--లాలా అమర్‌నాథ్
  • టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--పాలీ ఉమ్రీగల్
  • టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--వీరెంద్ర సెహ్వాగ్
  • టెస్ట్ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--వినోద్ కాంబ్లీ
  • ఒకే టెస్ట్ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించిన మొట్టమొదట్ బ్యాట్స్ మెన్--విజయ్ హజారే
  • ఒకే టెస్టు మ్యాచ్ లో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన మొటమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్టు క్రికెట్ లో 100 మ్యాచ్ లు ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి భారతీయుడు--సునిల్ గవాస్కర్
  • టెస్ట్ క్రికెట్ లో 11,000 పరుగులు పూర్తిచేసిన మొట్టమొదటి భారతీయుడు-- సచిన్ టెండుల్కర్
  • టెస్ట్ క్రికెట్ ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--కపిల్ దేవ్
  • టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయబౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 600 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్‌లో 6 పోర్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్‌మెన్--సందీప్ పాటిల్
  • టెస్ట్ క్రికెట్ లో ఇన్నింగ్స్ లోని మొత్తం 10 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్--అనిల్ కుంబ్లే
  • టెస్ట్ క్రికెట్ లో 400 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--కపిల్ దేవ్
  • టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--హర్భజన్ సింగ్
  • వికెట్ కీపర్ కాకుండా టెస్టు క్రికెట్ లో 100 క్యాచ్ లు పట్టిన మొట్టమొదటి భారతీయ ఫీల్డర్--సునీల్ గవాస్కర్
  • లార్డ్స్ లో 3 టెస్ట్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ వెంగ్‌సర్కార్
వన్డే క్రికెట్
  • వన్డే క్రికెట్ లో 100 వికెట్లు సాధించిన మొట్టమొదటి బౌలర్--కపిల్ దేవ్
  • వన్డే క్రికెట్ లో 200 వెకెట్లు సాధించిన మొట్టమొదటి స్పిన్నర్--అనిల్ కుంబ్లే
  • 400 వన్డే మ్యాఛ్ లను ఆడిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వన్డే క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి భారతీయుడు--సచిన్ టెండుల్కర్
  • వన్డే క్రికెట్ లో భారత మొట్టమొదటి కెప్టెన్--వాడేకర్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి కెప్టెన్--వెంకట్ రాఘవన్
  • ప్రపంచ కప్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్--చేతన్ శర్మ
ట్వంటీ-20
  • ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్ కు మొట్టమొదటి భారత కెప్టన్--వీరేంద్ర సెహ్వాగ్
  • ట్వంటీ-20 క్రికెట్ ప్రపంచ కప్ సాదించిన భారత సారధి --మహేంద్రసింగ్ ధోని
ఫస్ట్ క్లాస్ క్రికెట్
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విజయ్ హజారే
టెన్నిస్
  • వింబుల్డన్ టెన్నిస్ లో సీడింగ్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--దిలీప్ బోస్
  • వింబుల్డన్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు--నిహాల్ సింగ్
  • వింబుల్డన్ మూడో రౌండ్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి-- సానియా మీర్జా
  • గ్రాండ్‌స్లాం టెన్నిస్ మ్యాచ్‌ను గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--నిరుపమ వైద్యనాథన్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--లియాండర్ పేస్
  • జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయ బాలిక--సానియా మీర్జా
  • టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెల్చిన మొట్టమొదటి భారతీయుడు--మహేష్ భూపతి
చదరంగం:
  • చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ పొందిన మొట్టమొదటి భారతీయుడు--విశ్వనాథన్ ఆనంద్
ఇతర క్రీడలు
  • ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత అంశంలో స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడు--అభినవ్ బింద్రా
  • ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--ప్రకాష్ పదుకొనె
  • ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్ పోటీలో పైనల్స్ కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళ--పి.టి.ఉష
  • ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన మొట్టమొదటి మహిళ--కరణం మల్లేశ్వరీ
  • ఫార్మూలా వన్ రేసులో పాల్గొన్న మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ఏవన్ గ్రాండ్ ప్రి టైటిల్ గెలుపొందిన మొట్టమొదటి భారతీయుడు--నారాయణ్ కార్తికేయన్
  • ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు--విల్సన్ జోన్స్
  • ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ--కమల్ జిత్ సాంధు
  • ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ పోటీలలో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--అంజు బాబీ జార్జ్
ఆర్థికం:
  • బ్రిటీష్ వారి దోపిడి సిద్దాంతాన్ని పేర్కొన్న మొట్టమొదటి భారతీయుడు-- దాదాబాయి నౌరోజీ
  • ఆర్థిక సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు-- కే.సి.నియోగి
  • ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి-- అమర్త్యాసేన్
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు గవర్నర్ అయిన మొట్టమొదటి భారతీయుడు-- సి.డి.దేశ్‌ముఖ్
  • నీతి ఆయోగ్ మొట్టమొదటి వైస్‌చైర్మెన్-- అరవింద్ పనగరియ.
సినిమా రంగం:
  • దేశంలో మూకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి వ్యక్తి-- దాదా సాహెబ్ పాల్కే
  • దేశంలో టాకీ చిత్రాన్ని నిర్మించిన మొట్టమొదటి దర్శకుడు-- ఆర్దేశిన్ ఇరానీ
  • దేశంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు-- బేగం పాతిమా సుల్తానా
  • మనదేశంలో మొట్టమొదటి సినిమా హీరోయిన్-- దేవికా రాణి
  • మనదేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి నటి-- నర్గీస్ దత్
  • రాజ్యసభ కు ఎన్నికైన మొట్టమొదటి సినీ నటి-- నర్గిస్ దత్
  • సెలెబ్రిటి బిగ్‌బ్రదర్ టి.వి.షో గెల్చిన మొట్టమొదటి భారతీయ నటి-- శిల్పాశెట్టి
చరిత్ర:
  • భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పాలకుడు--అజాతశతృవు
  • జైనులలో మొట్టమొదటి తీర్థంకరుడు--వృషభనాథుడు
  • భారత్ లో మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత--మహాపద్మ నందుడు
  • నంద వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--మహాపద్మ నందుడు
  • శిశునాగ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--శిశునాగుడు
  • కుషాన్ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి కాడ్‌పైనస్
  • మౌర్య సామ్రాజ్యపు మొట్టమొదటి రాజు--చంద్రగుప్త మౌర్యుడు
  • వేంగీ చాళుక్య మొట్టమొదటి రాజు--కుబ్జ విష్ణువర్థనుడు
  • కళ్యాణి చాళుక్య మొట్టమొదటి రాజు--తైలపుడు
  • బాదామి చాళుక్య మొట్టమొదటి రాజు--మొదటి పులకేశి
  • నవీన పల్లవ రాజులలో మొట్టమొదటి పాలకుడు--సింహవిష్ణువు
  • చోళవంశపు మొట్టమొదటి రాజు--విజయాలయ చోళుడు
  • చౌహాన్ రాజులలో మొట్టమొదటి రాజు--విశాలదేవ
  • ప్రతీహార వంశ మొట్టమొదటి పాలకుడు--నాగబట్టుడు
  • కాణ్వా వంశపు మొట్టమొదటి రాజు--వాసుదేవ కాణ్వ
  • రాష్ట్రకూట రాజులలో మొట్టమొదటి రాజు--దంతిదుర్గుడు
  • ఇక్ష్వాకులలో మొట్టమొదటి రాజు--క్షాంతమూలుడు
  • పుష్యబూతి వంశపు మొట్టమొదటి రాజు--ప్రభాకర వర్థనుడు
  • భారత్ - చైనా ల మధ్య దౌత్య సంబంధాలను ప్రారంభించిన మొట్టమొదటి భారత పాలకుడు--హర్ష వర్థనుడు
  • శాలంకాయనులలో మొట్టమొదటి రాజు--విజయదేవ వర్మ
  • దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి మహిళ-- రుద్రమదేవి
  • సేవ వంశపు రాజులలో మొట్టమొదటి రాజు--విజయాలయ సేన
  • శుంగ వంశపు రాజులలో మొట్టమొదటి పాలకుడు--పుష్యమిత్ర శుంగుడు
  • శాతవాహన రాజులలో మొట్టమొదటి పాలకుడు--శ్రీముఖుడు
  • కాకతీయ రాజులలో మొట్టమొదటి పాలకుడు--మొదటి బేతరాజు
  • రెడ్డి రాజులలో మొట్టమొదటి పాలకుడు--ప్రోలయ వేమారెడ్డి
  • విజయనగర సామ్రాజ్యపు సంగమ వంశపు మొట్టమొదటి రాజు--హరిహర రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు సాళ్వ వంశపు మొట్టమొదటి రాజు--సాళ్వ నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు తుళ్వ వంశపు మొట్టమొదటి రాజు--వీర నరసింహ రాయలు
  • విజయనగర సామ్రాజ్యపు ఆర్వీటి వంశపు మొట్టమొదటి రాజు--తిరుమల రాయలు
  • బానిస వంశపు మొట్టమొదటి సుల్తాను--కుతుబుద్దీన్ ఐబక్
  • ఖిల్జీ వంశపు మొట్టమొదటి సుల్తాను--జలాలుద్దీన్ ఖిల్జీ
  • తుగ్లక్ వంశపు మొట్టమొదటి సుల్తాను--గియాసుద్దీన్ తుగ్లక్
  • సయ్యద్ వంశపు మొట్టమొదటి సుల్తాను--ఖిజిర్ ఖాన్ సయ్యద్
  • లోఢి వంశపు మొట్టమొదటి సుల్తాను--బహలూల్ లోఢి
  • మరాఠా రాజులలో మొట్టమొదటి పాలకుడు--శివాజీ
  • పీష్వా లలో మొట్టమొదటి పాలకుడు--బాలాజీ విశ్వనాథ్
  • ఢిల్లీ సంహాసనం ఎక్కిన మొట్టమొదటి భారతీయ మహిళ--రజియా సుల్తానా
  • మొఘల్ చక్రవర్తులలో మొట్టమొదటి పాలకుడు--బాబర్
  • టోకెన్ కరెన్సీ ని విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు--ముహమ్మద్ బిన్ తుగ్లక్
జాతీయోద్యమం:
  • స్వరాజ్ పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు-- దయానంద సరస్వతి
  • జాతీయ డిమాండు గా స్వరాజ్య ను ఉద్ఘాటించిన మొట్టమొదటి భారతీయుడు-- బాల గంగాధర తిలక్
  • వ్యక్తిగత సత్యాగ్రహం చేసి అరెస్టు అయిన మొట్టమొదటి సత్యాగ్రహి--వినోభా భావే
  • భారత్ లో కార్మిక ఉద్యమాన్ని నడిపిన మొట్టమొదటి నాయకుడు--ఎన్.ఎం.లొఖండే
  • ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయుడు--లాలా లజపతి తాయ్
  • రాయల్ సొసైటీ లో సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయుడు--జగదీశ్ చంద్ర బోస్
  • బారత దేశపు మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్--సి. రాజగోపాలాచారి
  • బ్రిటీష్ పార్లమెంటు సబ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--దాదా భాయి నౌరోజీ
  • రాయల్ సొసైటీ సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయుడు--శ్రీనివాస రామానుజమ్
  • మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగంఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్
  • వైశ్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో సభ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--సత్యేంద్ర-పి-సిన్హా
  • బ్రిటీష్ ఇంపీరియల్ కౌన్సిల్ లో సభ్యుడైన మొట్టమొదటి భారతీయుడు--పిరోజ్ షా మెహతా
శాస్త్ర, సాంకేతిక రంగాలు:
  • సున్నాను ఒక సంఖ్యగా పరిగణించిన మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త--బ్రహ్మగుప్తుడు
  • హృదయ మార్పిడి చేసిన మొట్టమొదటి భారతీయ వైద్యుడు--డా. వి.వేణుగోపాల్
ఇతరములు:
  • అంతరిక్షం లోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు--రాకేష్ శర్మ
  • బారత దేశపు మొట్టమొదటి కవి--వాల్మీకి
  • బారత దేశపు మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు--కే.సి. నియోగి
  • సాహిత్య అకాడమీ మొట్టమొదటి అధ్యక్షుడు--జవహార్ లాల్ నెహ్రూ
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి భారతీయుడు-- అటల్ బిహారీ వాజపేయి
  • ఐక్యరాజ్య సమితి సాధారణ సభ కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి--విజయలక్ష్మీ పండిత్
  • యునెస్కో సమావేశంలో సంగీతం వినిపించిన మొట్టమొదటి భారతీయుడు--రవిశంకర్
  • బ్రిటన్ లో ఒక విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు--స్వరాజ్ పాల్
  • ఇండియన్ ఎయిర్ లైన్స్ మొట్టమొదటి మహిళా పైలెట్--దుర్గా బెనర్జీ
  • ఢిల్లీ మొట్టమొదటి మేయర్--అరుణా ఆసఫ్ అలీ
  • భారత దేశపు మొట్టమొదటి మహిలా రైల్వే డ్రైవర్--సురేఖా యాదవ్
  • లేబర్ కమీషన్ మొట్టమొదటి అధ్యక్షుడు--గజేంద్ర గడ్గర్
  • మహిళా విశ్వవిద్యాలయం ను స్థాపించిన మొట్టమొదటి భారతీయుడు--డి.కే. కార్వే
  • మొట్టమొదటి భారతదేశపు అంధ పార్లమెంటు సభ్యుడు--జమునా ప్రసాద్ శాస్త్రి
  • బుకర్ ప్రైజ్ గెల్చిన మొట్టమొదటి భారతీయ మహిళ--అరుంధతీ రాయ్
ఇవి కూడా చూడండి:

హోం,
విభాగాలు: భారతదేశానికి సంబంధించిన పట్టికలు, జనరల్ నాలెడ్జి,





వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులు
(అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తం)
800 ప్రశ్నలు, ముఖ్యమైన పట్టికలు, రూ 30/- మాత్రమే
మరిన్ని వివరాలకు క్రింది లింకు చూడండి లేదా కాల్ చేయండి 9491 388 389
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక