నాంపల్లి ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
నాంపల్లి ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

26, నవంబర్ 2020, గురువారం

నాంపల్లి మండలం (Nampally Mandal)

జిల్లాహైదరాబాదు
రెవెన్యూ డివిజన్హైదరాబాదు
అసెంబ్లీ నియోనాంపల్లి
లోకసభ నియోసికింద్రాబాదు
రెవెన్యూ గ్రామాలు
2
(ఇది హైదరాబాదు జిల్లా నాంపల్లి మండలానికి చెందిన వ్యాసము. నల్గొండ జిల్లా నాంపల్లి వ్యాసం కోసం ఇక్కడ చూడండి)
 
నాంపల్లి హైదరాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం హైదరాబాదు జిల్లాలో భౌగోళికంగా మధ్యలో ఉంది. పురాతనమైన కట్టడాలు, చారిత్రక ఆనవాళ్లకు ఈ మండలం ప్రసిద్ధి చెందింది. మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. మండలం దక్షిణ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది.
 
తెలంగాణ రాష్ట్రంలోనే తొలి కళాశాల అయిన నిజాం కళాశాల ఈ మండలంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనం, హైదరాబాదు స్టేషన్‌గా పిల్వబడే నాంపల్లి రైల్వేస్టేషన్, చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్, రాష్ట్రంలోనే అతి పెద్ద బస్ స్టేషన్ అయిన ఎంజీబీఎస్, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఉన్న గన్‌ఫౌండ్రి, పండ్ల విక్రయాలకౌ పేరుపొందిన జామ్‌బాగ్, రాష్ట్ర ఆడిటు సంచాలకుల మరియు భీమా కార్యాలయాలున్న ఇన్సూరెన్స్ భవనం, ఇంటర్మీడియత్ బోర్డ్ కార్యాలయం ఈ మండలంలో ఉన్నాయి.. 
 
 
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా నాంపల్లి మండలం హైదరాబాదు జిల్లాలో మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన ఖైరతాబాదు మండలం, ఈశాన్యాన హయత్‌నగర్ మండలం, తూర్పున అంబర్‌పేట్ మండలం, దక్షిణాన చార్మినార్ మండలం మరియు బహదూర్‌పుర మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా మూసీనది ప్రవహిస్తోంది.

రవాణా సౌకర్యాలు:
నాంపల్లి నుంచి బేగంపేట వైపు రైలుమార్గం ఉంది. తెలంగాణలోనే తొలి సారిగా నాంపల్లి నుంచి వాడి వరకు రైలుమార్గం నిర్మించబడింది. జాతీయ రహదారి కూడా మండలం మీదుగా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
ఈ మండలము నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాదులో నాంపల్లి (జాంబాగ్) 77వ వార్డులో, గన్‌ఫౌండ్రి 78వ వార్డులో, బేగంబజార్ 5వ వార్డులో, మంగల్‌హాట్ 63వ వార్డులో, బర్కత్‌పూర 80వ వార్డులో, గోషామహల్ 51వ వార్డులో భాగంగా ఉంది. ఈ డివిజన్లు గోషామహల్ సర్కిల్‌లో, ఖైరతాబాదు జోన్‌లో భాగంగా ఉన్నాయి.
 
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
నాంపల్లి (Nampally),  తోతగూడ (Tothaguda),
 
మండల పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాలు:
సుల్తాన్ బజార్, కాచిగూడ, గాంధీభవన్, నాంపల్లి, మహరాజ్‌గంజ్, అఫ్జల్ గంజ్, చాదర్‌ఘాట్, నిజాం కాలేజి, గోషామహల్, ఎల్బీ స్టేడియం, మేటర్నిటి హాస్పిటల్, మంగల్‌హాట్, బేగంబజార్, ఫ్లక్‌నూమ, గన్‌ఫౌండ్రి, జాంబాగ్, గౌలిగూడ, రాంకోటి, బ్యాంక్ స్ట్రీట్, తిలక్ రోడ్, అగాపుర, హష్మత్ గంజ్, కింగ్ కోటి, ముస్లింజంగ్ పూల్, చిరాగ్ అలీ రోడ్, మోజంజాహి మార్కెట్, చుడిబజార్, ట్రూప్ బజార్
ప్రముఖ రెవెన్యూ గ్రామాలు / ప్రాంతాలు:
.



ఇవి కూడా చూడండి:
 
ఫోటో గ్యాలరీ

(నాంపల్లి రైల్వేస్టేషన్)
(జూబ్లిహాల్)
c c



హోం,
విభాగాలు:
హైదరాబాదు జిల్లా మండలాలు, నాంపల్లి మండలం, 
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Hyderabad Dist, 2013,
  • Handbook of Census Statistics, Hyderabad District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • హైదరాబాదు జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://hyderabad.telangana.gov.in/te/ (Official Website of Hyderabad District)


Nampally Mandal in Telugu, Hyderabad Dist (district) Mandals in telugu, Hyderabad Dist Mandals in telugu,

19, నవంబర్ 2020, గురువారం

హైదరాబాదు (Hyderabad)

స్థాపన
క్రీ.శ.1591
రాష్ట్రం
తెలంగాణ
జనాభా
68 లక్షలు (2011)
వైశాల్యం
625 చకిమీ
భారతదేశంలోనే ప్రముఖ నగరాలలో ఒకటైన హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉంది. భాగ్యనగర్ అని కూడా పిల్వబడే ఈ నగరం సాఫ్ట్‌వేర్ రంగంలో పేరుగాంచింది. సికింద్రాబాదు హైదరాబాదుకు జంటనగరం. క్రీ.శ.1591లో కులీ కుతుబ్ షాచే నిర్మించబడిన హైదరాబాదు దినదినాభివృద్ధి చెంది 2011 లెక్కల ప్రకారం 68 లక్షల జనాభాకు కల్గియుంది. కృష్ణానదికి ఉపనది అయిన మూసీనది నగరం గుండా ప్రవహిస్తోంది. బిర్లామందిర్, గోల్కొండ కోట, చార్మినార్, నెహ్రూ జూపార్క్, దుర్గంచెరువు, రామోజీ ఫిలింసిటి, సాలార్జంగ్ మ్యూజియం నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.
 
భౌగోళికం:
హైదరాబాదు నగరం ద్వీపకల్ప బారతదేశంలో దాదాపు మధ్యబాగంలో ఉంది. నగరం గుండా మూసీనది ప్రవహిస్తోంది. సముద్రమట్టం నుంచి సుమారు 541 మీ ఎత్తున ఉంది. నగర వైశాల్యం 625 చకిమీ. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ నగరంలోని ప్రధాన చెరువులు. హైదరాబాదు జిల్లా పూర్తిగా మరియు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో పాక్షికంగా వ్యాపించియుంది. 2011 లెక్కల ప్రకారం హైదరాబాదు జనాభా 68 లక్షలు.

చరిత్ర:
క్రీ.శ.1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాదు నిర్మాతగా పేరుపొందాడు. అదివరకు కుతుబ్‌షా పాలకులకు గోల్కొండ రాజధానిగా ఉండేది. రాజధానిని హైదరాబాదుకు మార్చిన పిదప చార్మినార్ నిర్మించబడింది. కుతుబ్‌షాహీలు, మొఘలులు, నిజాంషాహీలు హైదరాబాదు కేంద్రంగా పాలించారు. నిజాం కాలంలో 1908లో మూసీనది వరదల వల్ల అపార ప్రాణ, ఆస్తినష్తం జరిగింది. 1948 సెప్టెంబరు 17న విమోచనోద్యం వల్ల మరియు సర్దార్ పటేళ్ సాహసంతో చేపట్టిన ఆపరేషన్ పోలో వల్ల నిజాం పాలన అంతమై భారత యూనియన్‌లో విలీనమైంది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో కలిసే వరకు హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా ఉండింది. 1956-2014 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగి జూన్ 2, 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజధానిగా కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 1969లో మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రముఖపాత్ర పోషించారు. పలు విద్యార్థులు ప్రాణత్యాగం చేసి అమరులైనారు.

నగర పాలన:
హైదరాబాదు నగర పాలన గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ (GHMC)చే సాగుతుంది. నగరపాలక సంస్థ 6 జోన్లుగా, 30 సర్కిళ్ళుగా, 150 వార్డులుగా విభజించబడి ఉంది. 2007లో పరిసర పురపాలక సంఘాలను విలీనంచేసి గ్రేటర్‌గా చేయబడింది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదుకు చెందిన విమానాశ్రయం శంషాబాదులో ఉంది. ఇది రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల్వబడుతుంది. సికింద్రాబాదు ప్రముఖ జంక్షన్ మరియు దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రధానకేంద్రము గానూ ఉంది. సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు రైళ్ళు ప్రయాణిస్తాయి. నగరంలో ఎంఎంటీఎస్ మరియు మెట్రో రైలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. జాతీయ రహదారి సంఖ్య 44, 65, 202 నగరం గుండా వెళ్ళుచున్నాయి. నగరంలో ప్రధాన బస్‌స్టేషన్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్. ఉత్తరాది జిల్లాకు వెళ్ళే బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి వెళ్తుంటాయి.

విద్య:
1918లోనే హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. నిజాం కళాశాల తెలంగాణలోనే అతి పురాతనమైన కళాశాల. అఘోరనాథ చటోపాధ్యాయ ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం మరియు ఇతర పలు విశ్వవిద్యాలయాలు నగరంలో ఉన్నాయి.
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు-రాజధానులు, తెలంగాణ, హైదరాబాదు,


 = = = = =


8, నవంబర్ 2020, ఆదివారం

విభాగము: హైదరాబాదు జిల్లా మండలాలు (Portal: Hyderabad District Mandals)

 
విభాగము: హైదరాబాదు జిల్లా మండలాలు
(Portal: Hyderabad Dist Mandals)
  1. అంబర్‌పేట్ మండలం (Amberpet Mandal),
  2. హిమాయత్ నగర్ మండలం (Himayathnagar Mandal),
  3. నాంపల్లి మండలం (Nampally Mandal),
  4. ఆసిఫ్‌నగర్ మండలం (Asifnagar Mandal),
  5. సైదాబాద్ మండలం (Saidabad Mandal),
  6. బహదూర్‌పుర మండలం (Bahadurpura Mandal),
  7. బండ్లగూడ మండలం (Bandlaguda Mandal),
  8. గోల్కొండ మండలం (Golkonda Mandal),
  9. చార్మినార్ మండలం (Charminar Mandal),
  10. అమీర్‌పేట్ మండలం (Ameerpet Mandal),
  11. తిరుమలగిరి మండలం (Tirumalagiri Mandal),
  12. మారెడ్‌పల్లి మండలం (Maredpally Mandal),
  13. షేక్‌పేట్ మండలం (Shaikpet Mandal),
  14. ఖైరతాబాద్ మండలం (Khairatabad Mandal),
  15. సికింద్రాబాదు మండలం (Secunderabad Mandal),
  16. ముషీరాబాద్ మండలం (Musheerabad Mandal),

హోం,
విభాగాలు: హైదరాబాదు జిల్లా, తెలంగాణ మండలాలు,

హైదరాబాదు జిల్లా (Hyderabad District)

వైశాల్యం
217 చకిమీ
జనాభా
39,43,323
మండలాలు
16
రెవెన్యూ డివిజన్లు
2
లోక్‌సభ స్థానాలు
2
అసెంబ్లీ స్థానాలు
15
తెలంగాణలో భౌగోళికంగా చిన్న జిల్లా హైదరాబాదు. జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 రెవెన్యూ మండలాలు, 67 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ జిల్లా పూర్తిగా పట్టణ ప్రాంతము మరియు గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థలో భాగంగా ఉంది. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాదు నగరం జిల్లా మరియు రాష్ట్ర కేంద్రము. మూసీనది హైదరాబాదు మధ్యగా ప్రవహిస్తోంది. ఈ జిల్లా మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లా లచే ఆవరించబడి ఉంది. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 39,43,323,  వైశాల్యం 217 చకిమీ.  బిర్లామందిర్, చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కామసీదు, నెహ్రూ జూ పార్క్ హైదరాబాదులోని ప్రముఖ సందర్శనీయ స్థలాలు.

చరిత్ర:
1591లో కుతుబ్ షాహీ సుల్తాన్ చే నిర్మించిబడిన హైదరాబాదు ఆ తర్వాత నిజాం షాహీలకు కూడా రాజధానిగా కొనసాగింది. 1948లో భారత యూనియన్‌లో విలీనమైన పిదప హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా, 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా వ్యవహరిస్తోంది. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్రాత్మక వందేమాతరం ఉద్యమం జరిగింది. 1969 మరియు 2009-14 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది.

పర్యాటకం:
కుతుబ్‌షాహీ మరియు నిజాంషాహీల కాలం నాటి పలు నిర్మాణాలు ప్రస్తుతం హైదరాబాదు నగరంలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సికింద్రాబాదు హైదరాబాదు యొక్క జంటనగరం. సాఫ్ట్ వేర్ రంగంలో పేరుపొందిన హైటెక్ సిటి ప్రాంతం కలుపుకొని హైదరాబాదును ట్రైసిటీస్‌గా పిలుస్తుంటారు.
హైదరాబాదు నగర పాలన గ్రేటర్ హైదరాబాదుచే నిర్వహించబడుతున్నది. 1933లో ప్రారంభమైన నగరపాలక సంస్థ కొంతకాలానికి నగరపాలక హోదా కోల్పోయిననూ 1950లో మళ్ళీ నగరపాలక సంస్థగా అవతరించింది. 1960లో సికింద్రాబాదు నగరపాలక సంస్థ హైదరాబాదు కార్పోరేషన్‌లో విలీనమైంది. 2007లో పరిసర 12 పురపాలక సంఘాలు నగరపాలక సంస్థలో విలీనం కావడంతో గ్రేటర్‌గా అవతరించింది.

విద్యాసంస్థలు:
హైదరాబాదు జిల్లాలో 1565 ప్రాథమిక పాఠశాలలు, 568 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1344 ఉన్నత పాఠశాలలు, 9 కేంద్రీయ పాఠశాలలు, 317 జూనియర్ కళాశాలలు, 215 డిగ్రీ కళాశాలలు, 17 ఇంజనీరింగ్ కళాశాలలు, 9 ఫార్మసి కళాశాలలు, 18 బీఎడ్ కళాశాలలు, 10 న్యాయ కళాశాలలు ఉన్నాయి. రాష్ట్రంలోనే పురాతనైమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం జిల్లాలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాదులో ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల్వబడుతుంది. హైదరాబాదు నుంచి దేశంలోని ప్రధాన నగరాలను కల్పుతూ రైలు మరియు రోడ్డు మార్గాలున్నాయి. దేశంలోనే పొడవైన కన్యాకుమార్-శ్రీనగర్ జాతీయ రహదారి నెం.44, ముంబాయి-విజయవాడ జాతీయ రహదారి నెం.65, జాతీయ రహదారి నెం. 202 హైదరాబాదు గుండా వెళ్తున్నాయి. సికింద్రాబాదు ముఖ్యమైన రైల్వేజంక్షన్‌గా ఉంది. దక్షిణమధ్యరైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాదులో ఉంది. వాడి, కాజీపేట, ముద్ఖేడ్, డోన్ వైపు రైలుమార్గాలున్నాయి. నగరంలో MMTS మరియు మెట్రోరైలు ప్రజలకు సౌకర్యంగా ఉంది.

రాజకీయాలు:
జిల్లాలో 2 లోక్‌సభ నియోజకవర్గాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సికింద్రాబాదు నుంచి లోక్‌సభకు విజయం సాధించిన కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. ఇదివరకు సికింద్రాబాదు నుంచి విజయం సాధించిన పి.శివశంకర్ మరియు బండారు దత్తాత్రేయలు కూడా కేంద్రమంత్రులుగా పనిచేశారు. జిల్లా మొత్తం గ్రేటర్ హైదరాబాదులో భాగంగా ఉంది. గ్రేటర్ హైదరాబాదులోని 15 డివిజన్లలో అత్యధికభాగంగా హైదరాబాదు జిల్లాకు చెందినవి.
 
హైదరాబాదు జిల్లా మండలాలు
అమీర్‌పేట్, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, అంబర్‌పేట్, హిమాయత్‌నగర్, నాంపల్లి, షేక్‌పేట్, ఖైరతాబాదు, ఆసిఫ్‌నగర్, సైదాబాదు, బహదూర్ పురా, బండ్లగూడ, సికింద్రాబాదు, ముషీరాబాదు, గోల్కొండ, చార్మినార్.
-
.



ఇవి కూడా చూడండి:
 
ఫోటో గ్యాలరీ
c
c
c c



హోం,
విభాగాలు:
తెలంగాణ జిల్లాల వ్యాసాలు, హైదరాబాదు జిల్లా
 
 
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Hyderabad Dist, 2013,
  • Handbook of Census Statistics, Hyderabad District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • హైదరాబాదు జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://hyderabad.telangana.gov.in/ (Official Website of Hyderabad Dist),
  • తెలంగాణ మాసపత్రిక సంచికలు,


Alwal Mandal in Telugu, Medchal Malkajgiri Dist (district) Mandals in telugu, Medchal Dist Mandals in telugu,

11, డిసెంబర్ 2018, మంగళవారం

తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు (Telangana Assembly Constituencies)

తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు - శాసనసభ్యులు (2018-23)
ని.
సంఖ్య
నియోజకవర్గం పేరుశాసనసభ్యుని పేరుపార్టీ
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా
1సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంకోనేరు కోనప్పతెరాస
2చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం (SC)బాల్క సుమన్తెరాస
3బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (SC)దుర్గం చిన్నయ్యతెరాస
4మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంనడిపల్లి దావకర్ రావుతెరాస
5ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (ST) ఆత్రం సక్కుకాంగ్రెస్ పార్టీ
6ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (ST)రేఖానాయక్తెరాస
7ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గంజోగు రామన్నతెరాస
8బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం (ST)రాథోడ్ బాపూరావ్తెరాస
9నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గంఅల్లోల ఇంద్రకరణ్ రెడ్డితెరాస
10ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గంజి.విఠల్ రెడ్డితెరాస
ఉమ్మడి నిజామాబాదు జిల్లా
11ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంఆశన్నగారి జీవన్ రెడ్డితెరాస
12బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంషకీల్ అహ్మద్తెరాస
13జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం (SC)హన్మంతు షిండేతెరాస
14బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంపోచారం శ్రీనివాస్ రెడ్డితెరాస
15ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంనల్లమడుగు సురేందర్కాంగ్రెస్ పార్టీ
16కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంగంప గోవర్థన్తెరాస
17నిజామాబాదు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గంగణేష్ బిగాలతెరాస
18నిజామాబాదు (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గంబాజిరెడ్డి గోవర్థన్తెరాస
19బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంవేముల ప్రశాంత్ రెడ్డితెరాస
ఉమ్మడి కరీంనగర్ జిల్లా
20కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంకల్వకుంట్ల విద్యాసాగర్ రావుతెరాస
21జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంసంజయ్ కుమార్తెరాస
22ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం (SC)కొప్పుల ఈశ్వర్తెరాస
23రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంకోరుకంటి చందర్AISB
24మంథని అసెంబ్లీ నియోజకవర్గందుద్దిళ్ల శ్రీధర్ బాబుకాంగ్రెస్ పార్టీ
25పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గందాసరి మనోహర్ రెడ్డితెరాస
26కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంగంగుల కమలాకర్తెరాస
27చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం (SC)సుంకె రవిశంకర్తెరాస
28వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంచెన్నమనేని రమేష్ బాబుతెరాస
29సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంకె.తారక రామారావుతెరాస
30మానుకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC)రసమయి బాలకిషన్తెరాస
31హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంఈటెల రాజేందర్తెరాస
32హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంవడితెల సతీష్తెరాస
ఉమ్మడి మెదక్ జిల్లా
33సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంతన్నీరు హరీష్ రావుతెరాస
34మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంపద్మాదేవేందర్ రెడ్డితెరాస
35నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంభూపాల్ రెడ్డితెరాస
36ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) చంటి క్రాంతి కిరణ్తెరాస
37నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంచిలుముల మదన్ రెడ్డితెరాస
38జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) మాణిక్ రావుతెరాస
39సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంతూర్పు జయప్రకాశ్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
40పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంగూడెం మహిపాల్ రెడ్డితెరాస
41దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంసోలిపేట రామలింగారెడ్డితెరాస

ఉప ఎన్నిక (2020)
ఎం.రఘునందన్ రావు
తెరాస
42గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంకె.చంద్రశేఖర్ రావుభాజపా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
43మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంసీహెచ్ మల్లారెడ్డితెరాస
44మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గంమైనంపల్లి హన్మంతరావుతెరాస
45కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంకేపీ వివేకానందతెరాస
46కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంమాధవరం కృష్ణారావుతెరాస
47ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంబేతి సుభాష్ రెడ్డితెరాస
48ఇబ్రహింపట్నం అసెంబ్లీ నియోజకవర్గంమంచిరెడ్డి కిషన్ రెడ్డితెరాస
49లాల్ బహదూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంసుధీర్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
50మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంసబితా ఇంద్రారెడ్డికాంగ్రెస్ పార్టీ
51రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంప్రకాష్ గౌడ్తెరాస
52శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంఅరికెపూడి గాంధీతెరాస
53చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం (SC) కాలె యాదయ్యతెరాస
54పరిగి అసెంబ్లీ నియోజకవర్గంకొప్పుల మహేశ్వర్ రెడ్డితెరాస
55వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (SC)మెతుకు ఆనంద్తెరాస
56తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంరోహిత్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
ఉమ్మడి హైదరాబాదు జిల్లా
57ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంముఠా గోపాల్తెరాస
58మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంఅబ్దుల్లా బిల్ అబ్దుల్ బలాలాఎంఐఎం
59అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంకాలేరు వెంకటేశ్తెరాస
60ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గందానం నాగేందర్తెరాస
61జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంమాగంటి గోపీనాథ్తెరాస
62సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతలసాని శ్రీనివాస్ యాదవ్తెరాస
63నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంజాఫర్ హుస్సేన్ మెరాజ్ఎంఐఎం
64కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంకౌసర్ మెయినుద్దీన్ఎంఐఎం
65గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంటి.రాజాసింగ్భాజపా
66చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంముంతాజ్ అహ్మద్ ఖాన్ఎంఐఎం
67చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంఅక్బరుద్దీన్ ఓవైసీఎంఐఎం
68యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంఅహ్మద్ పాషాఖాద్రిఎంఐఎం
69బహదుర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంమహ్మద్ మౌజంఖాన్ఎంఐఎం
70సికింద్రాబాదు అసెంబ్లీ నియోజకవర్గంటి.పద్మారావుతెరాస
71సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం (SC)జి.సాయన్నతెరాస
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
72కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపట్నం నరేందర్ రెడ్డితెరాస
73నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంఎస్.రాజేందర్ రెడ్డితెరాస
74మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంశ్రీనివాస్ గౌడ్తెరాస
75జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంచెర్నకోల లక్ష్మారెడ్డితెరాస
76దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంఆల వెంకటేశ్వర్ రెడ్డితెరాస
77మఖ్తల్ అసెంబ్లీ నియోజకవర్గంచిట్టెం రామ్మోహన్ రెడ్డితెరాస
78వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంసింగిరెడ్డి నిరంజన్ రెడ్డితెరాస
79గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంబండ్ల కృష్ణమోహన్ రెడ్డితెరాస
80ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) అబ్రహాంతెరాస
81నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంమర్రి జనార్థన్ రెడ్డితెరాస
82అచ్చంపేట్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) గువ్వల బాలరాజ్తెరాస
83కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంజైపాల్ యాదవ్తెరాస
84షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంఅంజయ్య యాదవ్తెరాస
85కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంబీరం హర్షవర్థన్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
ఉమ్మడి నల్గొండ జిల్లా
86దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం (ST)రమావత్ రవీంద్రనాయక్తెరాస
87నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంనోముల నర్సింహయ్యతెరాస
87ఉప ఎన్నిక (2020)


88మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంనల్లమోతు భాస్కర్ రావుతెరాస
89హుజుర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంఉత్తమ్‌ కుమార్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
90కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంబొల్లం మల్లన్నయాదవ్తెరాస
91సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంజగదీశ్ రెడ్డితెరాస
92నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంకంచర్ల భూపాల్ రెడ్డితెరాస
93మునుగోడ్ అసెంబ్లీ నియోజకవర్గంకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికాంగ్రెస్ పార్టీ
94భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంపైళ్ళ శేఖర్ రెడ్డితెరాస
95నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) చిరుమర్తి లింగయ్యకాంగ్రెస్ పార్టీ
96తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం (SC)గ్యాదరి కిశోర్తెరాస
97ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గంగొంగడి సునీతతెరాస
ఉమ్మడి వరంగల్ జిల్లా
98జనగామ అసెంబ్లీ నియోజకవర్గంముత్తిరెడ్డి యాదగిరితెరాస
99స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం (SC)తాటికొండ రాజయ్యతెరాస
100పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంఎర్రబెల్లి దయాకర్ రావుతెరాస
101డోర్నకల్  అసెంబ్లీ నియోజకవర్గం (ST)రెడ్యానాయక్తెరాస
102మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (ST)బానోర్ శంకర్ నాయక్తెరాస
103నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంపెద్ది సుదర్శన్తెరాస
104పరకాల అసెంబ్లీ నియోజకవర్గంచల్లా ధర్మారెడ్డితెరాస
105వరంగల్ (పడమర) అసెంబ్లీ నియోజకవర్గందాస్యం వినయ్ భాస్కర్తెరాస
106వరంగల్ (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గంనన్నపనేని నరేందర్తెరాస
107వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం (SC)ఆరూరి రమేశ్తెరాస
108భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగండ్ర వెంకట రమణాచారికాంగ్రెస్ పార్టీ
109ములుగు అసెంబ్లీ నియోజకవర్గం (ST)డి.అనసూయ (సీతక్క)కాంగ్రెస్ పార్టీ
ఉమ్మడి ఖమ్మం జిల్లా
110పినపాక అసెంబ్లీ నియోజకవర్గం (ST)రేగా కాంతారావుకాంగ్రెస్ పార్టీ
111ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం (ST)బానోత్ హరిప్రియ నాయక్కాంగ్రెస్ పార్టీ
112ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంపువ్వాడ అజయ్ కుమార్తెరాస
113పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం
కందాల ఉపేందర్‌రెడ్డికాంగ్రెస్ పార్టీ
114మధిర అసెంబ్లీ నియోజకవర్గం (SC)భట్టి విక్రమార్కకాంగ్రెస్ పార్టీ
115వైరా అసెంబ్లీ నియోజకవర్గం (ST)రాములు నాయక్ఇండిపెండెంట్
116సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (SC)సండ్ర వెంకట వీరయ్యతెదేపా
117కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంవనమా వెంకటేశ్వరరావుకాంగ్రెస్ పార్టీ
118అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం (SC)మచ్చా నాగేశ్వరరావుతెదేపా
119భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం (ST)పాదెం వీరయ్యకాంగ్రెస్ పార్టీ

హోం,
ఇవి కూడా చూడండి:
ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులు,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ సభ్యులు,
 ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన 16వ లోకసభ సభ్యులు,
విభాగము:ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ మంత్రులు,
13వ శాసనసభ సభ్యులు,


3, జూన్ 2018, ఆదివారం

కొండమల్లేపల్లి మండలం (Konda Mallepalli Mandal)

కొండమల్లేపల్లి మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గందేవరకొండ
లోకసభ నియోజకవర్గంనల్గొండ
కొండమల్లేపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. దేవరకొండ మండలంలోని 14 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఇది దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండల కేంద్రం మల్లేపల్లి రహదారుల ప్రముఖ కూడలిగా ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున పెద్ద ఆదిశర్లపల్లి మండలం, దక్షిణాన నేరెడిగొమ్ము మండలం, పశ్చిమాన దేవరకొండ మండలం, ఉత్తరాన నాంపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
మల్లేపల్లి రహదారుల ప్రముఖ కూడలిగా ఉంది. హైదరాబాదు, దేవరకొండ, నల్గొండ, మిర్యాలగూడ వెళ్ళు రహదారులు ఈ కూడలి వద్ద ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు:
Achampet-Patti-Perwal, Channamunenipally, Channaram, Chinna Adiserlapally, Chinthakuntla, Doniyal, Fakeerpur, Ghaji Nagar, Gummadavally, Kolmanthala Pahad, Konda Mallepally, Pendli Pakala, Vardhamaniguda, Yepur.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c c
c c


హోం,
విభాగాలు:
నల్గొండ జిల్లా మండలాలు,  కొండమల్లేపల్లి మండలము, దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Kondapallepalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

గుర్రంపోడ్ మండలం (Gurrampode Mandal)

గుర్రంపోడు మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గంనాగార్జునసాగర్
లోకసభ నియోజకవర్గంనల్గొండ
గుర్రంపోడు నల్గొండ జిల్లాకు చెందిన మండలము.మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలకేంద్రం అక్షాంశరేఖాంశాలు 16.8667° ఉత్తర అక్షాంశం,79.1167° తూర్పు రేఖాశం. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మండలానికి సాగునీరు లభిస్తుంది.

సరిహద్దులు:
ఈ మండలం భౌగోళికంగా నల్గొండ జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన చండూర్, కనగల్ మండలాలు, తూర్పున హాలియా మండలం, ఆగ్నేయన పెద్దవూర మండలం, ద్క్షిణాన పెద్ద ఆదిశర్లపల్లి మండలం, నైరుతిన కొండమల్లేపల్లి మండలం, పశ్చిమాన నాంపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.


మండలంలోని గ్రామాలు:
Amaloor, Bollaram patti Kopp, Chamled, Chepur, Chinthaguda, Gurrampodu, Junuthala, Kacharam patti Kop, Kalwapalli, Kondapur, Koppole, Kothalapur, Mailapur, Makkapalli, Mosangi, Mulkalapalli, Nadikuda, Pallipahad, Palwai, Parlapalli, Pochampalli, Shakajipur, Sulthanpuram, Thanedarpally, Thenepally, Utlapalli, Vattikodu.

ప్రముఖ గ్రామాలు
పాల్వాయి (Palwai):
ఈ గ్రామంలో పురాతన శిలాలయం ఉంది. ఫిబ్రవరి 2011లో గ్రామంలో కాకతీయుల కాలం నాటి శిలాశాసనం వెలుగుచూసింది.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c c
c c


హోం,
విభాగాలు:
నల్గొండ జిల్లా మండలాలు,  గుర్రంపోడ్ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Gurrampode Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

16, మార్చి 2018, శుక్రవారం

నాంపల్లి మండలం (Nampalli Mandal)

నాంపల్లి మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గంమునుగోడు
లోకసభ నియోజకవర్గంభువనగిరి
(ఇది నల్గొండ జిల్లా నాంపల్లి మండలమునకు చెందిన వ్యాసము. హైదరాబాదు జిల్లా నాంపల్లి మండల వ్యాసం కోసం ఇక్కడ చూడండి)
 
నాంపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.. మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలు కలవు. 2016 జిల్లాల పునర్విభజన సమయంలో ఈ మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని చండూర్ మండలంలో కలిపారు.

సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున గుర్రంపోడు మండలం, దక్షిణాన కొండమల్లేపల్లి మండలం, పశ్చిమాన చింతపల్లి మండలం, ఉత్తరాన మర్రిగూడ మరియు చండూర్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 38801. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41161. ఇందులో పురుషులు 20695, మహిళలు 20466. అక్షరాస్యత శాతం 53.34%.
మండలంలోని గ్రామాలు:
B Gouraram, B Timmapur, Chittampahad, Damera, Devathpalli, Fakeerpuram, G Mallepally, Ganugupally, Hydlapuram, K Thirumalagiri, Kethepalli, Mahamadapuram, Mallapurajupally , Medlavai, Mustipalli, Nampally, Nerallapalli, Pagidipally, Pasnur, Peddapuram, Reballi, S Lingotam, Sharbhapuram, Sunkishala, T P Gouraram, Thirumalagiri, Thummalapalli, Vaddepally

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం,
విభాగాలు:
నల్గొండ జిల్లా మండలాలు,  నాంపల్లి మండలము, దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Nampalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

10, ఫిబ్రవరి 2018, శనివారం

చింతపల్లి మండలం (Chintapalli Mandal)

 చింతపల్లి మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గందేవరకొండ
లోకసభ నియోజకవర్గంనల్గొండ
చింతపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు కలవు.

సరిహద్దులు:
ఈ మండలం నల్గొండ జిల్లాలో పశ్చిమ వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి తూర్పున నాంపల్లి మండలం, ఉత్తరాన మర్రిగూడ మండలం, దక్షిణాన దేవరకొండ మండలం, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44053, 2011 నాటికి జనాభా 898 పెరిగి 44951 కు చేరింది. ఇందులో పురుషులు 22723, మహిళలు 22228.
మండలంలోని గ్రామాలు:
Anajipur, Chakalisheripally, Chinthapally, Gadiyagouraram, Godakandla , Homanthalapally, Kokkirala Gouraram, Kurmapally, Kurmedu, Madhanapuru, Mallareddypally, Nasarlapally, Nelvalapally, P.K Mallepally, Polepally Ramnagar, Takkalapally, Teeded, Thirumalapuram, Ummapuram, Upparapally, Varkala, Vinjamoor,

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ

2016కు ముందు నల్గొండ జిల్లాలో
చింతపల్లి మండల స్థానం
c
c c


విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు,  చింతపల్లి మండలము, దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Chintapalli Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

చండూర్ మండలం (Chandur Mandal)

 చండూర్ మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ నల్గొండ
అసెంబ్లీ నియోజకవర్గంమునుగోడు
లోకసభ నియోజకవర్గంభువనగిరి
చండూర్ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఇది నల్గొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది.

సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మునుగోడు మండలం, తుర్పున నల్గొండ మండలం, ఈశాన్యాన నార్కెట్‌పల్లి మండలం, దక్షిణాన నాంపల్లి మండలం, పశ్చిమాన మర్రిగూడ మండలం, ఆగ్నేయాన గుర్రంపోడు మండలం, వాయువ్యాన యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47189, 2011 నాటికి జనాభా 1603 పెరిగి 48792 కు చేరింది. ఇందులో పురుషులు 24790, మహిళలు 24002. పట్టణ జనాభా 10842, గ్రామీణ జనాభా 37950.
మండలంలోని గ్రామాలు:
Angadipeta, Bangarigadda, Bodangparthy, Chamalapally, Chandur, Donipamula, Gattuppal, Gundrepally, Idikuda, Kastala, Kondapuram, Kummandaniguda, Nermata, Pullemla, Shirdepally, Theretpally, Thummalapally, Udtalapally

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ

2016కు ఉందు నల్గొండ జిల్లాలో
చండూర్ మండల స్థానం
c
c c


విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు,  చండూర్ మండలము, నల్గొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Chandur Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మర్రిగూడ మండలం (Marriguda Mandal)

మర్రిగూడ మండలం
జిల్లా నల్గొండ
రెవెన్యూ డివిజన్ దేవరకొండ
అసెంబ్లీ నియోజకవర్గంమునుగోడు
లోకసభ నియోజకవర్గంభువనగిరి
మర్రిగూడ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఇది దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, 15 గ్రామపంచాయతీలు కలవు. విమోచనోద్య పోరాటయోధులు పొనుగోటి మాధవరావు, పండ్రప్రగడ శ్రీధరరావు, మార్నేని మేల్కి ఈ మండలానికి చెందినవారు.

సరిహద్దులు:
ఈ మండలానికి ఈశాన్యాన మరియు తుర్పున చండూరు మండలం, దక్షిణాన నాంపల్లి మరియు చింతపల్లి మండలాలు, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, ఉత్తరాన యాదాద్రి భువనగిరి జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 36946, 2011 నాటికి జనాభా 393 తగ్గి 36553 కు చేరింది. ఇందులో పురుషులు 18608, మహిళలు 17945.
మండలంలోని గ్రామాలు:
Anthampet, Bhatlapally, Damera Bheemanapally, Indurthy, Khudabakshpally, Kondur, Lenkalapally, Marriguda, Metichandapur, Namapur, Sarampet, Somarajguda, Tammadapally, Tirugandlapally, Vattipally, Venkepally , Yerugandlapally

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
2016కు ముందు నల్గొండ జిల్లాలో
మర్రిగూడ స్థానం
మర్రిగూడ స్థానం
(గూగుల్ మ్యాప్)

c c


విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు,  మర్రిగూడ మండలము, దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 245 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


tags: Marriguda Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక